IIT, IIM స్టూడెంట్ కానప్పటికీ.. ఏడాదికి 82 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం!

లక్షల్లో ప్యాకేజీలు అందుకోవాలంటే ప్రఖ్యాత ఇన్సిట్యూట్ లలోనే చదవాల్సిన పని లేదని నిరూపించింది యుక్త గోపాలని అనే విద్యార్థిని. సాధారణ విద్యాసంస్థలో చదివి ఏకంగా ఏడాదికి 82 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది.

లక్షల్లో ప్యాకేజీలు అందుకోవాలంటే ప్రఖ్యాత ఇన్సిట్యూట్ లలోనే చదవాల్సిన పని లేదని నిరూపించింది యుక్త గోపాలని అనే విద్యార్థిని. సాధారణ విద్యాసంస్థలో చదివి ఏకంగా ఏడాదికి 82 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది.

జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే చేసే పనిపట్ల శ్రద్ధ, అంకితభావం ఉంటే చాలు. లక్ష్యాన్ని అలక్ష్యం చేయకుండా నిరంతర కృషి చేస్తే సక్సెస్ సాధించడం పెద్ద కష్టమైన పనేమీ కాదని నేటి యువత నిరూపిస్తోంది. మంచి ఉద్యోగం, కళ్లు చెదిరే ప్యాకేజీ అందుకోవాలంటే ఐఐటీ, ఐఐఎం, నిట్, ఎన్ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో చదవాలని అంటుంటారు. పేరుగాంచిన ఇన్సిట్యూట్ లలో డిగ్రీ పట్టా పుచ్చుకుంటే ఎక్కువ జీతం వచ్చే జాబ్స్ సాధించొచ్చని చెబుతుంటారు. కానీ ఇలాంటి విద్యాసంస్థల్లో చదవకపోయినా రికార్డ్ స్థాయిలో ప్యాకేజీలను సొంతం చేసుకోవచ్చని ప్రూవ్ చేస్తున్నారు విద్యార్థులు. ఇదే విధంగా యుక్తా గోపాలని అనే విద్యార్థిని ఏడాదికి రూ. 82.5 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించి యువతకి ఆదర్శంగా నిలుస్తోంది.

ఇటీవలి కాలంలో చదువు పూర్తవకుండానే క్యాంపస్ ప్లేస్ మెంట్లలో కోటి రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలను సాధించిన విద్యార్థులు చాలామందే ఉన్నారు. సాధారణ ఇన్సిట్యూట్ లలో చదివి అద్భుతంగా రాణించి, అసాధారణ ప్రతిభ కనబర్చి అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. యుక్తా గోపాలని కూడా సాధారణ ఇన్సిట్యూట్ లోనే చదువుకుని ఏడాదికి రూ. 82.5 లక్షల ప్యాకేజీతో జాక్ పాట్ కొట్టింది. గ్రాడ్యుయేషన్ ఎక్కడ పూర్తి చేశామన్నది కాదు.. ఉన్నత స్థాయిలో స్థిరపడ్డామా లేదా అనేదే ముఖ్యమని ఆమె నిరూపించింది. ఐఐటీ, ఐఐఎం స్టూడెంట్ కాకపోయినా యుక్తా బంపరాఫర్ అందుకుని ఔరా అనిపిస్తోంది.

యుక్తా గోపాలని అలహాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ కంపెనీ అట్లాసియన్ నుండి రూ. 82.5 లక్షల జాబ్ ప్యాకేజీని పొంది చరిత్ర సృష్టించింది. దీంతో యుక్త వార్తల్లో వ్యక్తిగా నిలిచిపోయారు. దేశ వ్యాప్తంగా ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రస్తుతం యుక్త కర్ణాటకలోని బెంగళూరులోని అట్లాసియన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. సాధారణ విద్యాసంస్థల్లో చదివినప్పటికీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే విజయం దక్కుతుందనడానికి ఆమె సాధించిన ఘనతే నిదర్శనం.ల

Show comments