iDreamPost
android-app
ios-app

నిత్యానంద నాటకానికి తెర..ఆయన రహస్యాలను బయటపెట్టిన మహిళ!

Nithyananda: నిత్యానంద స్వామి. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. రాసలీలలతో ఫుల్ ఫేమస్ అయిన ఈ స్వామీజీ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన గురించి.. ఆయన మాజీ శిష్యురాలు అనేక విషయాలను వెల్లడించింది.

Nithyananda: నిత్యానంద స్వామి. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. రాసలీలలతో ఫుల్ ఫేమస్ అయిన ఈ స్వామీజీ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన గురించి.. ఆయన మాజీ శిష్యురాలు అనేక విషయాలను వెల్లడించింది.

నిత్యానంద నాటకానికి తెర..ఆయన రహస్యాలను బయటపెట్టిన మహిళ!

సమాజంలో ఎంతో మంది నకిలీ బాబాలు పుట్టుకొస్తున్న సంగతి తెలిసింది. ఆధ్యాత్మిక బోధన చాటున చాలా మంది దొంగబాబులు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. అంతేకాక కొందరు అయితే ఏకంగా తమ ఆశ్రమానిక వచ్చే మహిళలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారు. అలా ఇప్పటకి ఎంతో మంది బాబాల భాగోతాలు వెలుగులోకి వచ్చాయి. అలాంటి వారిలో ఒకరు నిత్యానంద. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆశ్రమయంలో మహిళలతో రాసలీలులు చేస్తూ.. అడ్డంగా దొరికిపోయి.. దేశం వదలి పారిపోయాడు. ఇప్పటికే నిత్యానందం గురించి అనేక విషయాలు తెలియగా..తాజాగా ఆయన దగ్గర పని చేసిన ఓ మహిళ అనేక రహస్యాలను బయటపెట్టింది.

తన అవినీతి, అక్రమాలు, లైంగిక వీడియోలు బయటపడటంతో నిత్యానంద భారత దేశం వదలి పారిపోయిన సంగతి తెలిసిందే.  ఆ తరువాత చాలా కాలం పాటు ఆయన గురించి ఎటువంటి వార్తలు రాలేదు. కొన్ని రోజుల తరువాత ఆయన స్వయంగా ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసింది. తాను ఓ కైలాసం అనే రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్లు.. అక్కడ ప్రత్యేక కరెన్సీ, ప్రత్యేక ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఇలా ఒక చిన్న క్లిప్ ద్వారా తన కైలాష్ స్థానాన్ని వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.

 ఇది ఇలా ఉంటే.. తాజాగా నిత్యానంద అనేక చీకటి దోపిడీలను బహిర్గతం చేసేందుకు అతని మాజీ అనుచరులు కొందరు ముందుకు వచ్చారు. పరారీలో ఉన్న నిత్యానంద మాజీ శిష్యురాలు సారా లాండ్రీ అనే మహిళా.. ఆయన చీకటీ పనులను బహిర్గతం చేసింది. ఆమె ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ… తాను 2009లో నిత్యానంద ఆశ్రమంలో చేరానని తెలిపింది. తాను సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలని, యోగా, మెడిటేషన్ నేర్చుకోవాలనే భావనతో అక్కడ చేరినట్లు తెలిపింది. తాను పెద్ద  చదువులు చదివానని,  ట్రైనింగ్ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్‌కు వెళ్లేదాననని చెప్పుకొచ్చారు.

మతపరమైన పాఠాలు చెప్పేందుకు ఆయన సొంతంగా సంస్థను నిర్వహించడం లేదని, ఆశ్రమాన్ని మాఫియాలా పని చేయించాడని సారా పేర్కొంది. తాను 24 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు అక్కడే ఉన్నానని తెలిపింది. తొమ్మిదేళ్ల పాటు నిత్యానంద సూచనల మేరకే తన జీవితం సాగిందని ఆ మహిళ పేర్కొంది.  తాను ఆశ్రమాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆమెపై తప్పుడు ఆరోపణలు చేసి పలు వివాదాల్లో ఇరికించారని తెలిపింది. తాను హిందువు కాదని, తన ఆశ్రమంలోని పిల్లలను కొట్టారని తనపై ఆరోపణలు చేశారని సారా పేర్కొంది. దీని తర్వాత తాను నిత్యానంద ఆశ్రమంలో పని చేసే ఆమె మాజీ అనుచరుడితో మాట్లాడానని తెలిపింది.

అక్కడ పిల్లలను చంపడం, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు తనకు తెలిసిందని వ్యక్తి చెప్పాడని, అంతేకాక తప్పుడు పనులకు పురిగొల్పుతున్నారని తెలిపింది. ఇదే సమయంలో ఆ ఆశ్రమంలో తమను తాము సన్యాసులుగా చెప్పుకునే మహిళలు చాలా మందిని ప్రభావితం చేయగలిగారని ఆ మహిళ తెలిపింది. అలానే నిత్యానంద ప్రస్తావించిన కైలాసం గురించి కూడా సారా ప్రస్తావించింది. కైలాసం అనేది ఒక నకిలీ కథనమని, ఒక తప్పుడు దేశమని, అది నిత్యానంద సృష్టించిన ఓ అభూత కల్పన అని తెలిపింది. ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన అతడిని శిక్షించాలని భారత్‌ను అభ్యర్థిస్తానని సారా అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి