Arjun Suravaram
ఇంటి వాస్తుకు సంబంధించి అనేక మందికి చాలా సందేహాలు ఉంటాయి. అలానే కొందరికి ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. అసలు ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటి వాస్తుకు సంబంధించి అనేక మందికి చాలా సందేహాలు ఉంటాయి. అలానే కొందరికి ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. అసలు ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Arjun Suravaram
ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించుకోవడం అనేది ఒక కళ. అలానే చాలా మంది తమ సొంతింటి కళను సాకారం చేసుకుంటారు. ఇక ఇంటిని నిర్మించే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా కిచెన్, బెడ్ రూమ్, బాత్ రూమ్ వంటివి ఇంట్లో ఏ దిక్కు ఉండాల్లో పక్క.. అలానే నిర్మించుకుంటారు. ఇక కొందరు అద్దె ఇంట్లో ఉంటున్న కూడా వాస్తు చూసుకుని మరి.. నివాసం ఉంటున్నారు. చాలా మందికి ఇప్పటికీ ఏ దిక్కు, ఏ మూల ఏమి ఉండాలి అనే దానిపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు. అందుకే వాస్తు నిపుణులను ఆశ్రయిస్తుంటారు. అలాంటి సందేహాల్లో ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉండాలి అనేది ఒకటి. ఈ క్రమంలోనే ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉండాలి అనే దానిపై వాస్తు నిపుణులు సూచించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వాస్తు శాస్త్రం జ్యోతిష్యంలో ఒక ముఖ్యమైన భాగం. అలానే ఇల్లు కట్టేటప్పుడు వాస్తు నియమాలు పాటిస్తే ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని నిపుణులు చెబుతుంటారు. అలానే కుటుంబంలోని వ్యక్తులు పురోగమిస్తారు. వాస్తవానికి..స్నానపుగదులు ఇంట్లో ముఖ్యమైన భాగం. ఈ ప్రదేశంలో రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మీరు బాత్రూమ్‌ని వాస్తు ప్రకారం నిర్మిస్తే.. ఆ ఇంట్లో వాతావరణం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుందట.
వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో బాత్రూమ్ ఎలా ఉండాలో ఈ రోజు మనం తెలుసుకుందాం. వాయువ్యం, ఆగ్నేయంలో స్నానాల గది ఉంటే మంచి జరుగుతుంది. నైరుతి ప్రాంతంలో బాత్రూమ్ అనేది ఉండకూడదంట. కారణం నైరుతిలో గొయ్యి అనేది ఉండకూడదు. ఒక వేళ బాత్రూమ్ నిర్మిస్తే.. దాని కోసం గొయ్యి తప్పనిసరి ఉంటుంది. అందుకే బాత్రూమ్ నైరుతి మూలన ఉంటే అన్ని రకాల సమస్యలూ వస్తాయి. అదే విధంగా మెట్ల కింద మాత్రం బాత్రూమ్ ఉండొద్దు. కానీ ఎక్కువ మంది ఇంటిపైకి వెళ్లేందుకు కట్టే మెట్ల కింద ఖాళీ స్థలం కలిసి వస్తుందని బాత్రూమ్ అక్కడే కడతారు.
బాత్రూమ్లో గుంట, నీళ్లు ఉంటాయి. కాబట్టి వాటిపై నుంచి నడవకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. బాత్రూమ్ తలుపులు ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి. ఇనుప తలుపులకు బదులుగా చెక్క తలుపులను ఏర్పాటు చేయడం మంచిది. ప్రతి బాత్రూమ్‌కి కిటికీ ఉండాలి. తద్వారా సరైన వెంటిలేషన్ ఉంటుంది. ప్రతికూల శక్తి బయటకు వెళుతుంది. కిటికీ తూర్పు, ఉత్తరం, పడమర వైపు ఉండాలి. మొత్తంగా మెట్ల కింద భాగం, నైరుతిలో బాత్రూమ్ ఉండటం అనేది అది అన్నివిధాలా అరిష్టమేమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ పై సమాచారం వాస్తు నిపుణులు తెలిపిన అభిప్రాయాల ప్రకారం ఇవ్వడం జరిగింది. మరి..వాస్తు నిపుణలు తెలిపిన ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.