iDreamPost
android-app
ios-app

రైలులో మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో ఎవరైనా కూర్చుంటే ఇలా చేయండి

  • Published Jun 12, 2024 | 10:08 PM Updated Updated Jun 12, 2024 | 10:08 PM

Do This When Some One Sitting In Your Seat: రైలులో మీరు బుక్ చేసుకున్న సీట్లో ఎవరైనా కూర్చుంటే పరిస్థితి ఏంటి? వాళ్ళని సీట్లోంచి ఎలా లేపాలి? వాళ్ళు దౌర్జన్యం చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎలా ఫిర్యాదు చేయాలి? వంటి వివరాలు మీ కోసం.

Do This When Some One Sitting In Your Seat: రైలులో మీరు బుక్ చేసుకున్న సీట్లో ఎవరైనా కూర్చుంటే పరిస్థితి ఏంటి? వాళ్ళని సీట్లోంచి ఎలా లేపాలి? వాళ్ళు దౌర్జన్యం చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎలా ఫిర్యాదు చేయాలి? వంటి వివరాలు మీ కోసం.

  • Published Jun 12, 2024 | 10:08 PMUpdated Jun 12, 2024 | 10:08 PM
రైలులో మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో ఎవరైనా కూర్చుంటే ఇలా చేయండి

రైలు ప్రయాణం అంటేనే దూర ప్రయాణాలు. గంటల గంటలు సమయం పడుతుంది. అంత సేపు నిలుచోవాలంటే కష్టం కాబట్టి చాలా మంది ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకుంటారు. వారం, పది రోజుల ముందే సీట్లను బుక్ చేసుకుంటారు. నలిగిపోయి వెళ్లడం కంటే ప్రశాంతంగా సీటు బుక్ చేసుకుని వెళ్తే ఎంత బాగుంటుంది. అందుకే టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే కష్టపడి బుక్ చేసుకున్న వ్యక్తి సీట్లో వేరే వ్యక్తులు కూర్చుంటారు. థియేటర్స్, బస్సులు, రైళ్లలో ఎవరో బుక్ చేసుకున్న సీట్లలో కొంతమంది కూర్చోవడం, నిద్రపోవడం లాంటివి చేస్తారు. మేము బుక్ చేసుకున్నామన్నా సరే సీట్లోంచి లేవరు. పైగా దౌర్జన్యం చేస్తారు. రైళ్లలో ఎక్కువగా ఇలాంటి ఘటనలు ఎదురవుతాయి.

వెంకీ సినిమాలో టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కే బ్యాచ్ ఉంటారు. రిజర్వ్డ్ బోగీల్లో, ఏసీ బోగీల్లో ట్రావెల్ చేస్తుంటారు. టికెట్ బుక్ చేసుకున్నవాళ్ళు వచ్చి అడిగితే కొంతమంది సీటు ఖాళీ చేస్తారు. కొంతమంది మాత్రం సీటు ఖాళీ చేయరు. అలాంటి పరిస్థితుల్లో గొడవ పడలేని పరిస్థితి. భార్య, పిల్లలతో వెళ్తున్నాం ఎందుకొచ్చిన గొడవ అని కాంప్రమైజ్ అయిపోతారు. చుట్టూ జనం ఉన్నా కూడా వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. ఎవరూ పట్టించుకోరు. పోనీ పోలీసులకు ఫిర్యాదు చేద్దామన్నా గానీ రైలు కదులుతుంటుంది. స్టేషన్ దగ్గర రైలు ఆగినా ఫిర్యాదు చేద్దామంటే అప్పటి వరకూ రైలు ఆగదు. అలాంటప్పుడు ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న ఒక లోలోపల మదనపడుతుంటారు.

అయితే మీరు జస్ట్ మీ ఫోన్ లో ఫిర్యాదు చేస్తే చాలు.. టీసీ వచ్చి వాళ్ళని సీట్లోంచి లేపి మీకు సీట్లు ఇస్తారు. దాని కోసం మొదటగా మీరు మీ టికెట్ మీద ఉన్న సీటు నంబర్, ఆ పరాయి కూర్చున్న సీటు నంబర్ ఒకటే కాదో నిర్ధారించుకోవాలి. ఫస్ట్ అయితే ఆ సీటు నాది అని రిక్వెస్ట్ చేయాలి. మనిషి అయితే లేస్తాడు. అప్పటికీ లేవకపోతే ఆ సమయంలో రైలు రైల్వేస్టేషన్ లో ఆగి ఉంటే రైల్లోంచి రైల్వే సిబ్బందిని పిలిచి చెప్పవచ్చు. వారు సహాయం చేస్తారు. ఒకవేళ కదులుతున్న రైలులో సమస్య ఎదురైతే కనుక 139 హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేసి జరిగింది చెప్పవచ్చు.

లేదా www.coms.indianrailways.gov.in పోర్టల్ లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా 9717630982 కి ఎస్ఎంఎస్ సెండ్ చేయవచ్చు. లేదా ఐఆర్సీటీసీ కంప్లైంట్ నంబర్ 011-23345400 నంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయచ్చు. SEAT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి PNR నంబర్ స్పేస్ కోచ్ నంబర్ సీట్ నంబర్ టైప్ చేసి 139 నంబర్ కి 139 నంబర్ కి మెసేజ్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కాసేపటికి టీసీ వచ్చి మీ సీట్లో కూర్చున్న వారిని ఖాళీ చేయిస్తారు. ఇలా మీరు మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో కూర్చున్నవారిని ఖాళీ చేయించవచ్చు.