iDreamPost
android-app
ios-app

ఆధునిక భగీరథుడు.. ఊరి కోసం వంతెన నిర్మించిన వెల్డింగ్ వర్కర్

  • Published Jun 08, 2024 | 10:01 PMUpdated Jun 08, 2024 | 10:01 PM

Welding Worker Builds Bridge: మనుషులకి ఆపద వస్తే కొంతమంది చూస్తూ ఊరుకోలేరు. కష్టం ఉందంటే చాలు వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఇతనొక వెల్డింగ్ వర్కర్. ఆ ఊరి పాలిట భగీరథుడిగా మారి ఏకంగా ఊరికి బ్రిడ్జినే తీసుకొచ్చారు.

Welding Worker Builds Bridge: మనుషులకి ఆపద వస్తే కొంతమంది చూస్తూ ఊరుకోలేరు. కష్టం ఉందంటే చాలు వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఇతనొక వెల్డింగ్ వర్కర్. ఆ ఊరి పాలిట భగీరథుడిగా మారి ఏకంగా ఊరికి బ్రిడ్జినే తీసుకొచ్చారు.

  • Published Jun 08, 2024 | 10:01 PMUpdated Jun 08, 2024 | 10:01 PM
ఆధునిక భగీరథుడు.. ఊరి కోసం వంతెన నిర్మించిన వెల్డింగ్ వర్కర్

సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని పరితపించే మనుషులు చాలా అరుదుగా ఉంటారు. ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవిస్తే బయట వాళ్ళని కూడా కుటుంబ సభ్యుల్లా భావించి సహాయం చేస్తారు. ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకు చెందిన వారే. నిజంగా ఈయన చాలా గ్రేట్. స్కూల్ పిల్లల కోసం ఏకంగా వంతెన నిర్మించారు. భారీ వర్షాల కారణంగా వంతెన కూలిపోతే అధికారులు పట్టించుకోలేదు. చుట్టుపక్కల స్థానికంగా ఉండే ప్రజలు కూడా పట్టించుకోలేదు. ఏం కావాలన్నా గానీ 160 రూపాయలు ఖర్చు పెట్టి చుట్టూ తిరిగి వెళ్ళాలి. వంతెన ఉన్నప్పుడు జస్ట్ వంతెన దాటితే సరిపోయేది. కానీ వర్షాల కారణంగా బ్రిడ్జ్ కూలిపోవడంతో ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. పిల్లలు బడికి వెళ్లడం మానేశారు.

ఆ విషయం తెలిసిన వెల్డింగ్ వర్కర్ కేఈ నజీబ్ చలించిపోయారు. పిల్లల కోసం, ఇక్కడి వారి కోసం సహాయం చేయాలని ఫిక్స్ అయ్యారు. అంతే చందాలు వసూలు చేసి మరీ ఒక వంతెనను నిర్మించేశారీ వెల్డింగ్ వర్కర్. కేరళలోని కొట్టాయం ఇడుక్కి సరిహద్దుల్లో కొక్కాయార్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో పుల్లుకాయార్ నదిపై ఆర్చ్ ఆకారంలో కేఈ నజీబ్ అనే వెల్డింగ్ వర్కర్ చందాలు వసూలు చేసి ఇనుప వంతెనను నిర్మించారు. ఎంతయార్ తూర్పు, వడక్కెమల, కనకాపురం, ముక్కులం గ్రామాల వాసులు ఏమైనా తెచ్చుకోవాలంటే ఎలంనాడు రూట్లో 5 కిలోమీటర్లు వెళ్లి ఎంతయార్ చేరుకోవాల్సిన పరిస్థితి. ఎంతయార్ వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.

ఈ వంతెన 2021లో భారీ వర్షలకు కూలిపోయింది. ప్రజల ఇక్కట్లు పడుతుండడం, పిల్లల చదువులు పోతుండడం చూసి కేఈ నజీబ్ స్థానికుల నుంచి బ్రిడ్జ్ నిర్మాణం కోసం 1.25 లక్షల రూపాయల నిధులు సేకరించి ఇనుప వంతెనను నిర్మించారు. కొక్కయార్ గ్రామ పంచాయితీ వార్డు సభ్యుడు పీవీ విశ్వనాథన్, అధ్యక్ షుబు మోలి డొమెనిక్ ఆధ్వర్యంలో వంతెన నిర్మాణానికి కావలసిన నిధులను సేకరించారు. అనంతరం స్థానికుల సహకారంతో వంతెనను నిర్మించారు. నజీబ్ వెల్డింగ్ షాప్ ని నడుపుతూనే బిల్డింగ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నారు. ఈయన పూనుకున్న పనికి స్థానికులంతా ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేశారు. నజీబ్ చేసిన పనికి గ్రామస్తులంతా ప్రశంసిస్తున్నారు.         

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి