75 బాలు హిట్స్: గాన గంధర్వుని స్పెషల్

75 బాలు హిట్స్: గాన గంధర్వుని స్పెషల్

75 బాలు హిట్స్: గాన గంధర్వుని స్పెషల్

75 బాలు హిట్స్: గాన గంధర్వుని స్పెషల్

ఆయన స్వరం భాస్వరం.. ఆయన సర్వస్వము సంగీతమయం. పదుల తరాలు గుర్తుపెట్టుకునే చరిత్ర ఆయన ప్రస్థానం. నటనలోని నవరసాల్ని గొంతులో పలికించగల గాన గంధర్వులు, “బాలు” అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే మన శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం.

ప్రతిఒక్కరూ “మా వాడు” అనిపించుకున్న బాలు మనల్ని విడిచి వెళ్ళినప్పటికీ.. స్వరం, సాహిత్యం ఉన్నంత కాలం గతించిపోని గాత్రం ఆయనది. పాడుతా తీయగా అంటూ తెలుగువాళ్ళ మనసుల్లో చెరిగిపోని మద్ర వేసుకున్న మహానుభావుడికి వందనాలు సమర్పిస్తూ, ఆయన పాడిన ఎన్నో వేల తెలుగు పాటల నుంచి కొన్ని మరపురాని పాటలు మీకోసం.

దాదాపు 16 భాషల్లో 40వేల పాటలు పాడగా, 94-95 దశకం తరువాత దాదాపుగా ఆయన పాడిన పాటలు శ్రోతలకు పరిచయం ఉన్న కారణంగా, అంతకు ముందు ఉన్న పాటల్ని మాత్రమే ఈ లిస్ట్ లో చేర్చడం జరిగంది.

కావున, ఈ ప్రయత్నం కేవలం ఆయన్ని స్మరించుకునేందుకే తప్ప ఒక సంఖ్యకు కుదించడమో లేదా తక్కిన పాటల మీద చిన్నచూపు మాత్రం కాదని గమనించగలరు!

  1. మేడంటే మేడ  కాదు – సుఖ దు:ఖాలు

  2. చిన్నదాన నన్ను విడిచి – నేనంటే నేనే

  3. రావమ్మా మహాలక్ష్మి రావమ్మ  – ఉండమ్మా బొట్టు పెడతా

  4. ఎన్నాళ్ళో వేచిన ఉదయం – మంచి మిత్రులు

  5. విశాల గగనంలో – మహాబలుడు

  6. చిలిపి నవ్వుల – ఆత్మీయులు

  7. తూరుపు సింధూరపు – మనుషులు మారాలి

  8. ప్రతి రాత్రి వసంత రాత్రి – ఏకవీర

  9. ఈ రేయి తీయనిది – చిట్టి చెల్లెలు

  10. మామ చందమామ – సంబరాల రాంబాబు

  11. చరణ కింకిణులు – చెల్లెలి కాపురం

  12. కనుల ముందు నీవుంటే  – చెల్లెలి కాపురం

  13. రిమ్ జిమ్ రిమ్ జిమ్ – మట్టిలో మాణిక్యం

  14. తనివి తీరలేదే – గూడుపుఠాణి

  15. ఏ దివిలో విరిసిన పారిజాతమో –  కన్నె వయసు

  16. దోర వయసు చిన్నది – దేవుడు చేసిన మనుషులు

  17. ఇదే పాట ప్రతి నోట – పుట్టినిల్లు మెట్టినిల్లు

  18. కల చెదరింది – దేవదాసు 1974

  19. నిన్ను మరచిపోవాలని – మంచి మనుషులు

  20. కదిలింది కరుణ రథం – కరుణామయుడు

  21. స్నేహమే నా జీవితం –  నిప్పులాంటి మనిషి

  22. గులాబి పువ్వై – అన్నదమ్ముల అనుబంధం

  23. మరుమల్లియ కన్నా తీయనిది – మల్లెపువ్వు

  24. శంకరా నాద శరీరాపరా – శంకరాభరణం

  25. విధాత తలపున – సిరివెన్నెల

  26. బాబా సాయి బాబా – శిరిడీ సాయి మహత్యం

  27. వేదం అణువణువున నాదం – సాగర సంగమం

  28. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు – అడవి రాముడు

  29. జననీ జన్మ భూమిశ్చ – బొబ్బిలి పులి

  30. మాటే మంత్రము – సీతాకోక చిలుక

  31. రామ కనవేమిరా – స్వాతిముత్యం

  32. శివరంజని – తూర్పు పడమర

  33. అభినవ తారవో – శివరంజని

  34. సిరిమల్లె నీవె – పంతులమ్మ

  35. నేనొక ప్రేమ పిపాసిని – ఇంద్రధనుస్సు

  36. నీ పాపం పండెను నేడు – బుల్లెమ్మ బుల్లోడు

  37. ఓ బంగరు రంగుల చిలుక – తోట రాముడు

  38. తొలి సంధ్య వేళలో – సీతా రాములు

  39. వేదంలా ఘోషించే గోదావరి  – ఆంధ్ర కేసరి

  40. సీతాలు సింగారం – సీతామాలక్ష్మి

  41. మ్రోగింది కళ్యాణ వీణ – కురుక్షేత్రం

  42. రవి వర్మకే అందని – రావణుడే రాముడైతే

  43. జాబిల్లి కోసం  – మంచిమనసులు

  44. కిన్నెరసాని వచ్చిందమ్మా – సితార

  45. చినుకులా రాలి – నాలుగు స్థంభాలాట

  46. మాటరాని మౌనమిది – మహర్షి

  47. కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు – అందమైన అనుభవం

  48. దేహమేరా  దేవాలయం – దేవాలయం

  49. యాతమేసి తోడినా – ప్రాణం ఖరీదు

  50. అరె ఏమైంది – ఆరాధన

  51. కీరవాణి- అన్వేషణ

  52. చుక్కలు తెమ్మన్నా – ఏప్రిల్ 1 విడుదల

  53. మాటేరాని చిన్నదాని – ఓ పాప లాలి

  54. ప్రేమలేదని – అభినందన

  55. ప్రియతమా- ప్రేమ

  56. నీవే అమర స్వరమే – ఘర్షణ

  57. ఎవరికెవరు ఈ లోకంలో – సిరి సిరి మువ్వ

  58. సీతమ్మ అందాలు – శుభ సంకల్పం

  59. చూడు పిన్నమ్మ – చిల్లరకొట్టు చిట్టెమ్మ

  60. ప్రియతమా నీవచట కుశలమా – గుణ

  61. నీ గూడు చెదిరింది – నాయకుడు

  62. తాళికట్టు శుభవేళ – అంతులేని కథ

  63. సాపాటు ఎటూ లేదు – ఆకలి రాజ్యం

  64. నిన్ను తలచి – విచిత్ర సోదరులు

  65. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు – రాక్షసుడు

  66. చిలక ఏ తోడు లేక  – శుభలగ్నం

  67. ఓ పాప లాలి – గీతాంజలి

  68. ఎన్నెన్నో జన్మల బంధం – పూజ

  69. పల్లవించవా నా గొంతులో – కోకిలమ్మ

  70. పుణ్యభూమి నా దేశం – మేజర్ చంద్రకాంత్

  71. జాము రాతిరి – క్షణ క్షణం

  72. హలో గురు ప్రేమ కోసమేరో – నిర్ణయం

  73. ఎన్నెన్నో అందాలు – చంటి

  74. బోటని పాఠముంది – శివ

  75. నా చెలి రోజావే – రోజా

Show comments