భారతీయ మహిళకు మరణ శిక్ష విధించిన పరాయి దేశం.. ఎందుకో తెలుసా?

భారతీయ మహిళకు యెమెన్ దేశం కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు ఆ మహిళ చేసిన నేరం ఏంటి? ఎందుకు మరణ శిక్ష విధించిందంటే?

భారతీయ మహిళకు యెమెన్ దేశం కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు ఆ మహిళ చేసిన నేరం ఏంటి? ఎందుకు మరణ శిక్ష విధించిందంటే?

కేరళకు చెందిన ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి గతంలో ఓ పరాయి దేశంలో వెళ్లింది. అక్కడే ఉంటూ ఓ క్లినిక్ ను కూడా ప్రారంభించింది. అలా చాలా కాలం పాటు ఈ మహిళ తన కుటుంబ సభ్యులతో కలసి ఓ ప్రాంతంలో నివాసం ఉండేది. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆ మహిళ భర్త తిరిగి ఇండియాకు వెళ్లిపోయాడు. ఈ వివాహిత మాత్రం ఉద్యోగం నిమిత్తం అక్కడే ఉండాల్సి వచ్చింది. కట్ చేస్తే.. 2015లో జరిగిన ఓ ఘటన కారణంగా అక్కడి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ కోసం ఆమె కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి విఫలమయ్యారు. కాగా, ఈ క్రమంలోనే ఈ కేసును విచారించిన అక్కడి న్యాయస్థానం తాజాగా ఈ మహిళకు మరణ శిక్ష విధిస్తు తీర్పును ఇచ్చింది. ఇంతకు ఈ మహిళకు అక్కడి న్యాయస్థానం ఎందుకు మరణ శిక్ష విధించింది. ఆమె చేసిన నేరం ఏంటంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్లే.. కేరళకు చెందిన నిమిషా ప్రియా అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఏళ్ల కిందట యెమెన్ దేశం వెళ్లింది. అయితే, కొన్ని కారణాలతో ఆమె భర్త యెమెన్ దేశం విడిచి 2014లో తిరిగి ఇండియాకు వచ్చాడు. కానీ, ఉద్యోగంలో బిజీగా ఉన్న నిమిషా ప్రియా ఆ దేశం విడిచి రాలేకపోయింది. ఇదిలా ఉంటే.. 2015లో నిమిషా ప్రియా యెమెన్ కు చెందిన మహది అనే వ్యక్తితో కలిసి ఓ క్లినిక్ ను ప్రారంభించింది. కొంత కాలం పాటు ఇద్దరు కలిసి ఆ ఆస్పత్రిని నడిపిస్తూ వచ్చారు. కొంత కాలానికి ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో మహది నిమిషా ప్రియా పాస్ పోర్ట్ లాగేసుకున్నాడు.

దీని కారణంగా ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో ఊగిపోయిన ప్రియా.. మహదిని హత్య చేసినట్లుగా తెలుస్తుంది. అనంతరం ఈ ఘటనపై స్పందించిన అక్కడి పోలీసులు నిమిషా ప్రియాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు. అయితే నిమిషా బెయిల్ కోసం ఆమె తల్లి 2022 నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇకపోతే.. విచారణలో భాగంగా యెమెన్ దేశ సుప్రీంకోర్టు ఇటీవల నిమిషా ప్రియా దోషిను తేల్చింది. దీంతో ఆమెకు మరణ శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఈ క్రమంలోనే నిమిషా ప్రియా తల్లి ఈ కేసును కొట్టివేయాలని పెట్టుకున్న అభ్యర్ధనను సైతం న్యాయస్థానం కొట్టేసింది.

ఇక ఆమె తల్లి కోసం ఏర్పడిన ఓ ఫోరమ్ సభ్యులు.. నిమిషా ప్రియ తల్లిని యెమెన్ దేశం వెళ్లాల్సిందేనని సూచించినట్లు సమాచారం. ఆమెకు విధించిన మరణ శిక్ష పడకుండా ఉండాలంటే ఆ దేశ అధ్యక్షుడికి మాత్రమే సాధ్యమవుతుందని వాళ్లు తెలిపారు. దీంతో నిమిషా తల్లి ఆ దేశం వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఫోరమ్ సభ్యులు కూడా ఆమె వెంటే యెమెన్ దేశం వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నిమిషా ప్రియాకు మరణ శిక్ష తప్పదా? ఈ కేసులో ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments