iDreamPost
android-app
ios-app

ఎన్నికలు తెచ్చిన అదృష్టం.. డైమండ్ రింగ్స్ గెలుచుకున్న ఓటర్లు

  • Published May 08, 2024 | 10:02 PM Updated Updated May 08, 2024 | 10:02 PM

లోక్ సభ ఎన్నికల పుణ్యమా అని ఓటర్ల దశ తిరిగిపోతుంది. ఎన్నికల్లో ఓటేసిన ఓటర్లను అదృష్టం వరించింది. ఓ రాష్ట్రంలో ఓటు వేసిన ఓటర్లు ఏకంగా డైమండ్ రింగ్స్ గెలుచుకున్నారు.

లోక్ సభ ఎన్నికల పుణ్యమా అని ఓటర్ల దశ తిరిగిపోతుంది. ఎన్నికల్లో ఓటేసిన ఓటర్లను అదృష్టం వరించింది. ఓ రాష్ట్రంలో ఓటు వేసిన ఓటర్లు ఏకంగా డైమండ్ రింగ్స్ గెలుచుకున్నారు.

ఎన్నికలు తెచ్చిన అదృష్టం.. డైమండ్ రింగ్స్ గెలుచుకున్న ఓటర్లు

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల్లో పోలింగ్ ముగిసింది. నాలుగో విడత పోలింగ్ మే 13న జరుగనున్నది. అయితే ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. స్వఛ్చంద సంస్థలు సైతం ఓటర్లను చైతన్య పరిచేందుకు లక్కీ డ్రాలు నిర్వహించాయి. కళ్లు చెదిరే బహుమతులతో ఓటర్లకు బంపరాఫర్లను ప్రకటించాయి. అయితే లోక్ సభ ఎన్నికల్లో ఓటేసిన ఓటర్లకు అదృష్టం తలుపుతట్టింది. నలుగురు ఓటర్లు ఏకంగా డైమండ్ రింగ్స్ గెలుచుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ లో నిన్న లోక్ సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే భోపాల్ లో ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. ఓటర్లకు బంపరాఫర్లను ప్రకటించారు. ఓటర్లకు లక్కీ డ్రా ద్వారా ఖరీదైన గిఫ్టులను అందించారు. ఈ లక్కీ డ్రాలో భాగంగా నలుగురు ఓటర్లు డైమండ్ రింగ్స్ గెలుచుకున్నారు. ఓటు తెచ్చిన అదృష్టంతో డైమండ్ రింగ్స్ గెలుచుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పలు రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన ఆఫర్లను ప్రకటించాయి పలు సంస్థలు.

బీర్లు, బిర్యానీలు, ఇంకా ఇతర గిఫ్టులను ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ మే 13న జరుగనున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో ఓటర్ల కోసం ఫ్రీ రైడ్ ను ప్రకటించింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తమవంతు బాధ్యతగా ఫ్రీ రైడ్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఆ ఒక్క రోజు బైక్, కార్, ఆటో లల్లో ఓటింగ్ లో పాల్గొనే ఓటర్లు ఉచిత రైడ్ లను పొందొచ్చు.ల