iDreamPost
android-app
ios-app

కేరళ వరదల్లో దేవుడిలా ప్రత్యక్షమై! మృత్యువు ముంచుకొస్తున్నా.. అందరిని కాపాడి!

Kerala Floods 2024: కేరళ వరదల్ని దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఇప్పటికే 293 మంది మరణించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. వయనాడ్ మాత్రమే కాకుండా కోజికోడ్ ప్రాంతాలను కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ కూడా..

Kerala Floods 2024: కేరళ వరదల్ని దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఇప్పటికే 293 మంది మరణించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. వయనాడ్ మాత్రమే కాకుండా కోజికోడ్ ప్రాంతాలను కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ కూడా..

కేరళ వరదల్లో దేవుడిలా ప్రత్యక్షమై! మృత్యువు ముంచుకొస్తున్నా.. అందరిని కాపాడి!

ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలు కేరళను విషాదంలో ముంచేశాయి. ప్రకృతి పగబట్టిందా అన్నట్లుగా వరదలు ముంచెత్తాయి. కేవలం వయనాడ్ జిల్లా మాత్రమే కాకుండా పలు జిల్లాలు వర్షాలు, వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరద నీరు విలయ తాండవం చేసింది. ఇక కొండ చరియలు విరిగి పడి నాలుగు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. బురదలో వందలాది మృతదేహాలను వెలికి తీస్తున్నారు రెస్క్యూటీం. ఇప్పటి వరకు 293 మంది మృతి చెందారు. అలాగే 240 మంది ఆచూకీ గల్లంతయ్యింది. బురదలో కూరుకుపోయిన మృతదేహాలను, అలాగే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ సంయుక్తంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇదిలా ఉంటే .. 2018 మూవీ సీన్ మరోసారి రిపీట్ అయ్యింది.

2018లో కేరళలో జరిగిన వరదలు ఎంతటి విషాదాన్ని నింపాయో అందరికీ తెలుసు. ఈ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా టోవినో థామస్ హీరోగా 2018 అనే మూవీ తెరకెక్కి.. వంద కోట్లను వసూలు చేసింది. ఇందులో వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు వెళ్లి హీరో మరణిస్తాడు. అలాగే ఇప్పుడు ఓ రిటైర్డ్ టీచర్ కన్నుమూశాడు. కేరళలో కోజికోడ్ జిల్లాలో కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. అక్కడ విలంగాడ్ అనే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. జులై 30న కొండచరియలు విరిగి పడిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లాడు మాథ్యూ కులంతింకల్. రెస్య్కూ ఆపరేషన్‌లో పాల్గొంటుంగా వరద నీటిలో కొట్టుకు పోయాడు. పొరుగింటి వారిని కాపాడి..అతడు కొట్టుకుపోయాడు. దీంతో అతని కోసం అన్వేషణ సాగించారు.

ఆగస్టు 1న అతడి మృతదేహాన్ని విలంగాడ్‌లోని నదిలో వెలికి తీశారు. అతనికి భార్యా, ఐదుగురు పిల్లలున్నారు. సహాయక బృందాలు మంజచిలీలో మాథ్యూ మృతదేహాన్ని రికవరీ చేసుకున్నాయి. పోస్టు మార్టం అనంతరం విలంగాడ్‌లోని జెయింట్ జార్జ్ చర్చ్ శ్మశాన వాటిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎంత సేపు మనం, మన కుటుంబం బాగుండాలని స్వార్థంగా ఆలోచించే ఈ రోజుల్లో.. పొరుగింటి వారిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. ఓ దేవుడిలా ప్రత్యక్షమయ్యి.. సాయం చేశాడు. అలా సాయం చేస్తూనే ప్రాణాలు వదిలాడు. ప్రస్తుతం కేరళలో జరిగిన పెను విపత్తును దేశం మొత్తాన్ని కలిచివేస్తుంది. ఇక సినీ సెలబ్రిటీలు సైతం తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.