చదువుకో లేదు.. కానీ 60 ఏళ్ల వయసులో ఏడాదికి కోటి సంపాదన!

కోట్లు సంపాదించాలంటే.. బాగా చదువుకోవాలని  చాలా మంది చెప్తుంటారు.  కోటీశ్వరుల ఇళ్లలో పుడితే కోట్లు సంపాదించవచ్చని మరికొందరు చెప్తుంటారు. కానీ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కొందరు కోట్లను సంపాదిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్షరం ముక్క రాని వారు కూడా పట్టుదలతో విజయం సాధిస్తున్నారు. వాళ్లను హేళన చేసిన వారు సైతం ముక్కున వేలేసుకునేలా విజయం సాధిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో తిరుగులేకుండా రాణిస్తున్నారు. ఆ జాబితాకు చెందిన వారే నావల్ బెన్ దల్సంగ్ బాయ్ చౌదరి. ఆమె 60 ఏళ్ల వయస్సులో కోట్లు సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మరి ఈమె సక్సెస్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం..

గుజరాత్ కు చెందిన నావల్ బెన్… ఓ సాధారణ, మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ. కరోనా సమయంలో అందరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నావల్ బెన్ మాత్రం తన పాల వ్యాపారం ద్వారా నెలకు కోటీ సంపాదించింది. ఆమె 62 ఏళ్ల వయస్సులో సొంత పశుపోషణ, పాల ఉత్పత్తి వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ వ్యాపారం ప్రారంభించినప్పుడు నావల్ బెన్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినా ఏ మాత్రం భయపడకుండా పట్టుదలతో ఎలాగైనా విజయం సాధించాలని నిశ్చయించుకున్నారు. రేయింబవళ్లు కష్టపడటంతో ఆమె సంస్థ క్రమంగా అభివృద్ధి పథంలోకి వెళ్లింది. 2020-21లో నావల్ బెన్  రెండు కోట్ల రూపాయలకు సంపాందించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి.  పాల వ్యాపారం ద్వారా ఆమె నెలకు రూ.1.3 లక్షలకు పైగా సంపాదిస్తోన్నారు.

గత ఐదేళ్లుగా నావల్ బెన్ ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఏటా కోటి రూపాయలకు పైగా విలువైన పాలను విక్రయిస్తున్నారు. స్థానిక మీడియా,పలు నివేదికల ప్రకారం.. 2021లో నావల్‌బెన్‌ కు 45 ఆవులు, 80కి పైగా గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా పాలను సేకరించి..సమీప గ్రామాలకు పాలను అందించేది. తన విజయాల ఫలితంగా నావల్ బెన్ తన జిల్లాలో మూడుసార్లు ఉత్తమ ‘పశుపాలక్’ అవార్డును గెలుచుకున్నారని మీడియా వర్గాలు తెలిపాయి. అంతేకాక ఆమె మూడు సార్లు “లక్ష్మి” అవార్డును కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. మరి.. ఎంతో మంది మహిళలకు నావల్ బెన్ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమెపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. మరి… ఈ 60 ఏళ్ల సక్సెస్ లేడీ పై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments