P Krishna
KSRTC Bus Driver: పురటి నొప్పితో బాధపడుతున్న నిండు గర్భిణికి సమయస్పూర్తి ప్రదర్శించి ప్రాణాలు కాపాడు బస్ డ్రైవర్.. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
KSRTC Bus Driver: పురటి నొప్పితో బాధపడుతున్న నిండు గర్భిణికి సమయస్పూర్తి ప్రదర్శించి ప్రాణాలు కాపాడు బస్ డ్రైవర్.. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
P Krishna
సాధారణంగా ఆర్టీసీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.. ప్రయాణ ప్రాంగణాల వద్ద బస్సులు నిలపరు, ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తుంటారని కామెంట్స్ వినిపిస్తుంటాయి. ప్రయాణికుల ప్రాణాలు ఎంతో విలువైనవి.. అది బాధ్యతగా తీసుకొని ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చుతుంటారు. ఓ నిండు గర్భిణి బస్సులో ప్రయాణిస్తుంది. బస్సు మధ్యలోకి రాగానే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి.. దాంతో ప్రయాణికులు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే డ్రైవర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉండేటట్టు చేసింది. ఈ ఘటన కేరళాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
కేరళాలో త్రిసూర్ నుంచి కోజికోడ్ వెళ్తున్న బస్సులో 37 ఏళ్ల గర్భిణి ప్రయాణిస్తుంది. బస్సులో ఉండగానే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. బస్సులో తోటి ప్రయాణికులు కంగారు పడ్డారు. అదే సమయంలో డ్రైవర్ చాక్యచక్యంగా వ్యవహరించారు. ఈ ఘటన బుధవారం (మే 29) న జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బుధవారం కేఎస్ఆర్టీసీ బస్సు త్రిసూర్ నుంచి కోజికోడ్ వైపు వెళ్తుంది. బస్సులో గర్భిణికి పురిటి నొప్పులతో విల విలలాడిపోయింది. అది గమనించిన బస్ డ్రైవర్ వెంటనే డిపోకు సమాచారం అందించాడు. అంతేకాదు తాను రూట్ మార్చుతున్నా డిపోకి సమాచారం అందించాడు.
బస్సును వెంటనే త్రిసూర్ వైపు మళ్లించాడు. బస్సు సిబ్బంది సహాయంతో త్రిసూర్‌లోని అమలా ఆస్పత్రికి ఫోన్ చేసి అక్కడ వైద్య బృందాన్ని అప్రమత్తం చేశాడు డ్రైవర్. వేగంగా ఆస్పత్రికి చేరుకున్న వెంటనే వైద్యులు మహిళ కండీషన్ చూసి వార్డుకు తరలించే సమయం లేదని భావించారు. డెలివరీ కోసం బస్సులోనే అవసరమైన ప్రక్రియను చేపట్టారు. గర్భిణికి సుఖ ప్రసవం అయ్యేలా చేశారు. డెలివరీ తర్వాత తల్లీ, బిడ్డ సంరక్షణ కోసం ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంటైర్ ఈ ఎపిసోడ్ లో డ్రైవర్ చూపించిన సమయస్పూర్తి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిందని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ஐசியூ-வாக மாறிய அரசு பேருந்து… ஓடும் பேருந்தில் நிறைமாத கர்ப்பிணிக்கு திடீரென ஏற்பட்ட பிரசவ வலி… கேரள மாநிலம் திருச்சூரில் நடந்த நெகிழ்ச்சி சம்பவத்தின் வீடியோ பதிவு #Kerala | #GovtBus | #PregnantWomen pic.twitter.com/WjBjekaQl5
— Polimer News (@polimernews) May 29, 2024