iDreamPost
android-app
ios-app

సుప్రీంకోర్టు ఆదేశాలతో 50 ఏళ్ల వయసులో ప్రభుత్వం ఉద్యోగం!

సుప్రీంకోర్టు ఆదేశాలతో 50 ఏళ్ల వయసులో ప్రభుత్వం ఉద్యోగం!

మనకు దక్కాలని రాసి ఉంటే ఎప్పటికైనా దక్కుతుందని పెద్దలు అంటుంటారు. అయితే రాసి ఉంటే దక్కుతుంది కాదా అని కృషి చేయడం మానేస్తే మాత్రం విజయం సాధించకపోవచ్చు. కానీ ఓ వ్యక్తి తనకు రావాల్సిన ఉద్యోగం కోసం పోరాటం చేశాడు. తనకు రాసి పెట్టి ఉంటే అదే వస్తుందిలే అని అనుకుని ఉంటే నేడు అతడు వార్తల్లో నిలిచే వాడే కాదు.  ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్లుగా పోరాటం  చేశాడు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన  తీర్పుతో చివరికి అతను విజయం సాధించి.. ఉద్యోగం పొందాడు. అది కూడా 50 ఏళ్ల వయసులో ఆ ఉద్యోగం సాధించి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అసలు ఎక్కడ జరిగింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో లఖీంపూర్ ఖేరీ పోస్టల్ డివిజన్‌లో 1995 లో 10 పోస్టల్ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యాయి. వాటికి అంకుర్ గుప్తా అనే వ్యక్తి కూడా దరఖాస్తు చేసుకున్నాడు. తపాలా శాఖలో ఉద్యోగానికి ఎంపికైనా ఉద్యోగంలో చేరేందుకు మాత్రం దాదాపు 28ఏళ్ల పోరాటం చేయాల్సి వచ్చింది. చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో 50 ఏళ్ల వయసులో ఆయనకు ఆ ఉద్యోగం లభించింది. రిక్రూట్‌మెంట్‌లో అంకుర్ గుప్తాను అనర్హుడిగా ప్రకటించడంలో తపాల శాఖ తప్పు ఉందని గుర్తించిన సుప్రీం కోర్టు.. అతడిని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

1995లో తపాల శాఖకు సంబందించి ఈ రిక్రూట్మెంట్ నిర్వహించగా.. అంకుర్‌ గుప్తా సహా మెరిట్‌ జాబితాలో ఉన్నవారిని లఖింపుర్‌ ఖేరీ పోస్ట్‌ ఆఫీసులో 15 రోజుల పాటు శిక్షణకు పంపారు. అయితే ఉన్నతాధికారులు ధృవీకరణ పత్రాల  పరిశీలన సమయంలో చేయగా.. ఇంటర్‌ ఒకేషనల్‌ చదివిన అంకుర్‌ గుప్తా సహా మరి కొంతమందిని ఆ ఉద్యోగానికి అనర్హులు అని ప్రకటించింది.దీంతో అంకుర్ గుప్తా సహా బాధితులు అంతా 1996 లో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ ఆశ్రయించారు. చివరకు ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. బాధితులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ప్రస్తుతం అంకుర్ గుప్తా వయసు 50 ఏళ్లు కాగా.. మరో 10 అంటే 60 ఏళ్ల వయసులో ఆయన రిటైర్మెంట్ కానున్నారు. మరి.. ఈ అంకుర్ గుప్తా స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.