Arjun Suravaram
వ్యవసాయంలో రైతుకు భారీ నష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు, అప్పులు తీర్చ లేక ఆత్మహత్య చేసుకున్న రైతు.. ఇలాంటి న్యూస్ లు మనం తరచుగా వింటుంటాం. కానీ ప్రస్తుతం కొందరు యువ రైతులు సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలి ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ భారీ ఆదాయాన్ని పొందుతున్నారు.
వ్యవసాయంలో రైతుకు భారీ నష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు, అప్పులు తీర్చ లేక ఆత్మహత్య చేసుకున్న రైతు.. ఇలాంటి న్యూస్ లు మనం తరచుగా వింటుంటాం. కానీ ప్రస్తుతం కొందరు యువ రైతులు సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలి ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ భారీ ఆదాయాన్ని పొందుతున్నారు.
Arjun Suravaram
ప్రతి ఒక్కరి జీవితంలో బాగా ధనం సంపాదించాలనే కోరిక ఉంటుంది. ఉద్యోగస్తుల నుంచి రైతుల వరకు అందరికీ బాగా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది. అయితే రైతుకైనా, ఉద్యోగికైనా చేసే పని విషయంలో ప్రత్యేక శైలీ చూపిస్తే.. తప్పకుండా తాము అనుకున్న లక్ష్యానికి చేరుతుంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొందరు రైతులు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకరు ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఓ యువ రైతు. సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలి ఆధునిక పద్ధతుల్లో పంటలు పండిస్తూ భారీ ఆదాయాన్ని పొందుతున్నారు ఈ యువరైతు. కేవలం రెండు నెలల్లో రెండున్నర లక్షలు సంపాదించి ఆదర్శంగా నిలిచాడు. మరి.. ఆ యువ రైతు సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం…
నేటి కాలంలో చాలా మంది రైతులు వ్యవసాయం చేయలేక, పొలాలు వదిలేసి పట్టణాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. అలాగే కొందరికి వ్యవసాయం చేస్తున్న పెద్దగా లాభాలు రావడం లేదని పట్టణాలకు వెళ్లిపోతున్నారు. ఇలాంటి తరుణంలో కొందరు యువ రైతులు మాత్రం కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తూ భారీ ఆదాయం పొందుతున్నారు. యూపీలోని రాయ్ బరేలీ జిల్లాలోని శివగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్రా ఖుర్ద్ గ్రామంలో విజయ్ కుమార్ అనే తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. విజయ్ కుమార్ తనదైన విధానంలో వ్యవసాయం చేసి అందరి చేత ఔరా అనిపించుకున్నారు. ఆయన తన పూర్వీకుల నుంచి పొందిన భూమిలో సంప్రదాయ వ్యవసాయం చేసేవాడు. కానీ అతని బంధువుల్లో ఒకరు హార్టికల్చర్ తీసుకోమని, దాని ద్వారా మంచి ఆదాయం వస్తుందని సూచించారు.
ఒక రోజు విజయ్ కుమార్ బంధువు అయినా పవన్ వర్మ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాయ్ బరేలీ వచ్చాడు. ఈ సందర్భంలో వ్యవసాయం గురించి వీరిద్దరి మధ్య చర్చ వచ్చింది. ఈ క్రమంలో పుచ్చకాయ పండించమని సూచించాడు. పవన్ వర్మ సలహాతో మేరకు పుచ్చకాయ సాగుకు ప్రారంభించాడు. ఇప్పుడు ఈ సాగులో తక్కువ ఖర్చుతో పాటు అధిక లాభం ఉండటంతో ఇతర పంటలతో పోలిస్తే చాలా లాభదాయకంగా ఉందని విజయ్ కుమార్ తెలిపాడు. అదే విధంగా సమ్మర్ సీజన్ లో మార్కెట్‌లో పుచ్చకాయలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మంచి ధరకు వీటిని సులభంగా విక్రయిస్తుంటారు. ఇదే డిమాండ్ ను అవకాశంగా తీసుకుని విజయ్ కుమార్ తన ఎకరం పొలంలో పుచ్చకాయలు పండిస్తున్నాడు.
మొత్తం సీజన్‌లో దాదాపు రూ.50 నుంచి రూ. 60 వేల పెట్టుబడిగా పెట్టాడు. పుచ్చకాయల దిగుబడి బాగా వచ్చింది. మార్కెట్ లో మంచి ధర పలికింది. ఇలా విజయ్ కుమార్ పెట్టిన పెట్టుబడులు తీసివేసి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఆదాయం వస్తుందన్నారు. మిగతా పంటల కంటే ఎక్కువ ఆదాయం ఇచ్చే పంట ఇదేనని విజయ్ అన్నారు. ఇక్కడ పండే పుచ్చకాయలను రాయ్‌బరేలీ, లక్నో మార్కెట్‌లకు తరలిస్తున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. ఇలా సీజన్ కి అనుగుణంగా వ్యవసాయం చేస్తే.. మంచి లాభాలు అర్జించవచ్చని వ్యవసాయ నిపుణలు చెబుతున్నారు. మరి.. వ్యవసాయంలో మంచి విజయం సాధిస్తున్న ఈ యువరైతుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.