iDreamPost
android-app
ios-app

లక్షలు వచ్చే కార్పోరేట్ జాబ్ వదిలేసి.. సివిల్స్ ర్యాంక్ కొట్టింది!

  • Published Apr 17, 2024 | 3:26 PM Updated Updated Apr 17, 2024 | 3:26 PM

Noida Woman Civil Rank: కృషీ, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యం ఎంత కఠినంగా ఉన్నా సాధించి తీరుతారని ఎంతోమంది నిరూపించారు. కుటుంబ కష్టాలు ఉన్నా తాను అనుకున్న లక్ష్యం కోసం అహర్శశలూ కష్టపడి సివిల్స్ లో 18 వ ర్యాంక్ సంపాదించింది ఓ యువతి.

Noida Woman Civil Rank: కృషీ, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యం ఎంత కఠినంగా ఉన్నా సాధించి తీరుతారని ఎంతోమంది నిరూపించారు. కుటుంబ కష్టాలు ఉన్నా తాను అనుకున్న లక్ష్యం కోసం అహర్శశలూ కష్టపడి సివిల్స్ లో 18 వ ర్యాంక్ సంపాదించింది ఓ యువతి.

లక్షలు వచ్చే కార్పోరేట్ జాబ్ వదిలేసి.. సివిల్స్ ర్యాంక్ కొట్టింది!

ఉన్నత విద్యనభ్యసించిన వారికి మంచి ఉద్యోగాలు.. సమాజంలో గొప్ప గౌరవం దక్కుతుంది. మంచి చదువు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కోట్లు సంపాదించేవారు ఎంతోమంది ఉన్నారు. అందుకోసం చిన్నప్పటి నుంచి తమ తాహతకు మించినా సరే పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివిస్తుంటారు తల్లిదండ్రులు. చాలా మంది బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా.. ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్లుగా స్థిరపడుతుంటారు. కొంతమంది మాత్రం సివిల్స్ లో మంచి ర్యాంక్ సంపాదించి గౌరవమైన ప్రభుత్వ ఉద్యోగం కోసం పరితపిస్తుంటారు. ఓ యువతి సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో  కార్పోరేట్ ఉద్యోగాన్ని కూడా పక్కకు పెట్టింది. వివరాల్లోకి వెళితే..

సివిల్స్ లో ర్యాంక్ సాధించడం అంటే అంత ఆశామాశీ వ్యవహారం కాదన్న విషయం తెలిసిందే. సివిల్స్ లో ర్యాంక్ కొట్టాలంటే కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది. దీక్షగా చదివిన వారు కూడా కొన్నిసార్లు ఒకటీ రెండు సార్లు ప్రయత్నించాల్సి ఉంటుంది. అలా కృషీ, పట్టుదలతో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి సివిల్స్ లో ర్యాంక్ సంపాదించింది నోయిడా సెక్టార్ 82 లోని వివేక్ విహార్ లో నివిసించే వార్దా ఖాన్. మంగళవారం ప్రకటించి యూసీఎస్సీ ఫలితాల్లో 18 వ ర్యాంక్ సాధించి అందరిచే శభాష్ అనిపించుకుంది. ఈ సందర్బంగా వార్దా ఖాన్ తన తొలి ప్రాధాన్యత ఇండియన్ ఫారిన్ సర్వీస్ అని తెలిపింది. భారత్ ని ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్దా ఖాన్ తెలిపింది.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలనే కోరిక ఉండేది. అందుకోసం తన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో సహకారం అందించారు. కాలేజ్ డేస్ నుంచి సివిల్స్ పై ఎక్కువగా దృష్టి సారించడం మొదలు పెట్టాను. వాస్తవానికి సివిల్స్ కోసం 2021 నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టాన.. రెండో ప్రయత్నంలో ఈ విజయం సాధించాను. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో మంచి కార్పోరేట్ ఉద్యోగాన్ని విడిచి పెట్టాను.. నాకు ఎల్లపుడు అండగా నిలుస్తూ వచ్చిన కుటుంబం, స్నేహితులు, సలహాదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు’ తెలిపింది. తాను టాప్ 20 లో ఉంటానా? అన్న అనుమానాలు ఉండేవి.. కానీ 18వ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది వార్దా ఖాన్.

ఇక వార్దా ఖాన్ విషయానికి వస్తే.. నోయిడా సెక్టార్ 82 లోని వివేక్ విహార్ లో ఉంటున్న వార్దా ఖాన్ తల్లిదండ్రులకు ఏకైక సంతానం. తొమ్మిదేళ్ల క్రితం ఆమె తండ్రి చనిపోయారు. ప్రస్తుతం తల్లితో కలిసి ఉంటుంది. చిన్నప్పటి నుంచి చదువులు ఫస్ట్ ర్యాంక్ లో ఉండే వార్దా సివిల్స్ లో ర్యాంక్ సంపాదించడానికి ఎన్నోరకాలుగా కష్టపడుతూ వచ్చింది. ఢిల్లీలోని ఖల్సా కాలేజ్ నుంచి బీకాప్ హానర్స్ పూర్తి చేసింది. తన కుటుంబం కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. మంచి కార్పోరేట్ సంస్థలో గొప్ప ఉద్యోగం సంపాదించింది. కానీ సివిల్స్ లక్ష్యంగా ఆ ఉద్యోగాన్ని వదిలివేసినట్లు చెప్పింది వార్దా. సివిల్స్ లో 18వ ర్యాంక్ రావడం చాలా సంతోషాన్ని ఇస్తుందని తెలిపింది.