iDreamPost
android-app
ios-app

ఇలాంటి అమ్మాయిలు చాలా అరుదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియుడి పోస్టు..

ఇలాంటి అమ్మాయిలు చాలా అరుదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియుడి పోస్టు..

ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే..
ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే..

సిరి వెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ లైన్‌లు చాలు.. ప్రేమ నిర్వాచనాలకు.. అర్థాలకు అందనిది.. అతీతమైనదని అర్థమైపోతుంది. . ఈ సృష్టిలో మనిషికి దక్కే అత్యంత అరుదైన.. అద్భుతమైన వరం ఏదైనా ఎదుటి వ్యక్తి ప్రేమను పొందటం.

జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే..
నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా..
రేయంతా నీ తలపులతో ఎర్ర బడే కన్నులు ఉంటే..
ఆ కాంతే నువ్వేతికే సంక్రాంతై ఎదురవదా..

మనం ఎదుటి వ్యక్తిని ఎంత ప్రేమిస్తే.. వాళ్ల గురించి అంత ఎక్కువగా ఆలోచిస్తాం. వాళ్ల సంతోషాన్ని అంత ఎక్కువ కోరుకుంటాం. వాళ్ల సంతోషం కోసం ఏం చేయాటికైనా సిద్ధపడిపోతాం. మనకు ఇష్టమైన వాళ్ల కోసం కానుకలు ఇవ్వటం.. వాళ్లు కష్టాల్లో ఉన్నపుడు సాయం చేయటం ఇవన్నీ వాళ్ల కళ్లలో సంతోషం చూడ్డం కోసమే.

ప్రస్తుతం ఓ యువకుడు తన ప్రియురాలి గురించి ట్విటర్‌ ఖాతాలో పెట్టిన ఓ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టు చదువుతున్న కొంతమంది కన్నీళ్లు సైతం పెట్టుకున్నారు. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. ‘‘ నేను గత ఐదేళ్లుగా లాంగ్‌ డిస్టన్స్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నాము. ఐదేళ్ల క్రితం యూపీఎస్సీ కోసం ప్రిపేర్‌ అవుతున్నపుడు ఇద్దరికీ పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రస్తుతం ఆమె ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో పని చేస్తోంది. ఈ సంవత్సరం నేను తనను కలవటానికి వెళ్లాను.

తిరిగి వస్తునపుడు నా వాలెట్‌లో కొంచెం డబ్బులు మాత్రమే ఉండటం తను చూసింది. నాకు తెలియకుండా పెద్ద మొత్తంలో డబ్బుల్ని నా వాలెట్‌లో ఉంచింది. తర్వాత తనే నన్ను రైల్వే స్టేషన్‌లో దింపింది. రైల్‌ ఎక్కిన తర్వాత నేను నా వాలెట్‌ చూసుకుని ఆశ్చర్యపోయాను. ఏడుపు కూడా వచ్చింది. మనల్ని అవసరాల కోసం వాడుకుంటున్న వాళ్లు ఉన్న ఈ రోజుల్లో.. ఇలా మిమ్మల్ని సపోర్టు చేసే వాళ్లను వెతికి పట్టుకోండి!’’ అని రాసుకొచ్చాడు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş