iDreamPost
android-app
ios-app

అంటే సుందరం బిజినెస్ లెక్కలు

  • Published Jun 09, 2022 | 12:27 PM Updated Updated Jun 09, 2022 | 12:27 PM
అంటే సుందరం బిజినెస్ లెక్కలు

రేపు విడుదల కాబోతున్న న్యాచురల్ స్టార్ నాని అంటే సుందరం మీద మరీ భారీగా కాదు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి. ఎఫ్3 తర్వాత కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసిన ఎంటర్ టైనర్ ఇదే. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వరస హిట్లతో ఇప్పుడు హ్యాట్రిక్ మీద కన్నేసిన వివేక్ ఆత్రేయ దీనికి దర్శకుడు కావడం అంచనాలు పెంచుతోంది. ట్రైలర్ ప్రామిసింగ్ గానే అనిపించింది. ఎప్పుడో రాజారాణి తర్వాత స్క్రీన్ మీద కనిపించకుండా పోయిన నజ్రియా ఈ సినిమాలో హీరోయిన్. ఈమె పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ శ్రీమతన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీదే రూపొందటం విశేషం.

ఇక బిజినెస్ విషయానికి వస్తే అంటే సుందరం థియేట్రికల్ రైట్స్ సుమారు 30 కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఇది డీసెంట్ మొత్తం. మరీ అత్యాశకు పోకుండా హిట్ టాక్ వస్తే డిస్ట్రిబ్యూటర్లు ఈజీగా సేఫ్ అయ్యే మార్గాన్ని చూసుకున్నారు. కాకపోతే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించినంత వేగంగా లేవు. ముఖ్యంగా తెలంగాణలో పాత రేట్లని పైకి చెబుతూ మల్టీప్లెక్సుల్లో 250, సింగల్ స్క్రీన్లలో 175 రూపాయలు ఫిక్స్ చేయడం ఫుట్ ఫాల్స్ ని ప్రభావితం చేస్తోంది. ఏపిలో ఈ ఇబ్బంది లేదు కానీ కరెంట్ బుకింగ్స్ బాగుంటాయని అక్కడి ట్రేడ్ టాక్. ఇక ఏరియాల వారిగా సుందరం చేసుకున్న లెక్కలు చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 12 కోట్లు
సీడెడ్ – 4 కోట్లు
ఉత్తరాంధ్ర – 2 కోట్ల 50 లక్షలు
గుంటూరు – 1 కోటి 50 లక్షలు
ఈస్ట్ గోదావరి – 1 కోటి 60 లక్షలు
వెస్ట్ గోదావరి – 1 కోటి 30 లక్షలు
కృష్ణా – 1 కోటి 40 లక్షలు
నెల్లూరు – 70 లక్షలు
ఏపి తెలంగాణ మొత్తం – 25 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా / ఓవర్సీస్ – 5 కోట్ల 50 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా టోటల్ బిజినెస్ – 30 కోట్ల 50 లక్షలు

ఇప్పటికైతే యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 1 మిలియన్ మొదటి రెండు మూడు రోజుల్లోనే అందుకోవచ్చు. ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద విక్రమ్ స్ట్రాంగ్ గా ఉన్నాడు. మేజర్ కలెక్షన్లలో డ్రాప్ ఉన్నప్పటికీ అర్బన్ ప్రాంతాల్లో స్టడీగా ఉన్నాయి. ఎఫ్3 కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో అంటే సుందరానికి మొదటి వారం చాలా కీలకం కానుంది. ఆపై వారం 17న విరాట పర్వం, గాడ్సే వస్తాయి. అవి సీరియస్ జానర్లు కాబట్టి వాటి నుంచి ముప్పేమీ ఉండదు కానీ సుందరం బాగున్నాడు అనే మాట బయటికి రావడం కీలకం. అసలే కంటెంట్ మీద బోలెడు కాన్ఫిడెన్స్ తో మూడు గంటల నిడివితో వస్తున్నాడు. చూద్దాం