nagidream
Chhatrapati Shivaji Wagh Nakh Came To India From London Victoria And Albert Museum: భారతదేశం నుంచి అనేక సంపద విదేశాలకు తరలిపోయిందని చెబుతారు. చారిత్రాత్మక వస్తువులు, కళాఖండాలు, మహారాజులు వాడిన ఆయుధాలు వంటివి లండన్ మ్యూజియంలో ఉండిపోయాయి. అలాంటి వాటిలో ఛత్రపతి శివాజీ వాడిన వాఘ్ నఖ్ ఆయుధం కూడా ఒకటి. అది ఎట్టకేలకు భారత్ కి చేరుకుంది.
Chhatrapati Shivaji Wagh Nakh Came To India From London Victoria And Albert Museum: భారతదేశం నుంచి అనేక సంపద విదేశాలకు తరలిపోయిందని చెబుతారు. చారిత్రాత్మక వస్తువులు, కళాఖండాలు, మహారాజులు వాడిన ఆయుధాలు వంటివి లండన్ మ్యూజియంలో ఉండిపోయాయి. అలాంటి వాటిలో ఛత్రపతి శివాజీ వాడిన వాఘ్ నఖ్ ఆయుధం కూడా ఒకటి. అది ఎట్టకేలకు భారత్ కి చేరుకుంది.
nagidream
ఛత్రపతి శివాజీ గురించి తెలియని వారు ఉండరు. మరాఠా సామ్రాజ్యాన్ని ఏలిన మహారాజు. ఆయన రాజుగా ఉండగా విదేశీ రక్కసి మూకలు ఎవరూ కూడా భారత్ వైపు కన్నెత్తి చూడలేదు. అంతలా తన వీరత్వంతో, శౌర్యంతో విదేశీయుల వెన్నులో వణుకు పుట్టించారు. అలాంటి వీరుడు వాడినటువంటి ఆయుధం వాఘ్ నఖ్.. లండన్ మ్యూజియం నుంచి భారత్ కు చేరుకుంది. పులి పంజాలా కనిపించే ఈ ఆయుధంతోనే ఛత్రపతి శివాజీ అఫ్జల్ ఖాన్ ని మట్టుబెట్టినట్టు చరిత్ర చెబుతుంది. ఈ చారిత్రాత్మక ఆయుధం కాలక్రమేణా బ్రిటన్ కు చేరింది. అప్పటి నుంచి అక్కడి విక్టోరియా ఆనంద్ ఆల్బర్ట్ మ్యూజియంలోనే ఉంది. అలాంటి ఆయుధం లండన్ మ్యూజియం నుంచి మహారాష్ట్రలోని సాతారా సిటీకి తీసుకొచ్చారు. అనేక ప్రయత్నాల అనంతరం శివాజీ ఆయుధం భారత్ కి వచ్చింది. బుల్లెట్ ప్రూఫ్ బ్యాగ్ లో దీన్ని తీసుకొచ్చారు. జూలై 19 నుంచి దీన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు.
ఈ ప్రదర్శనను మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ లు ప్రారంభించనున్నారు. ప్రముఖ చరిత్రకారుడు ఇంద్రజిత్ సావంత్.. తన దగ్గర విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం లెటర్ ఉందని.. అందులో వాఘ్ నఖ్ ఆయుధాన్ని అఫ్జల్ ఖాన్ ని చంపడానికి ఛత్రపతి శివాజీ వాడిన ఆయుధమా అనేది ఖచ్చితంగా తెలియదని అన్నారు. దీంతో ప్రతిపక్షాలు దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాఘ్ నఖ్ ఆయుధాన్ని గురువారం సాయంత్రం సాతారా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు. ఛత్రపతి శివాజీ కాలం నాటి కళాఖండాలు, ఆయుధాలతో పాటు వాఘ్ నఖ్ ని ప్రదర్శనలో ఉంచుతారు. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలను నియమించింది. ఒకటి ముంబై కోసం, రెండు సాతారా కోసం కమిటీలను ఏర్పాటు చేసింది.
కొల్హాపూర్, నాగ్ పూర్ జిల్లాల్లో ఎక్కడ వాఘ్ నఖ్ ఆయుధాన్ని ప్రదర్శనకు ఉంచాలన్న ప్రతిపాదనను కమిటీల ముందు ఉంచింది. వాఘ్ నఖ్ భద్రతలో భాగంగా స్థానిక జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, పీడబ్ల్యూడీ అధికారులు, మ్యూజియం అధికారులు కమిటీలో ఉన్నారు. కమిటీ ప్రదర్శన కోసం ప్రణాళికలను రూపొందించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సబ్యసాచి ముఖర్జీ ముంబై కమిటీ హెడ్ గా ఉన్నారు. ఈ వాఘ్ నఖ్ ఆయుధాన్ని సాతారాలో ఉన్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం, నాగ్ పూర్ లో సెంట్రల్ మ్యూజియం, కొల్హాపూర్ లోని లక్ష్మీ విలాస్ ప్యాలస్ లో, అలానే ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ మ్యూజియాల్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. మరి అనేక ప్రయత్నాల అనంతరం ఛత్రపతి శివాజీ వాడిన వాఘ్ నఖ్ ఆయుధం లండన్ నుంచి భారత్ కు రావడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.