Mercedes-Benz G-Clas కోట్ల విలువ‌చేసే బెంజ్ కారుని తోయ‌డానికి ప‌దిమంది కావాల్సివ‌చ్చింది

సాధారణంగా మనం ఏదైనా వెహికల్ ఆగిపోతే దానిని స్టార్ట్ చేయడానికి, లేదా దానిని ముందుకి తీసుకెళ్లడానికి తోస్తాము. ఒక కార్ ఆగిపోతే నలుగురు లేదా అయిదుగురు తోస్తే ఆ కార్ ముందుకి వెళ్తుంది. చిన్న కార్లు అయితే ఇద్దరు లేదా ముగ్గురు తోసినా ముందుకి వెళ్తాయి. అయితే ఈ బెంజ్ కార్ ఆగిపోతే ఎంతమంది తోసారో తెలుసా?

ఈ మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్‌ను దాని బ్యాటరీ పనిచేయకపోవడంతో దాన్ని స్టార్ట్ చేయడానికి దాదాపు పది మంది వ్యక్తులు కావాల్సి వచ్చింది. ఇది దాదాపు 2.5 టన్నుల బరువు ఉండటంతో ఈ G-క్లాస్‌ బెంజ్ ని అతి కష్టంగా పదిమంది నెట్టారు. ఇలా వెహికల్ ఆగిపోతే నెట్టితే స్టార్ట్ అవుతుందనే అనుకుంటారు. అయితే ఈ మెర్సిడెస్ బెంజ్ కార్ ని కూడా తోస్తే స్టార్ట్ అవుతుందని భావించారు. కానీ ఈ G-క్లాస్‌ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉంటుంది. ఇది ఆగిపోతే కేవలం నెట్టడం ద్వారా ప్రారంభం కాదు.

ఇలాంటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న వాహనాన్ని దాని బ్యాటరీ ఆగిపోతే జంప్-స్టార్ట్ చేయడం ద్వారా స్టార్ట్ చేయించవచ్చు. అయితే ఈ వెహికల్ బ్యాటరీని జంప్-స్టార్ట్ చేయడానికి, మనకి బ్యాటరీ పనిచేసే స్థితిలో ఉన్న ఇంకో వాహనం కావాలి. ఈ ప్రక్రియలో బూస్టర్ కేబుల్స్ సహాయంతో బ్యాటరీల టెర్మినల్స్‌ను కనెక్ట్ చేయడంతో దీని ద్వారా ఎనర్జీ పనిచేసే బ్యాటరీ నుండి ఆగిపోయిన బ్యాటరీకి బదిలీ చేయబడుతుంది. అయితే ఆ బ్యాటరీ కూడా అదే వోల్టేజ్ ది అయి ఉండాలి. ఇలా చేయడం ద్వారా బ్యాటరీ రీఛార్జ్ అయి వెహికల్ తొందరగా స్టార్ట్ అవుతుంది కూడా. మొత్తానికి ఈ బెంజ్ కార్ ని పదిమంది తోయడం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show comments