iDreamPost
android-app
ios-app

200 విషయంలో భర్తపై అలిగిన భార్య! పిల్లలతో సహా..

  • Published Apr 30, 2024 | 12:16 PM Updated Updated Apr 30, 2024 | 12:16 PM

కుటుంబంలో గొడవలు అనేవి సహజం. అయితే కొందరు మాత్రం ఇంట్లో పెద్ద వాళ్ల మధ్య జరిగే గొడవలకు పిల్లలను బలి చేస్తుంటారు. తాజాగా ఓ మహిళ 200 విషయంలో భర్తతో గొడవ పడి.. చివరకు పిల్లలతో సహా దారుణానికి పాల్పడింది.

కుటుంబంలో గొడవలు అనేవి సహజం. అయితే కొందరు మాత్రం ఇంట్లో పెద్ద వాళ్ల మధ్య జరిగే గొడవలకు పిల్లలను బలి చేస్తుంటారు. తాజాగా ఓ మహిళ 200 విషయంలో భర్తతో గొడవ పడి.. చివరకు పిల్లలతో సహా దారుణానికి పాల్పడింది.

  • Published Apr 30, 2024 | 12:16 PMUpdated Apr 30, 2024 | 12:16 PM
200 విషయంలో భర్తపై అలిగిన భార్య! పిల్లలతో సహా..

అత్తాకోడళ్ల మధ్య గొడవలు అనేది ప్రతి కుటుంబంలో జరిగే సర్వసాధారణ విషయం. చాలా తక్కువ మంది మాత్రమే గొడవలు పడకుండా ఉంటారు. ఇక ఇలా అత్తాకోడళ్ల వాగ్వాదాల మధ్యలో మగవారు నలిగి పోతుంటారు. ఇటు అమ్మకు, అటు భార్యకు చెప్పుకోలేక నరకం చూస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. ప్రతి చిన్న విషయంలో అత్తాకోడళ్లు.. ఇంట్లో మగవారిపై అలుగుతుంటారు. మరికొందరు అయితే ఏకంగా ఆత్మహత్యలు వంటి దారుణాలకు పాల్పడుతుంటారు. తాజాగా 200 విషయంలో భర్తపై అలిగిన ఓ భార్య బావిలో దూకి ఆత్మహత్య  చేసుకుంది. ఈ ఘటన ఉ

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ జిల్లా మాణిక్ పూర్ లో సిబిత్, అంజు అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు మాణిక్ పూర్ లోని మజ్రా ప్రాంతంలో ఝల్మల్ కాలనీలో జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుదీప్ అనే 8 నెలల బాలుడు, సుధీర్ అనే మూడేళ్ల బాలుడు ఉన్నాడు. వీరితో పాటు వీరి అమ్మకూడా ఉంటుంది. ఇక భర్త చెప్పిన వివరాల ప్రకారం..  సబిత్ వాళ్ల అమ్మమ్మ అనారోగ్యంతో ఉంది. ఈ క్రమంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు  సబిత్ తన తల్లికి రూ.200 ఇచ్చాడు. ఈ విషయం అంజుకు తెలిసి.. సబిత్ పై అలిగింది. ఈ విషయమై అంజు తనతో గొడవపడిందని ఆమె  సబిత్ తెలిపాడు. ఇద్దరి మధ్య చాలా సమయం పాటు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సబిత్ తన మందుల కోసం మాణిక్‌పూర్ లోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. మందులు తీసుకుని సాయంత్రం ఇంటికి చేరుకుని చూడగా పిల్లలు, భార్య కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా  ఫలితంలేకుండా పోయింది.

సబిత్‌ ఆ చుట్టుపక్కల వారిని విచారించగా.. ఇద్దరు పిల్లలతో సహా అంజు బావిలో దూకినట్లు తెలిసింది. ఇది విన్న సబిత్ బావి దగ్గరకు చేరుకోగా, స్థానికులు ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. ముగ్గురిని విగతజీవులుగా చూసిన సబిత్ గుండెలు పగిలేలా రోధించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు విగతజీవులుగా మారడం వారి బంధుగణం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. నిన్ననే తెలంగాణలో ఓ  బాలిక తన తండ్రి అరిచాడని , ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా ప్రతి చిన్న విషయాలకు అనేక మంది దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి దానికి ఆత్మహత్య అంటూ ఆవేశానికి పోయి.. నిండు జీవితాన్ని అర్థాంతరం ముగిస్తున్నారు. తాజాగా జరిగిన ఘటన కూడా అలాంటింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş