iDreamPost
android-app
ios-app

కష్టం విలువ తెలుసు.. నిధి దొరికిన నిజాయితీగా ఇచ్చేసిన కూలీలు

ఈ రోజుల్లో ప్రతి రూపాయి విలువైనదిగా మారింది. ఇక బంగారం సంగతి అయితే చెప్పనక్కర్లేదు. రోజు రోజుకు కొండనెక్కుతోంది దీని ధర. సరదాగా ఎక్కడైనా బంగారం దొరికితే బాగుండు అని అనుకుంటారు. ఈ కూలీలకు అనుకోకుండానే దొరికింది. కానీ

ఈ రోజుల్లో ప్రతి రూపాయి విలువైనదిగా మారింది. ఇక బంగారం సంగతి అయితే చెప్పనక్కర్లేదు. రోజు రోజుకు కొండనెక్కుతోంది దీని ధర. సరదాగా ఎక్కడైనా బంగారం దొరికితే బాగుండు అని అనుకుంటారు. ఈ కూలీలకు అనుకోకుండానే దొరికింది. కానీ

కష్టం విలువ తెలుసు.. నిధి దొరికిన నిజాయితీగా ఇచ్చేసిన కూలీలు

ఈ రోజుల్లో బంగారం ధరలు కొండెనెక్కి కూర్చుకుంటున్నాయి.  ఈ రోజు ఉన్న ధర మరుసటి రోజు ఉండటం లేదు.  సామాన్యులు కొనలేని స్థితికి పసిడి ధర పెరిగింది. ఇప్పటికే స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 75 వేలకు చేరువలో ఉంది. ఈ పరిస్థితిలో దొంగల కన్ను కూడా బంగారంపై పడింది. మహిళలు మెడలో వేసుకెళ్లాలంటే బయపడిపోతున్న రోజులివి.  ఒంటి మీద వేసుకెళ్లలేక, ఇంట్లో పెట్టలేక.. భద్రంగా ఉంటుందని బ్యాంకులో తనఖా పెడుతున్నారు. ఈ రోజుల్లో చినం గోల్డ్ కూడా చాలా విలువగా మారింది. ఈ నేపథ్యంలో ఎక్కడైనా గోల్డ్ కనబడితే వదిలేస్తారా..? ఎవ్వరూ వదిలిపెట్టరు.. కానీ ఇదిగో ఈ కూలీలు మాత్రం వదిలేశారు. నిజాయితీగా అప్పగించారు.

కష్టం విలువ తెలిసిన కూలీలు.. పొట్టకూటి కోసం పని చేసుకుని బతుకుతున్నారు. అలాంటి కూలీలకు బంగారు నిధి దొరికింది. కానీ వారితో తీసుకెళ్లలేదు. తిరిగి అధికారులకు అప్పగించారు. ఈ ఘటన కేరళలోని కన్నూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. పరిప్పై గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు.. గ్రామపంచాయతీ పరిధిలో నీటి గుంట తవ్వుతున్నాడు. అంతలో దడేల్ అని సౌండ్ వచ్చింది ఏంటా అని చూడగా.. ఓ బాక్సులాంటి కంటైనర్ బయటపడింది. తొలుత  కూలీలు ఆ బాక్సును చూసి ఆందోళ చెందారు. అందులో ఏదైనా బాంబు ఉందేమోనని భయపడ్డారు.  అంతలో బాక్సును తెరిచి చూడగా.. కళ్లు మిరుమిట్లుగొలిపేలా బంగారపు వస్తువులు కనిపించాయి.

అంత సొమ్మును చూసి వారేమీ ఆశపడలేదు. వెంటనే కూలీలు గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడ పోలీసులకు సమాచారం చేరవేశారు. నిధిలో 17 ముత్యాల పూసలు, 13 బంగారు పతకాలు, సంప్రదాయ నెక్లెస్ (కషుమాల)లోని నాలుగు పతకాలు, ఐదు పురాతన ఉంగరాలు, చెవిపోగులు, వెండి నాణేలు ఉన్నాయి. పోలీసులు దానిని తాలిపరంబ కోర్టులో హాజరుపరిచి పురావస్తు శాఖకు సమాచారం అందించారు.  100 సంవత్సరాల నాటి బంగారం ఆభరణాలుగా గుర్తించారు.  అయినా తమ నిజాయితీని చాటుకున్నారు ఉపాధి హామీ కూలీలు. తమ కష్టం మీదే జీవిస్తున్న కూలీలు.. పరాయి సొమ్ముకు ఆశ పడకుండా.. సొమ్మును ప్రభుత్వానికి అప్పగించారు. నిధి దొరికినా.. నిజాయితీగా ఇచ్చేసిన కూలీలతో ప్రశంసలతో ముంచెత్తారు స్థానికులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి