ఇవాళ్టి రోజున వాహనం కొనడం కంటే పార్క్ చేయడం మరింత కష్టంగా మారింది. కొంతమంది ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రదేశంలో పార్క్ చేయడం వల్ల వాహనదారులకే కాక, రోడ్డుపై వెళ్ళే ప్రతి ఒక్కరికీ అసౌకర్యంతో పాటు ట్రాఫిక్ జామ్ తో తిప్పలు తప్పడం లేదు. ఈ సమస్యకు కేంద్రం కొత్త పరిష్కారంతో ముందుకొచ్చింది.
రోడ్డుపై రాంగ్ పార్కింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి వాహనాల ఫొటోలు తీసి పంపాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. సదరు వ్యక్తికి రూ.1000/- ఫైన్ పడితే, అందులో రూ.500/- రివార్డు రూపంలో ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ అంశంపై ఒక చట్టాన్ని తీసుకురానున్నట్లుగా స్పష్టం చేశారు.
ఈ విధానం వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు నితిన్ గడ్కరీ. పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాల్లో కాకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్డుపై పార్క్ చేయడంతో ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. వాహనాలు పెరుగుతన్న కొద్దీ, ఈ సమస్య తీవ్రత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.