Arjun Suravaram
నేటి నుంచి రష్యా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎలక్షన్లు మార్చి 17వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తమ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు రష్యన్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రష్యాలో ఎన్నికల నేపథ్యంలో కేరళలో పోలింగ్ ఏర్పాటు చేశారు.
నేటి నుంచి రష్యా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎలక్షన్లు మార్చి 17వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తమ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు రష్యన్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రష్యాలో ఎన్నికల నేపథ్యంలో కేరళలో పోలింగ్ ఏర్పాటు చేశారు.
Arjun Suravaram
ప్రతి దేశంలో ఎన్నికలు అనేవి చాలా ప్రధానమైనవి. అందుకే ఆయా దేశాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహిస్తుంటాయి. ఆయా దేశం బట్టి పోలింగ్ విధానం మారుతుంటుంది. అయితే ప్రతి ఏటా ఏదో ఒక దేశంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తూనే ఉంటుంది. అలానే ప్రస్తుతం భారత్, రష్యా వంటి దేశాల్లో ఆ వాతావరణం కనిపిస్తుంది. భారత్ లో త్వరలో ఎన్నికలు జరగనుండగా.. రష్యాల్లో అధ్యక్ష ఎన్నికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికలకు కేరళలో పోలింగ్ జరిగింది. మరి.. అక్కడి ఎన్నికలకు, కేరళలో పోలింగ్ ఏంటనే కదా మీ సందేహం.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎన్నికల వేళ దేశ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు.. ఆయా దేశాల అధికారులు. అయితే దేశం బయట ఉంటే ఆ దేశాల పౌరులకు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుంటారు. అలానే రష్యా అధ్యక్ష ఎన్నికల వేళ.. కేరళలో పోలింగ్ కేంద్రాని ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన రష్యా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మూడు రోజుల పాటు జరగనుంది. ఈ ఎన్నికల కోసం మన దేశంలోని కేరళలో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నివసించే రష్యన్ పౌరులు మన దేశం నుంచే అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటు వేసేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు.
కేరళ రాజధాని తిరువనంతపురంలో రష్యన్ హౌస్ లో పోలింగ్ కేంద్రాన్ని ఆ దేశ అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రష్యన్ పౌరులు ఈ కేంద్రం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని రష్యన్ హౌస్ డైరెక్టర్ రతీశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రష్యా అధ్యక్ష ఎన్నికలకు ఈ కాన్సులేట్ లో పోలింగ్ నిర్వహించడం ఇది మూడో సారి. ఇక్కడ స్థిరపడిన రష్యన్ పౌరులు, అలానే యాత్రిలకుల కోసం దీన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచే తమ దేశ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పౌరులు ఉత్సాహం చూపిస్తున్నారు. శుక్రవారం ప్రారంభమైన రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చి 17వ తేదీ వరకు జరగనున్నాయి. ఆ తరువాత కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇక ప్రస్తుతం రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే వారిని పరిశీలించినట్లు అయితే..ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న వాద్లిమిర్ పుతిన్ తో పాటు మరో ముగ్గురు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్లట్‌స్కీ, న్యూ పీపుల్ పార్టీ చెందిన వ్లాదిస్లవ్ డవాంకోవ్, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నికోలోయ్ ఖరితోనోవ్ పోటీలో ఉన్నారు. ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్.. తాను ఎక్కువ సార్లు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా రాజ్యంగ సవరణ చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ సవరణ చేసిన తరువాత పుతిన్ మూడోసారి పోటీ పడుతున్నారు. ఈసారీ ఆయన విజయం ఖాయంగానే కన్పిస్తోంది. దీంతో 2030 వరకు ఆయన పదవిలో ఉండనున్నారు. ఆ తర్వాత మరో ఆరేళ్ల కాలానికీ పుతిన్ పోటీ చేసే అవకాశముంది.
ఇక రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అనేది కేరళ రాష్ట్రంలోనే కాకుండా.. ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయం చెన్నై, ముంబై, కలకత్తా, గోవా, కూడంకుళం వంటి నగరాల్లోని దౌత్య కార్యకలాపాలలో పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది. తిరువనంతపురంలో జరిగిన రష్యా ఓటింగ్ ప్రక్రియ సాంప్రదాయ పేపర్ బ్యాలెట్‌లను ఉపయోగించింది. ఇక ఈ ఎన్నికల పూర్తి చేసిన తరువాత బ్యాలెట్‌లను చెన్నై నుండి దౌత్య మార్గం ద్వారా రష్యా రాజధాని మాస్కో నగరంకి తిరిగి పంపనున్నారు. ప్రస్తుతం రష్యా 18వ అధ్యక్ష ఎన్నికలు జరుతున్నాయి.