P Krishna
సాధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఎక్కువగా చీర కట్టులోనే ఉంటారు. పట్టణాల్లో మాత్రం పెళ్లయిన తర్వాత కూడా మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడం సర్వసాధారణం.
సాధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఎక్కువగా చీర కట్టులోనే ఉంటారు. పట్టణాల్లో మాత్రం పెళ్లయిన తర్వాత కూడా మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడం సర్వసాధారణం.
P Krishna
భారత దేశం అభివృద్ది పథంలో ముందుకు సాగుతుంది. ఆడవాళ్లు మగవాళ్లతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు. విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో అన్నింటా తమ సత్తా చాటుతున్నారు. ఎంత అభివృద్ది చెందుతున్నా.. మహిళలు కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయలకు కట్టుబడి ఉంటున్నారు. దేశంలో చాలా మంది మహిళలు కట్టు, బొట్టు విషయంలో తమ సంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో బట్టల విషయంలో పెద్దగా పట్టింపులు ఏమీ ఉండవని తెలిసిందే. సాధారణంగా అత్తింటి వారు కోడళ్ల విషయంలో కాస్త కఠినంగా ఉంటారు.. ముఖ్యంగా బట్టల విషయంలో కాస్త ఎక్కువే.. చాలా వరకు చీరకట్టులో ఉండాలని సూచిస్తుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా జరిగింది. బట్టల విషయంలో అత్తాకోడళ్ల మధ్య వివాదం చివరికి పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హరిపర్వత్ కి చెందిన ఓ యువకుడికి ఎత్మాద్‌పూర్ గ్రామీణ ప్రాంతంలోని ఓ యువతితో సంవత్సరం క్రితం పెళ్లయ్యింది. సదరు యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇక యువకుడి కుటుంబం మొదటి నుంచి కాస్త వెస్టన్ కల్చర్ కి అలవాటు పడ్డవారు కావడంతో.. కట్టు, బొట్టు విషయంలో పెద్దగా పట్టింపులు ఉండేవి కావు. యువకుడి తల్లి జీన్స్ వేసుకుంటుంది. కోడలు కూడా తనలాగే మోడ్రన్ గా ఉండాలని.. జీన్స్, టీషర్ట్స్ వేసుకోవాలని ఆంక్షలు విధించింది. కానీ మొదటి నుంచి సంప్రదాయ కుటుంబంలో పెరిగి, చీర కట్టు మాత్రమే తెలిసిన కోడలు ఇందుకు ససేమిరా అంది. దీంతో కొంతకాలంగా అత్తా, కోడలు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ విషయంలో తల్లికి సపోర్ట్ చేస్తూ వచ్చాడు కొడుకు. కానీ కోడలు మాత్రం తాను చీరలే ధరిస్తా అంటూ చెప్పుకొచ్చింది.
కొంతకాలంగా సాగుతున్న ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ క్రమంలోనే తన తల్లి మాటలు వినవా అంటూ భార్యపై చేయి చేసుకున్నాడు భర్త. దీంతో ఆమెకు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. మొదట ఇది ఫ్యామిలీ మ్యాటర్ కావడంతో ఇరు వర్గాలను పిలిచి సర్ధి చెప్పి పంపించారు. తర్వాత కూడా ఇదే తంతు మొదలు కావడంతో ఆదివారం కౌన్సెలర్ ఇరు కుటుంబాలను పిలిచి.. కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. కానీ వర్క్ ఔట్ కాలేదు.. ఇరువురి కుటుంబాల మధ్య సయోద్య కుదిర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఏసీపీ సుకన్య శర్మ తెలిపిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేను గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగాను.. నాకు చీర కట్టు మాత్రమే తెలుసు. జీన్స్, టీషర్ట్స్ లాంటివి వేసుకోవడం ఇష్టం లేదు.. ఈ విషయం నా భర్తకు, అత్త కు చెప్పినా వినిపించుకోవడం లేదు.. పైగా నా భర్త నన్ను కొడుతున్నాడు’ అంటూ కోడలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.