iDreamPost
android-app
ios-app

టెస్లా విజయంలో భారతీయ ఇంజనీర్ కృషి.. ఎవరీ అశోక్ ఎల్లుస్వామి?

  • Published Aug 02, 2024 | 11:00 PM Updated Updated Aug 02, 2024 | 11:00 PM

Who Is Ashok Elluswamy To Played A Key Role In Tesla's Success: టెస్లా కారు గురించి తెలిసే ఉంటుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో డ్రైవర్ లేకుండా సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ తో నడుస్తుంది. అందుకే ఈ కారు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సక్సెస్ అయ్యింది. అయితే ఇంతటి సక్సెస్ కి కారణం ఒక భారతీయుడని మీకు తెలుసా? అతనే లేకపోతే ఇవాళ టెస్లా వచ్చేదే కాదు.

Who Is Ashok Elluswamy To Played A Key Role In Tesla's Success: టెస్లా కారు గురించి తెలిసే ఉంటుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో డ్రైవర్ లేకుండా సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ తో నడుస్తుంది. అందుకే ఈ కారు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సక్సెస్ అయ్యింది. అయితే ఇంతటి సక్సెస్ కి కారణం ఒక భారతీయుడని మీకు తెలుసా? అతనే లేకపోతే ఇవాళ టెస్లా వచ్చేదే కాదు.

  • Published Aug 02, 2024 | 11:00 PMUpdated Aug 02, 2024 | 11:00 PM
టెస్లా విజయంలో భారతీయ ఇంజనీర్ కృషి.. ఎవరీ అశోక్ ఎల్లుస్వామి?

ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ప్రధాన సూత్రధారులుగా భారతీయులు ఉన్నారు. భారత్ కి చెందిన వ్యక్తులు, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు దేశ, విదేశాల్లో పలు రంగాల్లో చక్రం తిప్పుతున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల అభివృద్ధిలో భారతీయుల హస్తం ఎంతగానో ఉంది. ఆ విషయాన్ని ఆయా దిగ్గజ కంపెనీలే ఒప్పుకుంటాయి. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా ఇటీవల ఈ విషయం గురించి ప్రస్తావించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఎదుగుదలలో భారతీయుల సహకారం మరువలేనిది అని అన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలన మార్క్ ని క్రియేట్ చేసిన ఎలాన్ మస్క్ టీమ్ లో కూడా ఒక భారతీయుడు ఉండడం విశేషం. టెస్లా కారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతం. ఆ అద్భుతమైన కారులో ప్రయాణించేందుకు ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారత్ లో ఇంకా లాంఛ్ అవ్వనప్పటికీ విదేశాల్లో లాంఛ్ అయ్యాయి. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించిన ఎలక్ట్రిక్ కారు ఇది. ఆటోపైలట్ ఫీచర్ ఉంది. డైరెక్షన్స్ ఇస్తే డ్రైవర్ లేకున్నా దానికదే డ్రైవ్ చేసుకుంటూ గమ్యానికి చేరుస్తుంది. ఇంత ప్రత్యేకమైన ఫీచర్ ని డెవలప్ చేసింది మన భారతీయుడే. టెస్లా కార్ల తయారీలో ఆటోపైలట్ సాఫ్ట్ వేర్ డైరెక్టర్ గా అశోక్ ఎల్లుస్వామి ఉన్నారు. టెస్లా కార్ల తయారీ ప్రారంభ సమయంలో ఏఐ/ఆటోపైలట్ టీమ్ లో చేరిన మొట్టమొదటి ఇంజనీర్ ఈయనే. 2014లో టెస్లా ఏఐ/ఆటోపైలట్ టీమ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేరారు. 2019 నుంచి టెస్లా ఆటోపైలట్ సాఫ్ట్ వేర్ కి డైరెక్టర్ గా ఉన్నారు. అమెరికాలోని ఈయన శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటారు. ఈయన తమిళనాడులో పుట్టి పెరిగారు. చెన్నైలోని గిండి ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు.

టెస్లాలో చేరకముందు వ్యాబ్ కో వెహికల్ కంట్రోల్ సిస్టమ్స్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేశారు. ఫోక్స్ వ్యాగన్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబ్ లో కూడా పని చేశారు. ఆ తర్వాత అమెరికాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో రోబోటిక్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం టెస్లా కార్ల కంపెనీలో చేరారు. టెస్లా కార్ల కంపెనీలో చేరిన తొలి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇతనే కావడం విశేషం. అలా చేరిన అశోక్ ఎల్లుస్వామి.. అంచెలంచెలుగా ఎదుగుతూ టీమ్ ని లీడ్ చేసే స్థాయికి ఎదిగారు. టెస్లా విజయంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఎలాన్ మాస్క్.. అశోక్ లేకపోతే టెస్లా లేదని సంచలన కామెంట్స్ చేశారు. అశోక్ కి గతంలో మస్క్ థాంక్స్ కూడా చెప్పారు. టెస్లా ఏఐ/ఆటోపైలర్ బృందంలో చేరిన తొలి వ్యక్తి అశోక్ అని.. బృందంలో ఏఐ/ఆటోపైలట్ సాఫ్ట్ వేర్ ని శాసించే స్థాయికి ఎదిగారని.. అశోక్, తన బృందం లేకపోతే ఇవాళ టెస్లా ఒక సాధారణ కార్ల కంపెనీగా మిగిలిపోయేదని అన్నారు. అంతలా టెస్లా సక్సెస్ లో భారతీయుడు కృషి ఉంది.