భర్త తరుపున బంధువు కదా అని సాయం చేసి.. దారుణంగా!

మానవత్వం మరుగున పడిపోతున్న ఈ సమయంలో ఆమె పెద్ద సహాయమే చేసింది. లెక్చరర్ కావడంతో బంధువుకు ఆపద వచ్చిందని తెలిసి.. తన ప్రాణాన్ని పణంగా పెట్టింది.

మానవత్వం మరుగున పడిపోతున్న ఈ సమయంలో ఆమె పెద్ద సహాయమే చేసింది. లెక్చరర్ కావడంతో బంధువుకు ఆపద వచ్చిందని తెలిసి.. తన ప్రాణాన్ని పణంగా పెట్టింది.

సమాజం స్వార్థంతో కలుషితమైపోతుంది. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు.. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అని ఆలోచిస్తున్నారు కొందరు. ఆర్థిక సాయం పక్కన పెడితే.. కనీసం మాట సాయం చేసేందుకు కూడా వెనకాడుతున్నారు. ఇరుగు పొరుగుతో కూడా సఖ్యతగా మెలగడం లేదు. హెల్ప్ చేస్తే ఎటు నుండి ఏ విపత్తు వస్తుందోనని యోచిస్తున్నారు. చాలా స్పెలిష్‌గా బతికేస్తున్నారు. నేను మాత్రమే బాగుండాలని అనుకుంటున్నారు. మానవత్వం పూర్తిగా కనుమరుగౌతున్న ఈ తరుణంలో.. ఇదిగో ఈ మహిళ పెద్ద సాయమే చేసింది. మరొకరి ప్రాణాలు నిలబెట్టేందుకు ముందుకు వచ్చింది. కానీ అనూహ్యంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారకమైన ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటుచేసుకుంది.

భర్త తరుఫు బంధువులను కాపాడబోయి.. తాను మృత్యు ఒడికి చేరింది మహిళ. తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసి ప్రాణాలు కోల్పోయింది. చికిత్స చేయించుకుని బయటకు వచ్చినప్పటికీ.. ఇన్ఫెక్షన్ కారణంగా మరణించింది. వివరాల్లోకి వెళితే… ఉడిపి జిల్లా కుందాపూర్ తాలూకా కోటేశ్వర్‌లో నివాస ముంటుంది అర్చనా కామత్ కుటుంబం. నగరంలోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా పని చేసేది ఆమె. ఎంతో చురుగ్గా ఉండేది. ఇంట్లో తలలో నాలుకలా వ్యవహరించేది. భర్తకు మంచి సపోర్టుగా ఉండేది. కాగా, ఈ మధ్య భర్త కుటుంబానికి చెందిన మహిళకు అనారోగ్య సమస్యలు ఏర్పడితే.. ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు కాలేయ మార్పిడి చేయాలన్నారు. ఎవరైన దానం చేస్తే ఆమె బతుకుతుందని చెప్పారు. అయితే కుటుంబ సభ్యుల రక్త నమూనాతో పేషెంట్ బ్లడ్ సరిపోలలేదు.

చివరకు అర్చనా బ్లడ్ గ్రూప్.. పేషెంట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావడంతో ఆమెను లివర్ దానం చేయమని కోరారు. ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన ఉన్న అర్చన.. తను ఆర్గాన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో 12 రోజుల క్రితం శస్త్రచికిత్స చేసి అర్చన కాలేయంలో కొంత భాగాన్ని తొలగించి పేషెంట్‌కు అమర్చారు. ఆ తర్వాత అర్చన కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు జ్వరం రావడంతో మంగళూరు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స చెందుతూ మృతి చెందింది అర్చన. ఇన్ స్పెక్షన్ రావడంతోనే ఆమె మృతి చెందిందని వైద్యులకు తెలిపారు. దీంతో మంచి చేయాలని ఆలోచించిన ఆమె తమకు దూరం అయ్యిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఒకిరిక హెల్ప్ చేస్తే ఏమొస్తుంది అనుకునే ఈ రోజుల్లో ఏకంగా ఆర్గాన్ డొనైట్ చేసి మృతి చెందింది ఈ ఇల్లాలు. హృదయవిదారకమైన ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments