iDreamPost
android-app
ios-app

భార్య దెబ్బకు భర్త రిక్వెస్ట్.. కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చిన జొమాటో?

Zomato: నేటికాలంలో స్విగ్గీ, జోమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో  ఎక్కువ మంది వాటిపైనే ఆధారపడుతున్నారు. జొమాటో తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ మహిళ చేసిన పనికి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Zomato: నేటికాలంలో స్విగ్గీ, జోమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో  ఎక్కువ మంది వాటిపైనే ఆధారపడుతున్నారు. జొమాటో తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ మహిళ చేసిన పనికి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

భార్య దెబ్బకు భర్త రిక్వెస్ట్.. కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చిన జొమాటో?

ప్రస్తుతం చాలా మంది జీవితం అనేది యాంత్రికంగా సాగిపోతుంది. ముఖ్యంగా పట్టణాల్లో ,నగరాల్లో నివాసించే వారు ఉరుకులు పరుగులతో జీవినం సాగిస్తున్నారు. ఇక ఉద్యోగం, వ్యాపారం రీత్యా  ఇంట్లో ఆహారాన్ని తయారు చేసుకుని భుజించే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. స్విగ్గీ, జోమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో  ఎక్కువ మంది వాటిపైనే ఆధారపడుతున్నారు. ఇది ఇలా ఉంటే…జొమాటో తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆపర్లతోపాటు.. యాప్ లో కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. తద్వారా కస్టమర్ల ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీలో వేగం పెరుగుతుంది. ఇదే సమయంలో ఓ వ్యక్తి దెబ్బకు  తాజాగా జొమాటో మరో కొత్త ఫీచర్ ను అందుబాటుకోలోకి తెచ్చింది. మరి.. ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

జొమాటో తీసుకొచ్చిన కొత్త ఫీచర్ విషయం గురించి కాసేపు పక్కన పెడితే.. అందుకు కారణం మాత్రం కరణ్ సింగ్ అనే వ్యక్తి. అతడు ఏమి చేశాడనే సందేహం మీకు రావచ్చు. అయితే అతడు తన భార్య దెబ్బకు తట్టుకోలేక జొమాటోకు తన బాధను వివరించాడు. కరణ్ సింగ్  జొమాటోకి కొన్ని అంశాలను తెలిపారుడ. ఇక కరణ్ సింగ్ పేర్కొన్న వివరాల ప్రకారం..  ఇక నుంచి జొమాటో.. తాను అర్థరాత్రి ఆర్డర్ లను చేయలేనని తెలిపాడు. అందుకు కారణం తన ఫోన్ లోని జొమాటో యాప్ లో ఆర్డర్ హిస్టరీని తన భార్య తనిఖీ చేసిందింట.  దీంతో కరణ్ సింగ్ అర్ధరాత్రి వేళ ఆహారం ఆర్డర్ చేసుకొని తింటున్నట్లు అతడి భార్య గుర్తించింది. తాను ఆర్డర్ చేసిన పుడ్ వివరాలు అతడి భార్యకు తెలియకుండా ఉండేందుకు డిలీట్ చేద్దామంటే.. ఆ ఆఫ్షన్ లేదని బాధ పడ్డాడు. దీంతో ఇక నుంచి  జొమాటో  యాప్ ద్వారా  ఫుడ్ ఆర్డర్ చేయలేని తెలిపాడు. ఒక వేళ ఆర్డర్ చేయాలంటే.. హిస్టరీని తొలగించే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావాలని కరణ్ సింగ్ జొమాటోకు విజ్ఞప్తి చేశాడు.

ఇక అతడు తెలిపిన అంశంపై జొమాటో కు..సీరియస్ గానే ఆలోచించింది. దీంతో డిలీట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని జొమాటో సంస్థ సీఈవో దీపిందర్ గోయల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇప్పటి వరకు వినియోగదారులు చేసిన ఫుడ్ ఆర్డర్లు వారి ఫోన్ లోని యాప్ హిస్టరీలో ఉండేవి. ఆ ఆర్డర్ హిస్టరినీ తొలగించే వీలులేకపోవటంతో కొందరు కస్టమర్లు ఫ్యామిలీలో ఇబ్బందులకు గురైనట్లు తమ దృష్టికి తీసుకొచ్చారని సీఈవో తెలిపారు. కాస్తా ఆలస్యమైనా అలాంటి సమస్యలు తొలగిపోయాయని ఆయన తెలిపారు. డిలీట్ ఆర్డర్ ఆప్షన్ వినియోగించి.. ఎవరైనా తాము చేసిన ఫుడ్ ఆర్డర్ హిస్టరీని తొలగించవచ్చని దీపిందర్ గోయల్ పేర్కొన్నాడు. జొమాటో తీసుకొచ్చిన హిస్టరీ డిలీట్ ఆప్షన్ పట్ల చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. జొమాటో తీసుకొచ్చిన ఈ ఆఫ్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.