Venkateswarlu
Venkateswarlu
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. తమ తమ ఇళ్లల్లో ప్రేమ గురించి చెప్పి.. పెళ్లి చేయమని తల్లిదండ్రుల్ని అడిగారు. అయితే, అమ్మాయి తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదు. కులాలు వేరు కావటంతో పెళ్లి చేయనని స్పష్టం చేశాడు. దీంతో ప్రేమ జంట డేరింగ్ నిర్ణయం తీసుకుంది. తమకు రక్షణ కల్పించమంటూ కోర్టును ఆశ్రయించింది. అక్కడే పెళ్లి చేసుకుని ఒక్కటైంది. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. చెన్నై అంపతూర్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త లతిపరి కూతురు దీపిక.
ఈమె ఓ ప్రైవేట్ కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన గౌతమ్ అనే యువకుడితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రేమ విషయం ఎవరిళ్లలో వాళ్లు చెప్పారు. అయితే, దీపిక తండ్రి లతిపరి వారి పెళ్లికి ఒప్పుకోలేదు. వేరు వేరు కులాలు కావటంతో అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే, కులం కారణంగా తమ ప్రేమ ఓడిపోకూడదని దీపిక భావించింది. గౌతమ్ కోసం ఇంట్లోంచి వెళ్లిపోయింది.
గౌతమ్ దగ్గరకు చేరుకుంది. కూతురు గౌతమ్‌ను పెళ్లి చేసుకోకుండా ఆపాలని తండ్రి భావించాడు. పోలీసులను రంగంలోకి దింపి.. కూతురు ఎక్కడ ఉన్నా తీసుకురమ్మన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమ జంట కోర్టును ఆశ్రయించింది. లతపరి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేసింది. తమకు ఎలాగైనా పెళ్లి చేయమని కోరింది. జడ్జి ఆదేశాల మేరకు వారికి అక్కడే పెళ్లయింది. ఈ జంటకు రక్షణ కల్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. మరి, ఈ ప్రేమ జంట వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“வீட்டுக்கு போனா அப்பா கொல பண்ணீருவாரு..” காதலனுடன் ஓடி வந்த தொழிலதிபர் மகள் #lovemarriage #karaikal pic.twitter.com/D7HGN9wRhG
— Thanthi TV (@ThanthiTV) September 16, 2023