iDreamPost
android-app
ios-app

ఈ క్విజ్ లో పాల్గొని ఐదు నిమిషాల్లోనే రూ. 3 వేలు గెలుచుకోవచ్చు!.. ఎలా అంటే?

ఆన్‌లైన్ భద్రత గురించి అవగాహన పెంచడానికి, అక్టోబర్ నెలను ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ నెలగా జరుపుకుంటున్నారు. డీసీఎస్ఐ సైబర్ సెక్యూరిటీ నేతృత్వంలో ఈ అవగాహన ప్రచారం జరుగుతోందని.

ఆన్‌లైన్ భద్రత గురించి అవగాహన పెంచడానికి, అక్టోబర్ నెలను ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ నెలగా జరుపుకుంటున్నారు. డీసీఎస్ఐ సైబర్ సెక్యూరిటీ నేతృత్వంలో ఈ అవగాహన ప్రచారం జరుగుతోందని.

ఈ క్విజ్ లో పాల్గొని ఐదు నిమిషాల్లోనే రూ. 3 వేలు గెలుచుకోవచ్చు!.. ఎలా అంటే?

మీకు స్మార్ట్ ఫోన్ ఉందా? మీకు ఎక్కువగా ఆన్ లైన్ లో గేమ్స్ ఆడే అలవాటు ఉందా? మీరు ఎక్కువగా ఆన్ లైన్ లోనే గడుపుతారా? అయితే మీలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. ప్రభుత్వం నిర్వహించే ఐదు నిమిషాల క్విజ్ లో పాల్గొని రూ. 3 వేలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం. ఎలాగు ఆన్ లైన్ లో ఏదో ఒక గేమ్ ఆడుతూనే ఉంటారు గదా.. అదేదో ఈ క్విజ్ లో పాల్గొంటే నగదు బహుమతిని పొందే అవకాశం ఉంది. పైగా క్విజ్ లో పాల్గొనడానికి ఎలాంటి చెల్లింపులు అవసరం లేదు. పూర్తి ఫ్రీగా మీరు ఈ క్విజ్ లో పాల్గొనవచ్చు. ఐదు నిమిషాల్లో 10 ప్రశ్నలకు సమాధానం చెప్పడం ద్వారా మీరు రూ. 3 వేలు పొందొచ్చు.

ఆన్‌లైన్ భద్రత గురించి అవగాహన పెంచడానికి, అక్టోబర్ నెలను ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ నెలగా జరుపుకుంటున్నారు. డీసీఎస్ఐ సైబర్ సెక్యూరిటీ నేతృత్వంలో ఈ అవగాహన ప్రచారం జరుగుతోందని. ఆన్‌లైన్ సేవలను, డిజిటల్ సేవలను సురక్షితంగా ఉపయోగించడంపై అవగాహన, దేశ పౌరులలో సైబర్ భద్రతపై అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ఈ క్రమంలోనే MyGov సైబర్ సెక్యూరిటీ అవేర్ నెస్ పై క్విజ్ నిర్హహిస్తోంది. ఈ సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ క్విజ్ 2023 mygov.inలో అక్టోబర్ 17 నుండి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో 10 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి, మీరు 300 సెకన్లలోపు సమాధానం ఇవ్వాలి. ఈ క్విజ్‌లో పాల్గొనే వారందరికీ డిజిటల్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఈ క్విజ్ లో పాల్గొన్న మొదటి 5 మంది విజేతలకు MyGov నుండి ఒక్కొక్కరికి ₹3,000 నగదు బహుమతి ఇవ్వబడుతుంది.

క్విజ్ నిబంధనలు

ఈ క్విజ్‌లో పాల్గొనడం కోసం ముందుగా MyGov‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

భారతదేశంలోని పౌరులు అందరు ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు.
పోటీలో పాల్గొనే వారందరూ తప్పనిసరిగా వారి పేరు, ఇమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, నగరం పేరు వంటి వివరాలను అందించాలి.
క్విజ్‌లో ఒకే మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడిని ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించడానికి వీలు లేదు.
ఎంట్రీని సబ్ మిట్ చేసిన తర్వాత, దానిని మీరు ఉపసంహరించుకోలేరు.
ఈ క్విజ్ లో హిందీ మరియు ఆంగ్ల భాషలలో ప్రశ్నలు ఉంటాయి.
క్విజ్ సమయం 5 నిమిషాలు (300 సెకన్లు)
క్విజ్‌లో పాల్గొనేవారికి ఒక ప్రవేశం మాత్రమే అనుమతించబడుతుంది.
క్విజ్‌ని ప్రారంభించడానికి పార్టిసిపెంట్ ‘స్టార్ట్ క్విజ్’ బటన్‌పై క్లిక్ చేసిన వెంటనే క్విజ్ ప్రారంభమవుతుంది.
పోటీదారులు క్విజ్ లో కష్టమైన ప్రశ్నలను దాటవేసి, తర్వాత ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే వెసులుబాటు ఉంది. ఈ క్విజ్‌లో నెగెటివ్ మార్కింగ్ లేదు.
అత్యధిక స్కోర్లు సాధించిన వారిని విజేతలుగా పరిగణించబడతారు మరియు DSCI ద్వారా నగదు బహుమతులు అందించబడతాయి.
ఎక్కువ సంఖ్యలో సరైన సమాధానాలు చెప్పిన ఆధారంగా విజేతలు నిర్ణయించబడతారు.
ఒక వేళ ఎక్కువ సంఖ్యలో సమాధానాలు ఇస్తే, క్విజ్‌ని పూర్తి చేయడానికి తక్కువ సమయం తీసుకున్న వ్యక్తి విజేత అవుతాడు.
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు ఒకే సమయాన్ని తీసుకుంటే, లక్కీ డ్రా ద్వారా విజేతను ఎంపిక చేస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి