వరల్డ్ క్లాస్ ఫీచర్లతో.. వందే భారత్ స్లీపర్ కోచ్.. కట్టిపడేస్తున్న విజువల్స్

Vande Bharat sleeper: ప్రయాణికుల సౌకర్యార్థం సెంట్రల్ గవర్నమెంట్ త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నది. వరల్డ్ క్లాస్ ఫీచర్లతో వస్తున్న స్లీపర్ కోచ్ లు ఆకట్టుకుంటున్నాయి.

Vande Bharat sleeper: ప్రయాణికుల సౌకర్యార్థం సెంట్రల్ గవర్నమెంట్ త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నది. వరల్డ్ క్లాస్ ఫీచర్లతో వస్తున్న స్లీపర్ కోచ్ లు ఆకట్టుకుంటున్నాయి.

రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వందే భారత్ ట్రైన్స్ వేగంగా ప్రయాణించడంతో ప్రయాణ సమయం తగ్గుతోంది. దీంతో వందేభారత్ లో జర్నీ చేసేందుకు ప్రయాణికులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నా సరే రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నది. అయితే ఇప్పటి వరకు వందే భారత్ లో చైర్ కార్ కోచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే వారికి స్లీపర్ కోచ్ లు లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకురాబోతోంది సెంట్రల్ గవర్నమెంట్.

వందే భారత్ ట్రైన్లు దేశంలోని పలు నగరాల మధ్య పరుగులు తీస్తున్నాయి. ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ రైళ్లను త్వరలోనే పట్టాలు ఎక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. మరో మూడు నెలల్లో ఈ తరహా రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఆదివారం ఆయన వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ ప్రొటోటైప్‌ వెర్షన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా స్లీపర్‌ కోచ్‌లకు సంబంధించిన విజువల్స్‌ బయటకు వచ్చాయి. స్లీపర్ కోచ్ లు వరల్డ్ క్లాస్ ఫీచర్లతో వస్తుండడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కోచ్ లు:

మొత్తం 16 బోగీలుండే వందేభారత్ స్లీపర్ రైలులో ఏసీ 11, టైర్ కోచ్ లు 3(611 బెర్తులు) 4ఏసీ 2 టైర్ కోచ్ లు(188 బెర్తులు),1 ఫస్ట్ ఏసీ ఒక బోగీ(24 బెర్తులు) ఉంటాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. సీటింగ్‌తో పాటు లగేజీ (SLR) కోసం రెండు బోగీలు అదనంగా ఉంటాయి. గంటకు 130 కి.మీ. వేగంతో నడిచే ఈ రైలు వేగాన్ని క్రమంగా 160-220 కి.మీ.లకు పెంచనున్నారు. సౌకర్యాలు, వేగం, భద్రతా పరంగా చూసుకుంటే రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్ల కంటే ఇది బెటర్ అని అధికారులు చెబుతున్నారు.

ఫీచర్లు:

వందే భారత్ స్లీపర్ కోచ్ లో జీఎఫ్ఆర్ పీ ప్యానెల్స్, ఆటోమేటిక్ ఎక్స్ టీరియర్ ప్యాసింజర్ డోర్లు, సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, లగేజ్ పెట్టుకునేందుకు విశాలమైన ప్లేస్ అందించారు. మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ ఛార్జింగ్ సదుపాయంతో కూడిన ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, దివ్యాంగుల కోసం ప్రత్యేక బెర్తులు, దుర్వాసన రాని టాయిలెట్స్, మాడ్యులర్ ప్యాంట్రీలు, పబ్లిక్ అనౌన్స్ మెంట్, విజువల్ ఇన్షర్మేషన్ సిస్టమ్ లు, డిస్ ప్లే ప్యానెల్స్, సెక్యూరిటీ కెమెరాలు, షవర్స్ వంటి అదిరిపోయే ఫీచర్లు స్లీపర్ కోచ్ లలో ఉన్నాయి.

సౌకర్యవంతమైన బెర్తులు:

రాజధాని ఎక్స్ ప్రెస్ ట్రైన్లతో పోలిస్తే వందే భాతర్ రైళ్లు ప్రయాణికులకు అత్యుత్తమ బెర్త్ సౌకర్యాన్ని అందిస్తాయి. బెర్తులకు అదనపు కుషనింగ్ ఉంటుంది. అగ్ని ప్రమాదాలకు తావులేకుండా స్లీపర్ కోచ్ లను రూపొందించారు. వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు జర్క్-ఫ్రీ రైడ్ లను అందజేస్తుంది. కోచ్ లలో కాలుష్య రహిత వాతావరణం ఉంటుంది.

ఛార్జీలు:

వందే భారత్ స్లీపర్ రైలులో టికెట్ ధరలు మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా ఉంటాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సూచించారు.

Show comments