iDreamPost
android-app
ios-app

భార్య అంటే ఇలా ఉండాలి.. భర్తకి ఇలా కూడా ఖర్చు మిగిలించవచ్ఛా?

సాధారణంగా ఎక్కువ మంది మహిళలు డబ్బును చాలా జాగ్రత్తగా వినియోగిస్తుంటారు. అనవసరపు ఖర్చుల జోలికి అసలు వెళ్లారు. అయితే కొందరు మహిళలు మాత్రం..ఖర్చు తగ్గిస్తూనే భర్తలకు అదిరిపోయే గిప్టులు ఇస్తుంటారు. ఆ కోవకు చెందిన ఓ మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఎక్కువ మంది మహిళలు డబ్బును చాలా జాగ్రత్తగా వినియోగిస్తుంటారు. అనవసరపు ఖర్చుల జోలికి అసలు వెళ్లారు. అయితే కొందరు మహిళలు మాత్రం..ఖర్చు తగ్గిస్తూనే భర్తలకు అదిరిపోయే గిప్టులు ఇస్తుంటారు. ఆ కోవకు చెందిన ఓ మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భార్య అంటే ఇలా ఉండాలి.. భర్తకి ఇలా కూడా ఖర్చు మిగిలించవచ్ఛా?

సాధారణంగా మనం ఏదైనా వస్తువు పాతది అయిపోతే..దానిని పక్కన పడేస్తాం. అలా ఎన్నో రకాల వస్తువును వినియోగించిన తరువాత వాటిని ఓ మూలన పడేస్తుంటాము. అయితే కొందరు మాత్రం పాత వాటి నుంచి కొత్త వస్తువులుగా మార్చేస్తుంటారు. చివరకు ఇది ఫలానా పాత వస్తువునే అనే సందేహం వచ్చేలా రూపొందిస్తారు. తాజాగా ఓ మహిళ కూడా  చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. పాత వస్తువును కొత్తగా మార్చి..తన భర్తకు గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

పెళ్లి, బర్త్ డే,  వార్షికోత్సవం… ఇలా ఏదైనా సంతోషకరమైన వేడుకలు అనేవి కామన్. ఈ వేడుకల సందర్భంగా ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అంటే ఆడవారికి చాలా ఇష్టం. అందుకే చాలా మంది లేడీస్ పాతవి ఉపయోగంలో లేని వస్తువులను కూడా బయటకు తీసి శుభ్రం చేస్తుంటారు. మరికొందరు అయితే పాత వస్తువునుల ఉపయోగించి అందమై కళాఖండాలను తయారు చేస్తుంటారు. అలానే ఓ మహిళ తన బైక్‌ను ప్రత్యేకంగా అలంకరించి తన భర్తకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగినట్లు తెలుస్తోంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన హేతల్ అనే మహిళ..తన భర్తతో కలిసి నివాసం ఉంటుంది. ఇటీవలే తన భర్త పుట్టిన రోజుకు హేతల్ ఓ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. తన పాత బైక్ ను ఎంతో ప్రత్యేకంగా అలకరించింది.

ఆ బైక్ ను వివిధ రకాల రంగులతో అలంకరించింది. బైక్ ముందు భాగంలో తళుక్కున మెరిసే రంగులను ఆ మహిళ వేసింది. ఇక చూడటానికి ఆ స్కూటి ఎంతో అందంగా ఉంది. అంతేకాక ఇది కొత్త మోడలా అనే అంతలా తయారు చేసింది. ఇక హేతల్ తన భర్త కోసం ఆ బైక్ ను బాక్స్‌లో ప్యాక్‌ చేసింది. భర్తను ఆ బాక్స్ వద్దకు తీసుకెళ్లింది. భర్త రాగానే అట్ట పెట్టె తెరిచి చూడగా అందులో ఎంతో అద్భుతంగా అలంకరించిన బైక్ చూసి అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బైక్‌ డెకరేషన్‌ చూసి అతడు కాసేపు ఆశ్చర్యానికి లోనయ్యాడు. స్కూటీ హ్యాండిల్ తాళాల నుండి చక్రాల వరకు కూడా హేతల్  బైక్‌ మొత్తాన్ని ఇలా రెడీ చేసింది.

పూసలు, చమ్కీలతో ఆ బైక్ ను అలంకరించింది. ఈ స్కూటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గిఫ్ట్ ఇవ్వాలంటే.. కొత్తవే కొనాల్సి అవసరం లేదు. అందుకే ఉన్న వస్తువుని కొత్తగా మార్చి..ఇలా కూడా ఖర్చులు తగ్గించవచ్చని ఆ మహిళ ఆలోచించింది. ఈమె మాదిరిగానే ప్రతి భార్య ఆలోచిస్తే..భర్తలకు ఖర్చులు తగ్గుతాయని, అలానే టెన్షన్లు ఉండవని పలువురు అభిప్రాయా పడుతున్నారు. మరి.. ఈ మహిళ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.