iDreamPost
android-app
ios-app

పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు అకౌంట్ లో జమ.. ఎక్కడంటే?

  • Published Mar 25, 2024 | 8:36 AM Updated Updated Mar 25, 2024 | 8:36 AM

దేశంలో అనుకోని కారణాలు విభేదాల చేత భాగస్వామిక దూరమైన వాళ్లు, భర్త చనిపోయి మిగిలి ఒంటరి ప్రయాణం సాగించిన చాలామంది ఉన్నారు. అయితే అలా ఒంటరి బ్రతకడం అనేది చాలా కష్టం. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని రెండో పెళ్లిని ప్రోత్సహించేందుకు తాజాగా ఓ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది.

దేశంలో అనుకోని కారణాలు విభేదాల చేత భాగస్వామిక దూరమైన వాళ్లు, భర్త చనిపోయి మిగిలి ఒంటరి ప్రయాణం సాగించిన చాలామంది ఉన్నారు. అయితే అలా ఒంటరి బ్రతకడం అనేది చాలా కష్టం. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని రెండో పెళ్లిని ప్రోత్సహించేందుకు తాజాగా ఓ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది.

  • Published Mar 25, 2024 | 8:36 AMUpdated Mar 25, 2024 | 8:36 AM
పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు అకౌంట్ లో జమ.. ఎక్కడంటే?

ప్రపంచవ్యాప్తంగా భారతీయ వివాహ బంధానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో పవిత్రమైన సంస్కృ‌తి సంప్రదాయాలతో కూడిన ఈ వివాహ బంధాన్ని విదేశాల్లో సైతం గౌరవిస్తారు. మరి అంతటి గొప్పదైన ఈ దాంపత్య బంధం అనేది నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో కలిసి జీవించాలని దీవిస్తూ పెద్దలు పెళ్లిళ్లు జరిపిస్తూంటారు. అలా ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న జంట అనుకోని కారణాలు విభేదాలతో మధ్యలోనే విడిపోతుంటారు. అయితే ఇలా విభేదాల కారణంగా విడిపోయి భాగస్వామికి దూరమైన వాళ్లు, భర్త మరణించి వితంతువుగా జీవిస్తున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఝార్ఖండ్ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

దేశంలో అనుకోని కారణాలు విభేదాల చేత భాగస్వామిక దూరమైన వాళ్లు, భర్త చనిపోయి మిగిలి ఒంటరి ప్రయాణం సాగించిన చాలామంది ఉన్నారు. అయితే అలా ఒంటరి బ్రతకడం అనేది చాలా కష్టం. అందులోనూ పిల్లలు ఉంటే వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని రెండో పెళ్లిని ప్రోత్సహించేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం తాజాగా ఓ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుత సమాజంలో రెండో పెళ్లి అంటే అదే ఏదో తప్పులా నేరంలా చిన్నచూపు చూస్తుంటారు. అలాగే సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో సంకెళ్లు వేస్తుంటారు. అలాంటి సంకెళ్లను తెంపి.. ఒంటరిగా మిగిలిన వితంతువులకు మరో కొత్త జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో.. ఝార్ఖండ్ ప్రభుత్వం విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన అనే పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో వితంతువులను రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది.

2 lakhs if you get married

అయితే ఈ పథకంకు కావలసిన పత్రాలేవంటే..  మొదటి భర్త డెత్ సర్టిఫికేట్‌ను, అలాగే  రెండో పెళ్లికి సంబంధించిన మ్యారేజీ సర్టిఫికేట్‌ను అర్హులైన మహిళలు అధికారులకు సమర్పిస్తే చాలు. ఇక ఆ మహిళ బ్యాంకు ఖాతాలో రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం జమ చేస్తుంది.  కానీ, ఇందుకు ఝార్ఘండ్ ప్రభుత్వం ఒక నిబంధన అమలు చేస్తోంది. అందులో.. రెండో పెళ్లి చేసుకున్న వారు  ఏడాది లోపే ఈ సర్టిఫికేట్లను సమర్పిస్తేనే రూ.2  లక్షల సాయం అందిస్తామని తెలిపింది. కాగా, గవర్నమెంట్ ఉద్యోగులకీ, పెన్షన్లు తీసుకునేవారికీ, ఆదాయపన్ను చెల్లించేవారికి మాత్రం ఈ పథకం వర్తించదు. మరి, ఒంటరి మహిళలకు రెండో పెళ్లిని ప్రోత్సాహించి ఝార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.