వీడియో: అమూల్ బట్టర్ మిల్క్ ప్యాకెట్ లో పురుగులు!

Amul Butter Milk: ఈ మధ్య ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులు ఇంటికి చేరిన తర్వాత కస్టమర్లు షాక్ తింటున్నారు. తాము ఆర్డర్ చేసింది ఒకటైతే.. ఇంటికి వచ్చేది మరొకటి. కొంతమంది కస్టమర్లకు సబ్బులు, ఇటుక రాళ్లు, గడ్డి పార్సిల్ లో దర్శనమిచ్చిన సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి.

Amul Butter Milk: ఈ మధ్య ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులు ఇంటికి చేరిన తర్వాత కస్టమర్లు షాక్ తింటున్నారు. తాము ఆర్డర్ చేసింది ఒకటైతే.. ఇంటికి వచ్చేది మరొకటి. కొంతమంది కస్టమర్లకు సబ్బులు, ఇటుక రాళ్లు, గడ్డి పార్సిల్ లో దర్శనమిచ్చిన సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి.

ఇటీవల ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటే కొంతమంది భయపడే పరిస్థితికి వచ్చింది. తాము ఆర్డర్ చేసింది ఒకటైతే.. డెలివరీ అయ్యేది మరొకటి. అంతే కాదు అందులో నాణ్యత లేనివి, పురుగులు ఉన్నవి, పాడపోయిన డైలీ యూజ్ ప్రాడక్ట్స్ పంపించడం వంటి సంఘటనలు తరుచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి విషయాలపై యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే అప్పటికప్పుడు ఏదో తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు.. కానీ అవి మళ్లీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఓ వ్యక్తి ఆన్ లైన్ లో అమూల్ బట్టర్ మిల్క్ బుక్ చేయగా అందులో పురుగులు దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన గజేందర్ అనే వ్యక్తి ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన అమూల్ మజ్జిగలో పురుగులు ఉన్నాయని చెప్పడం వైరల్ గా మారింది. దీంతో అమూల్ ఉత్పత్తుల నాణ్యత, భద్రతపై తీవ్ర ఆందోళన కలుగుతుంది. గజేందర్ పంపించిన వీడియోలో ప్యాకేజీ లోపల కీటకాలు తిరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ప్యాకెట్లు తెరిచి, చిరిగిపోయి ఉన్నాయి.. అంతేకాదు మజ్జిగ కుళ్లిపోయి దుర్వాసన వస్తుంది. గజేందర్ యాదవ్ ‘ హే అమూల్ మీరు అధిక ప్రోటీన్స్ తో పాటు పురుగులు కూడా పాంపారు కదా’ అంటూ ఎటకారంగా ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందిచిన అమూల్ క్షమాపణలు చెప్పింది.. ఇకపై జాగ్రత్తగా ఉంటామని బదులు ఇచ్చిందని గజెందర్ తెలిపారు.

తన ట్వీట్ కు అమూల్ క్షమాపణలు చెప్పింది.. ఇకపై జాగ్రత్తగా ఉంటామని బదులు ఇచ్చిందని గజెందర్ తెలిపారు. అయితే వీడియో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే నాలుగున్నర టక్షల వ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలోనే గతంలో తమకు జరిగిన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. అమూల్ లాంటి సంస్థలు ఇలా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఎలా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ప్రస్తుతం గజేందర్ పంపిన వీడియో సోష్ మీడియాలో వైరల్ అవుతుంది.

Show comments