iDreamPost
android-app
ios-app

ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా? ఈమె చావుకి డాక్టర్స్ షాక్? మీరు బిత్తరపోతారు!

  • Published Aug 09, 2024 | 9:43 PM Updated Updated Aug 09, 2024 | 9:43 PM

Women Bitten By Cat: ఇంట్లో పిల్లులు, కుక్కలు లాంటి జంతువుల్ని పెంచుకోవడం సాధారణమే. కొంతమందికి ఇదో హాబీ. పెంపుడు జంతువులు లేకపోతే అస్సలు ఉండలేమని చాలా మంది అంటుంటారు.

Women Bitten By Cat: ఇంట్లో పిల్లులు, కుక్కలు లాంటి జంతువుల్ని పెంచుకోవడం సాధారణమే. కొంతమందికి ఇదో హాబీ. పెంపుడు జంతువులు లేకపోతే అస్సలు ఉండలేమని చాలా మంది అంటుంటారు.

  • Published Aug 09, 2024 | 9:43 PMUpdated Aug 09, 2024 | 9:43 PM
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా? ఈమె చావుకి డాక్టర్స్ షాక్? మీరు బిత్తరపోతారు!

ఇంట్లో పిల్లులు, కుక్కలు లాంటి జంతువుల్ని పెంచుకోవడం సాధారణమే. కొంతమందికి ఇదో హాబీ. పెంపుడు జంతువులు లేకపోతే అస్సలు ఉండలేమని చాలా మంది అంటుంటారు. వాటి ఆలనాపాలనా చూసుకోవడానికి ఇష్టపడుతుంటారు. పొద్దున లేవగానే కుక్కల్ని, పిల్లుల్ని వాకింగ్​కు తీసుకెళ్తుంటారు. వాటికి స్నానం చేయించడం, భోజనం పెట్టడాన్ని కూడా పెట్ లవర్స్ ఎంజాయ్ చేస్తారు. అవి కూడా తమ యజమానులతో నమ్మకంగా ఉంటూ ప్రేమను చూపిస్తుంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని ఘటనలు పెట్ లవర్స్​కు హెచ్చరికలు పంపుతున్నాయి. ఇంట్లో కుక్కలు, పిల్లులు పెంచుకోవాలంటే భయపడేలా చేస్తున్నాయి.

పిల్లి కరవడంతో ఓ మహిళ చనిపోయింది. పిల్లి కరిస్తే ప్రాణాలు పోతాయా అని షాక్ అవ్వకండి. ఇది నిజంగానే జరిగింది. ఇంట్లో పిల్లిని పెంచుకున్న ఓ మహిళ దాని వల్లే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడి తారలఘట్ట గ్రామంలోని గంగీబాయి అనే మహిళ చాన్నాళ్లుగా ఓ పిల్లిని పెంచుకుంటోంది. దానికి పాలు పోస్తూ ఎంతో గారాబంగా చూసుకునేది. అయితే అదే పిల్లి కరవడంతో ఆమె చనిపోయింది. చాన్నాళ్ల కింద గంగీబాయిని పిల్లి కరిచింది. దీంతో ఆమె వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లి ట్రీట్​మెంట్ చేయించుకుంది. ఆ పిల్లిని ఆల్రెడీ ఓ కుక్క కరిచిందని, ఇప్పుడు అది కరవడం వల్ల రేబిస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని డాక్టర్లు గంగీబాయిని హెచ్చరించారు. ఇది నయం కావాలంటే కచ్చితంగా ఐదు ఇంజక్షన్లు తీసుకోవాలని సూచించారు. కానీ ఆమె మాట వినలేదు.

ఐదు ఇంజక్షన్లు పూర్తయ్యే వరకు ట్రీట్​మెంట్ చేయించుకోవాలని గంగీబాయికి వైద్యులు తెలిపారు. కానీ ఆమె ఒక సూది తీసుకున్నాక ఏం కాదులే అని నిర్లక్ష్యం వహించి ఆస్పత్రికి మళ్లీ రాలేదు. తనకు నయం అయిందనే నమ్మకంతో వ్యవసాయ పనులకు వెళ్లడం స్టార్ట్ చేసింది. అలా కొన్ని రోజులు గడిచాక నొప్పి భరించలేక జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. కానీ అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో డాక్టర్లు షాకయ్యారు. ఆమె కేసును స్టడీ చేశాక పిల్లి కాటు వల్లే ప్రాణాలు కోల్పోయిందని నిర్థారించారు. గంగీబాయిని కరిచిన పిల్లిని, అప్పటికే ఓ కుక్క కరిచిందని డాక్టర్స్ తెలిపారు. అప్పుడే రేబిస్ ట్రీట్​మెంట్ పూర్తిగా చేయించుకుంటే ఆమె బతికేదన్నారు. కుక్కలు, పిల్లులు కరిస్తే అశ్రద్ధ చేయొద్దని, వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు.