iDreamPost
android-app
ios-app

వీడియో: ఉత్తరాదిన జల ప్రళయం.. ప్రమాదకర స్థాయిలో యుమున!

యుమున నదితో సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగి పడటం వంటి వివిధ ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అలానే వరదల కారణంగా ఉత్తరాది నుంచి వచ్చే, వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి.

యుమున నదితో సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగి పడటం వంటి వివిధ ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అలానే వరదల కారణంగా ఉత్తరాది నుంచి వచ్చే, వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి.

వీడియో: ఉత్తరాదిన జల ప్రళయం.. ప్రమాదకర స్థాయిలో యుమున!

ఉత్తర భారత దేశంలో కుంభవృష్టి కురుస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో  ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. యుమున నదితో సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగి పడటం వంటి వివిధ ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అలానే వరదల కారణంగా ఉత్తరాది నుంచి వచ్చే, వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం రాత్రి 8.30 గంటల 36 గంటల వ్యవధిలో  రికార్డు స్థాయిలో 260 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.  ఢిల్లీలో 40 ఏళ్ల తరువాత  ఈ  స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ప్రథమం. 1982 జూలైలోనూ ఇదే స్థాయిలో కుండపోత వర్షాలు పడ్డాయి. ఆయా రాష్ట్రాలకు ఇంకా వాన ముప్పులు తప్పలేదని, ఇంకా మరింత వర్షం సంభవించే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేసింది.

ఈ వరదల కారణంగా ఉత్తరాఖండ్ లో భక్తులతో వెళ్తున్న జీపు గంగా నదిలో పడిపోయి ముగ్గురు మృతి చెందారు. జీపులో 11 మంది ఉండగా, ఐదుగురిని కాపాడామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని రెస్క్యూ టీమ్ తెలిపింది. అలానే జమ్మూకశ్మీర్ లో దోడా జిల్లాలో ఆకస్మిక వరదలకు బస్సుపై కొండచరియలు విరిగిపడ్డంతో ఇద్దరు జవాన్లు కొట్టుకుపోయి మృతి చెందారు. ఇక ఢిల్లీలోని యుమున నది అయితే ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. ఆదివారం రాత్రి కురిసిన వానకు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. సోమవారం సైతం అదే స్థాయిలో ఉంది.  ఢిల్లీలో యుమున నదిపై ఉన్న పాత రైల్వే బ్రిడ్జి.. రికార్డు స్థాయిలో 204.88 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది.

205.33మీటర్ల ప్రమాదకర స్థాయికి కాస్తా దూరంలో ఉంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి హత్నికుంద్ బ్యారెజ్ నుంచి 2,1300 క్యూసెక్ లో నీటిని దిగువకు విడుదల చేశారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ల్లో భారీ వర్షాలు కురిశాయి. హిమాచల్ ప్రదేశ్ లోని వివిధ పట్టణాల్లో వరద నీరు ప్రవహిస్తుంది. ప్రసిద్ధ దేవాలయమైన మహదేవ్ ఆలయం పూర్తిగా వరదలో మునిగిపోయింది. పలు నగరాలు, పట్టణాల్లోని రహదారులపై నీరు నిలవడంతో జనం ట్రాఫిక్ కష్టాలపై వీడియోలు, ఫోటోలు ,సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.