iDreamPost
android-app
ios-app

చెత్త ఎరుకునే వృద్ధుడిని మానసికంగా హింసించి.. చివరకు ప్రాణాలు తీశారు!

కొందరిపై ట్రోల్స్‌, మీమ్స్, వీడియోలు  చేసి..వైర‌ల్‌ చేయ‌డం వ‌ల్ల తాత్కాలికంగా న‌వ్వుకోవ‌చ్చు. కానీ కొందరు చేసే ట్రోల్స్, హేళన వీడియోల కారణం కొంత మంది జీవితాల‌ను చిన్నాభిన్న అవుతాయి. వీటి కారణం తాజాగా ఓ వృద్ధుడు బలయ్యాడు.

కొందరిపై ట్రోల్స్‌, మీమ్స్, వీడియోలు  చేసి..వైర‌ల్‌ చేయ‌డం వ‌ల్ల తాత్కాలికంగా న‌వ్వుకోవ‌చ్చు. కానీ కొందరు చేసే ట్రోల్స్, హేళన వీడియోల కారణం కొంత మంది జీవితాల‌ను చిన్నాభిన్న అవుతాయి. వీటి కారణం తాజాగా ఓ వృద్ధుడు బలయ్యాడు.

చెత్త ఎరుకునే వృద్ధుడిని మానసికంగా హింసించి.. చివరకు ప్రాణాలు తీశారు!

ప్రస్తుత సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా మంది పలు రకాల వీడియోలు, రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. అంతేకాక మరికొందరు ఫేమస్ అయ్యేందుకు తెగ కష్టపడుతుంటారు. ఇదే సమయంలో ట్రోలింగ్స్ అనేవి కూడా ఎదురవుతుంటాయి. కొందరు శృతిమించి ట్రోలింగ్ చేస్తూ పక్కవారిని మానసికంగా హింసిస్తారు. అలానే కొన్ని రకాల హేళన వీడియోలకు సున్నిత మనసులు కలిగిన వారు మానసికంగా కుంగిపోతుంటారు. కొందరు అయితే దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ట్రోలర్స్ కారణంగా ఓ చెత్త ఎరుకుని జీవనం సాగించే వృద్దుడు బలయ్యాడు. ఈ  విషాధ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కొందరిపై ట్రోల్స్‌, మీమ్స్, వీడియోలు  చేసి..వైర‌ల్‌ చేయ‌డం వ‌ల్ల తాత్కాలికంగా న‌వ్వుకోవ‌చ్చు. కానీ కొందరు చేసే ట్రోల్స్, హేళన వీడియోల కారణం కొంత మంది జీవితాల‌ను చిన్నాభిన్న అవుతాయి. స‌ర‌దాకు చేసిన ప‌నుల వ‌ల్ల  అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. గతంలో ఏపీలో గీతాంజలి అనే మహిళ ఈ ట్రోలింగ్స్ కారణంగా మనస్తాపానికి గురై..ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. అలానే ఇటీవలే కేరళకు చెందిన ఆదిత్య నాయర్ అనే యువతి కూడా ట్రోల్స్ కారణంగా మానసిక వేదన చెంది.. ఆత్మహత్య  చేసుకుంది. అంతేకాక వీళ్ల మాదిరిగా ఎంతో మంది మ‌ర‌ణించ‌గా.. తాజాగా వ్యర్థాలను సేకరించే ఓ వృద్ధుడు త‌న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవ‌మాన భారంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడ్డాడు.

రాజస్థాన్ రాష్ట్రం లోహత్ అనే గ్రామంలో ప్ర‌తాప్ సింగ్ అనే వృద్దుడు  రోడ్ల పక్కన  వ్యర్థ పదార్థాలను సేకరించి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన వ్యర్థాలను ఓ హ్యాండ్‌కార్ట్ లో వేసుకుని తీసుకెళ్లేవాడు. స్థానికులందరికీ సుప‌రిచితుడు కావ‌డంతో అంద‌రూ అత‌న్ని బాబాజీ అని పిలిచేవారు. ఆ వృద్ధుడిపై లొహావత్ గ్రామానికి చెందిన కొందరు యువకులు వీడియోలు తీయ‌డం ప్రారంభించారు. వాటిని మీమ్స్‌గా రూపొందించి నెట్టింట్లో షేర్ చేశారు. పోస్టు చేసిన వీడియోల్లో కొంతమంది వ్యక్తులు అతనిని వెంబడించి హేళన చేస్తూ కనిపించింది.

ఇక ఈ  వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తనను హేళన చేస్తూ తీసిన వీడియోలతో పరువు పోయిందని  ఆ వృద్ధుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చివరకు రహదారి పక్కన  ఉన్న ఓచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు. మనుషులను ఇలా కూడా చంపుతారా అంటూ కొందరు ఆ యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుడి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.