గుడ్ న్యూస్.. త్వరలో పట్టాలపైకి పరుగులు పెట్టనున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్స్

దేశంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రైల్వే వ్యవస్థ కూడా అప్ గ్రేడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో సూపర్ ఫాస్ట్ రైళ్లతో పాటు అత్యాధునికమైన సౌకర్యాలతో కూడిన వందేభారత్ వంటి రైళ్ల సదుపాయాల్ని తీసుకు వస్తుంది. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకురాబోతుంది.

దేశంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రైల్వే వ్యవస్థ కూడా అప్ గ్రేడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో సూపర్ ఫాస్ట్ రైళ్లతో పాటు అత్యాధునికమైన సౌకర్యాలతో కూడిన వందేభారత్ వంటి రైళ్ల సదుపాయాల్ని తీసుకు వస్తుంది. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకురాబోతుంది.

దేశంలో రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుంది. పెరుగుతున్న జనాభా, ప్రయాణీకుల తాకిడి, రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడే అప్ గ్రేడ్ అవుతుంది. మెరుగైన సేవలను అందిస్తుంది. అలాగే రైళ్లను కూడా ఆధునీకరిస్తుంది. తక్కువ సమయంలో సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చే బుల్లెట్ రైళ్లను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకు వస్తుంది. అలాగే ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ ట్రైన్లతో పాటు.. వందే భారత్ వంటి సెమీ హై స్పీడ్ రైళ్లను తీసుకు వచ్చింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటికి విపరీతమైన ఆదరణ దక్కింది. ఛార్జీలు ఎక్కువయ్యినప్పటికీ.. తక్కువ సమయంలో గమ్య స్థానాలకు చేర్చడంతో రోజు రోజుకూ వీటిల్లో ప్రయాణాలు సాగించే వారి సంఖ్య పెరుగుతుంది.

ఇప్పటికే దేశంలో 25కు పైగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నగరాలు కలుపుతూ పోతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలన్న యోచన చేసింది. మరో రెండు నెల్లలో వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాకాలు చేస్తుంది. ఆగస్టు 15 నాటికి వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ట్రయల్ రన్ స్వాత్రంత్య దినోత్సవం రోజున చేపట్టనున్నారు. ఆ తర్వాత నుండి పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి ఈ స్లీపర్ ట్రైన్స్. తొలి స్లీపర్ రైలు ఢిల్లీ, ముంబయి మార్గంలో నడపాలని భావిస్తున్నారు. రద్దీగా ఉండే ఈ మార్గంలో స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఈ రైలు ఢిల్లీ నుంచి భోపాల్‌, సూరత్‌ మీదుగా ముంబయికి ప్రయాణిస్తుందని తెలిపాయి. ఇక, మొత్తం 16 బోగీలుండే వందేభారత్ స్లీపర్ రైలులో థర్డ్ ఏసీ 10, సెకండ్ ఏసీ 4, ఫస్ట్ ఏసీ ఒక బోగీ ఉంటాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. సీటింగ్‌తో పాటు లగేజీ (SLR) కోసం రెండు బోగీలు అదనంగా ఉంటాయి. గంటకు 130 కి.మీ. వేగంతో నడిచే ఈ రైలు వేగాన్ని క్రమంగా 160-220 కి.మీ.లకు పెంచనున్నారు. ఇదిలా ఉంటే.. వందే భారత్ స్లీపర్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో కూడా నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు. రద్దీ ఎక్కువ గా ఉంటే కాచిగూడ-విశాఖ, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్, పూణె మార్గాల్లో నడపాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. కాగా, 2029 నాటికి 250 వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

Show comments