iDreamPost
android-app
ios-app

Roshan & Sree Leela : 20 కోట్ల బడ్జెట్ తో కుర్రజంట సినిమా ?

  • Published Feb 16, 2022 | 9:26 AM Updated Updated Feb 16, 2022 | 9:26 AM
  • Published Feb 16, 2022 | 9:26 AMUpdated Feb 16, 2022 | 9:26 AM
Roshan & Sree Leela : 20 కోట్ల బడ్జెట్ తో కుర్రజంట సినిమా ?

మొదటి సినిమా ఫ్లాపయినా దర్శకులకు కాకుండా అందులో నటించిన హీరో హీరోయిన్లకు మంచి క్రేజ్ రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టార్ ఫ్యామిలీ అయితే ఇది సహజం అనుకోవచ్చు. కానీ పెళ్లి సందడి జంట రోషన్ – శ్రీలీల కాంబో మాత్రం ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. రోషన్ తండ్రి శ్రీకాంత్ కూడా సీనియరే అయినప్పటికీ మరీ మెగా లేదా అక్కినేని రేంజ్ కుటుంబం కాదు. అయినా కూడా రోషన్ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు పోటీ పడుతున్నారు.అల్లాటప్పా బ్యానర్లు కాకుండా బడ్జెట్ లో ఏ మాత్రం రాజీ పడని నిర్మాణ సంస్థలే తనను బుక్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఇది ఊహించనిది.

మరోవైపు శ్రీలీల తక్కువ తినలేదు. తక్కువ టైంలోనే ధమాకాలో ఛాన్స్ కొట్టేసింది. రవితేజతో జోడి ఎలా ఉంటుందన్న అనుమానాలు లేకపోలేదు కానీ మాస్ మహారాజా సినిమా హిట్ అయితే దానివల్ల దక్కే బ్రేక్ మాములుగా ఉండదు. ఇక అసలు విషయానికి వస్తే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం రోషన్ శ్రీలీల కాంబినేషన్ లో వైజయంతి మూవీస్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తోందట. సుమారు 20 కోట్ల దాకా బడ్జెట్ లో పాన్ ఇండియా టచ్ తో ప్రెజెంట్ చేయబోతున్నట్టు సమాచారం. కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ కొత్త జానర్ లో దీన్ని రూపొందిస్తారని వినికిడి. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

ఇది కనక కుదిరితే ఈ జంటకు రెండో సినిమా అవుతుంది. నిజానికి మంచి అంచనాలతో వచ్చిన పెళ్లి సందడి ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. అయినా కూడా పండగ సీజన్ ను వాడుకుని కమర్షియల్ గా గట్టెక్కడం ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరిచింది. సినిమా సంగతి ఎలా ఉన్నా వీళ్లిద్దరి కాంబోకు డాన్సులకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే మళ్ళీ రిపీట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రావొచ్చు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో షూటింగులు కొత్త ప్రాజెక్టులతో టాలీవుడ్ కళకళలాడుతోంది. రెండు మూడేళ్ళ దాకా హీరో హీరోయిన్లు బిజీ అయిపోతున్నారు

Also Read : Allu Arjun : భారీ మల్టీ స్టారర్ లో అల్లు అర్జున్

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss