iDreamPost
android-app
ios-app

నిరుద్యోగి ప్రేమ.. అతనే కావాలంటూ ప్రేమికురాలు సాహసం!

ప్రేమకు కుల మతాలు, ఆస్తి, అంతస్తులు అడ్డుకావని నిరూపిస్తున్నారు ప్రేమికులు. అయితే ఓ ప్రేమ జంట మాత్రం నిరుద్యోగం అడ్డుగా మారింది. అయినా ప్రేమికుడి కోసం ఆ యువతి సాహసం చేసింది.

ప్రేమకు కుల మతాలు, ఆస్తి, అంతస్తులు అడ్డుకావని నిరూపిస్తున్నారు ప్రేమికులు. అయితే ఓ ప్రేమ జంట మాత్రం నిరుద్యోగం అడ్డుగా మారింది. అయినా ప్రేమికుడి కోసం ఆ యువతి సాహసం చేసింది.

నిరుద్యోగి ప్రేమ.. అతనే కావాలంటూ ప్రేమికురాలు సాహసం!

ఒక్కసారి పుట్టిన ప్రేమ ఎప్పటికీ చావదు. ప్రేమకోసం త్యాగాలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ కలకాలం ఉండాలని కోరుకుంటారు ప్రేమికులు. నేటి కాలంలో కొంత మంది ప్రేమికులు తాము ప్రేమించిన వ్యక్తి దక్కలేదనే అక్కసుతో దాడులకు పాల్పడుతున్నారు. ప్రేమ మాటున మోసాలు, ప్రాణాలు కోల్పోవడాలు ఇలాంటి ఘటనలు కోకొల్లలు. కానీ ఈ ఘటన చూస్తే మాత్రం ప్రేమ అంటే ఇలా ఉంటుందా? ప్రేమ కోసం, ప్రేమించిన ప్రియుడిని దక్కించుకోవడం కోసం ఇంతలా ఆరాట పడతారా? అని అనిపిస్తుంది. బీహార్ లో ఓ యువతి తను ప్రేమించిన యువకుడిని వదిలి వెళ్లలేక పోలీసులు, తల్లిదండ్రుల ముందే కౌగిలించుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నిరూపిస్తున్నాయి నేటి రోజులు. కానీ బీహార్ లో ఓ ప్రేమ జంటకు మాత్రం నిరుద్యోగం అడ్డొచ్చింది. తమ కూతురు ప్రేమించిన వ్యక్తికి ఉద్యోగం లేదని వారి ప్రేమను తిరస్కరించారు. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న మరో వ్యక్తితో పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారు. కానీ అక్కడే ఈ వ్యవహారం అనూహ్య మలుపులు తిరిగింది. ఈ ఘటన బీహార్ లోని జముయ్ జిల్లాలో చోటుచేసుకుంది.

టెటారియా గ్రామానికి చెందిన శ్రవణ్ సాహ్ కుమార్తె 20 ఏళ్ల వర్ష కుమారికి, ముంగేర్ జిల్లాకు చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. వీరి పెళ్లి మార్చి 11న జరగాల్సి ఉంది. ఇరుకుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. అయితే వర్ష ఇది వరకే ధునియామన్రాన్ గ్రామానికి చెందిన ఉమేష్ యాదవ్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ వర్ష తల్లిదండ్రులు ఉమేష్ నిరుద్యోగి కావడంతో పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదు. అంతేగాక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారు. వర్షకు ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పెళ్లి వారం ఉందనంగా ఇంటి నుంచి వెళ్లి ప్రియుడిని చేరుకుంది. స్థానికంగా ఉన్న ఓ గుడిలో వివాహం చేసుకున్నారు.

ఈ విషయం తెలిసిన వర్ష కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు వర్ష ప్రియుడు ఉమేష్ స్వగ్రామానికి వెళ్లారు. వర్షను అతడి నుంచి విడిపించుకుని తీసుకెళ్లెందుకు ప్రయత్నించగా ఆమె అంగీకరించలేదు. అంతే కాదు పోలీసులు, తల్లిదండ్రుల ముందే సాహసం చేసింది. అందరు చూస్తుండగానే ప్రియుడిని కౌగిలించుకుంది. చావుకైనా వెనకాడం విడిపోయే ప్రసక్తే లేదంటు తెగేసి చెప్పారు. ఇద్దరు కూడా మేజర్లు కావడంతో పోలీసులు చేసేదేం లేక వారిని ఇంటికి పంపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.