iDreamPost
android-app
ios-app

సీటు కోసం మెట్రో రైల్లో పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు!

  • Published Aug 25, 2023 | 2:21 PM Updated Updated Aug 25, 2023 | 2:21 PM
  • Published Aug 25, 2023 | 2:21 PMUpdated Aug 25, 2023 | 2:21 PM
సీటు కోసం మెట్రో రైల్లో పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు!

ఈ మధ్య కాలంలో మైట్రో రైల్లో గొడవలు బాగా పెరిగిపోయాయి. సీటు కోసం గొడవలు పడ్డం అన్నది సర్వ సాధారణం అయిపోయింది. మైట్రో రైల్లో సీటు కోసం గొడవలు పడుతున్న సంఘటనల తాలూకా వీడియోలు తరచుగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతూనే ఉన్నాయి. తాజాగా కూడా ఓ వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. సీటు కోసం కొందరు ఆడవాళ్లు మెట్రో రైల్లో కలబడి కొట్టుకుంటున్న దృశ్యాల తాలూకా వీడియో అది. ఢిల్లీ మెట్రో రైల్లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఆ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం కొంతమంది మహిళలు ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. వారు ఉన్న క్యారేజ్‌లో జనం ఎక్కువగా ఉన్నారు. కూర్చోవటానికి సీట్లు లేకపోవటంతో ఈ మహిళలతో పాటు కొంతమంది యువతులు కూడా నిలబడే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఓ సీటు ఖాళీ అయింది. ఆ సీటులో కూర్చునే విషయంలో మహిళలకు, యువతులకు మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా అయింది. రెండు గ్రూపులు వాగ్వివాదానికి దిగాయి.

తర్వాత మహిళలు, యువతులు పొట్టుపొట్టు కొట్టుకోవటం మొదలుపెట్టారు. తోటి ప్రయాణికులు వీరిని ఆపే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు వెనక్కు తగ్గలేదు. కొప్పులు పట్టుకుని మరీ గొడవ పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. తర్వాత దాన్ని తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. మరి, ఢిల్లీ మెట్రో రైల్లో మహిళలు దారుణంగా కొట్టుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom