iDreamPost
android-app
ios-app

3 ఇన్ 1 ఫ్రైడే రిపోర్ట్

  • Published Mar 07, 2020 | 6:04 AM Updated Updated Mar 07, 2020 | 6:04 AM
3 ఇన్ 1 ఫ్రైడే రిపోర్ట్

నిన్న మొత్తం ఐదు సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని పలకరించాయి. అందులో పలాస రా మూవీగా మంచి రిపోర్ట్స్ తెచ్చుకోగా కమర్షియల్ గా ఏ మేరకు వర్కవుట్ అవుతుందన్నది వేచి చూడాలి. ఇక ఓ పిట్ట కథ గట్టెక్కడం కష్టమనేలా టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా చాలా వీక్ గా రావడం దెబ్బ తీసేలా ఉంది. వీటితో పాటు మరో నాలుగు సినిమాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. నలుగురు హీరోయిన్లతో బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో రూపొందిన ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి పెద్దగా అంచనాలు లేకుండా పలకరించింది.

ఓ మర్డర్ కేసులో ఇరుకున్న ఫోర్ గర్ల్స్ స్టోరీతో అడల్ట్ థ్రిల్లర్ గా రూపొందించిన ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కొంతమేరకు బిసి క్లాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఉన్నప్పటికీ వాళ్లకూ పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయింది. ఇక హరి సంతోష్ దర్శకత్వంలో రీమేక్ గా వచ్చి ‘కాలేజీ కుమార్’ పాయింట్ లో కొత్తదనం ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ అవుట్ డేటెడ్ గా ఉండటంతో చూసిన ఆడియన్స్ ఉసురుమనక తప్పలేదు.

కెఎల్ ప్రసాద్ దర్శకత్వంలో జీరో అంచనాలతో వచ్చిన ‘స్క్రీన్ ప్లే’ సైతం రేస్ లో కిందపడిపోయింది. ఇద్దరు భార్యాభర్తల మధ్య సైకలాజికల్ థ్రిల్లర్ గా దీన్ని తీర్చిదిద్దాలనుకున్న ప్రయత్నం బోల్తా కొట్టేసింది. కథలో వైవిధ్యం ఉన్నప్పటికీ దాన్ని ఆసక్తికరంగా మలచలేకపోవడంతో మొత్తంగా వీకెండ్ దాటడం కూడా కష్టమని ట్రేడ్ రిపోర్ట్.

మొత్తానికి పలాసను మినహాయిస్తే ఏదీ కూడా ఓపెనింగ్స్ తో పాటు మంచి టాక్ తెచ్చుకోవడం సక్సెస్ కాలేకపోయాయి. ఈ లెక్కన భీష్మకు మరో జోష్ ఫుల్ వీకెండ్ దొరికినట్టే. ఇప్పటికే దర్జాగా ప్రాఫిట్ జోన్ లోకి ప్రవేశించిన నితిన్ సినిమా ఇప్పటికే అల వైకుంఠపురములో తర్వాత సెకండ్ ర్యాంక్ దక్కింది. ఉగాది దాకా ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. నాని వి వచ్చేదాకా ఈ స్లంప్ ని భరించక తప్పదు. ప్రభుదేవా డబ్బింగ్ సినిమా కృష్ణమనోహర్ ఐపిఎస్ తెలుగు వెర్షన్ వాయిదా పడింది.