iDreamPost
android-app
ios-app

కుప్పకూలిన నిర్మాణం.. శిథిలాల కింద 40 మంది కూలీలు!

  • Published Nov 13, 2023 | 12:39 PM Updated Updated Nov 13, 2023 | 12:39 PM

ఇటీవల దేశంలో ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతున్నాయో తెలియని పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇటీవల దేశంలో ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతున్నాయో తెలియని పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.

  • Published Nov 13, 2023 | 12:39 PMUpdated Nov 13, 2023 | 12:39 PM
కుప్పకూలిన నిర్మాణం.. శిథిలాల కింద 40 మంది కూలీలు!

ప్రమాదాలు ఎప్పుడు ఎలా ముంచుకు వస్తాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇటీవల రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. సాధారణంగా టెన్నెల్ నిర్మాణాలు, భారీ భవంతి నిర్మాణాలు జరిగే సమయంలో అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో ఉన్న సొరంగం కంత భాగం ఆదివారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో టెన్నెల్ లో పనిచేస్తున్న 40 మంది కార్మికులు లోపల శిదిలాల కింద చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరకాశీ జిల్లా నిర్మాణ దశలో ఉన్న ఓ టన్నెల్ లో ప్రమాదం జరిగింది. సిల్క్యారా నుంచి దండల్ గావ్ వరకు ఉన్న యుమనోత్రీ జాతీయ రహదాని లో ఓ సొరంగమార్నాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద దాదాపు 40 మంది కార్మికులు చిక్కుకున్నారని అధికారులు తెలుపుతన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అధికారులు రిస్క్యూ టీమ్ అక్కడికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా ఉన్నారని.. వారితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం లోపట చిక్కుకున్న కార్మికులు అధికారులు ఆక్సీజన్ అందించే పనిలో ఉన్నామని అధికారులు తెలిపారు. అదే పైప్ ద్వారా నైట్ కంప్రెసర్ ద్వారా ఒత్తిడి తగ్గించి ఆహార పదార్థాలు కూడా సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇక చుట్టు ఉన్న చెత్త తీసేసి భారీగా ఎక్స్‌కవేటర్ యంత్రాలు రంగంలోకి దింపామని తెలిపారు. ఎట్టి పరిస్థితిలో 40 మంది కార్మికులను రక్షించి తీరుతామని అధికారులు అంటున్నారు. ఎస్ డీఆర్ఎష్, పోలీసులు, రెవెన్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఉత్తర కాశీ జిల్లా డీఎం, ఎస్పీ సహాయక చర్యలు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాణ నష్టం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఎప్పటికప్పుడు ఉత్తరకాశీ డీఎం రుహెలాతో మాట్లాడుతు అప్ డేట్స్ తెలుసుకుంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని.. లోపల చిక్కుకున్న 40 మంది కార్మికులను ప్రాణాలతో రక్షించాలని అధికారులకు తెలిపారు. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ‘టెన్నెలో లోపల చిక్కుకున్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా రక్షించబడాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని సీఎం ఫేస్ బుక్ పోస్ట్ చేశారు.