iDreamPost
android-app
ios-app

అడుగడుగునా అవాంతరాలు.. వాళ్లు క్షేమంగా బయటకు వస్తారా?

ఉత్తరాఖండ్‌ సొరంగ ప్రమాదానికి సంబంధించి రెస్య్కూ ఆపరేషన్లు సాగుతున్నాయి. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది నానా కష్టాలు పడుతున్నారు.

ఉత్తరాఖండ్‌ సొరంగ ప్రమాదానికి సంబంధించి రెస్య్కూ ఆపరేషన్లు సాగుతున్నాయి. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది నానా కష్టాలు పడుతున్నారు.

అడుగడుగునా అవాంతరాలు.. వాళ్లు క్షేమంగా బయటకు వస్తారా?

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లా పరిధిలో ఇటీవలె సొరంగం కూలీన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది కూలీలు అందులో చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది శతవిధాల  లోపల ఉన్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ‍ప్రయత్నిస్తున్నారు. కానీ, అడుగడుగునా వాళ్లకి అనుకోని అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. గత 13 రోజులుగా ఇదే పరిస్థితి. అంతా సజావుగా సాగుతోందన్న తరుణంలో ఏదో ఒక ఇబ్బందితో పనులన్నీ ఆగిపోతున్నాయి. అన్నీ అనుకున్న విధంగా జరిగి ఉంటే గురువారం రాత్రికే సొరంగం నుంచి కూలీలు బయటకు వచ్చే వారు. కానీ, ఇంతలోనే మరో ఆటంకం ఏర్పడింది.

ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. సొరంగంలోని కార్మికులను బయటకు తీసుకొచ్చే ప్రక్రియకు సంబంధించి.. ఎన్టీఆర్ఎఫ్ దళాలు ట్రయల్ రన్ నిర్వహించాయి. ఇందులో భాగంగా 800 MM పైపు గుండా చక్రాలు ఉన్న స్ట్రెచర్‌ను లోపలికి పంపి.. అవతలి వైపు ఉన్న కార్మికులు దానిపై బోర్లా పడుకున్న తర్వాత బయటకు లాగుతారు. అనంతరం బాధితులను నేరుగా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్డీఆర్ఎఫ్ విడుదల చేసింది. ఆ వీడియోలో ఎన్డీఆర్ఎఫ్ అధికారిని తాడుతో కట్టిన చక్రాల స్ట్రెచర్‌ ద్వారా సొరంగంలోకి పైపులో గుండా పంపడం.. అనంతరం స్ట్రెచ్ పూర్తి చేసిన తర్వాత వెనక్కి లాగడం కనిపిస్తోంది.

ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది స్ట్రెచర్‌ను తాడుతో లాగుతుండగా.. వెల్డింగ్ లోహం వల్ల కార్మికుల శరీరాలకు ఎటువంటి గాయాలు కాకుండా నిరోధించడానికి ప్రతీ కార్మికుడు స్ట్రెచర్‌పై పడుకునేలా చేస్తామని అధికారులు తెలిపారు. ముందుగా అనుకున్న ప్రకారం.. గురువారం రాత్రే ఆపరేషన్ పూర్తి కావాల్సింది. కానీ, ఊహించని విధాంగా ఆటంకం ఏర్పడటంతో జాప్యం జరిగింది. అయితే.. ‘సొరంగంలో చిక్కుకున్న కార్మికులు శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి’. వాళ్ల ఒత్తిడిని అధిగమించేందుకు లూడో, చెస్‌ వంటి బోర్డ్ గేమ్స్‌ అందివ్వనున్నట్లు రెస్క్యూ బృందంలోని మానసిక వైద్యుడు డాక్టర్‌ రోహిత్‌ గోండ్వాల్ తెలిపారు. ప్రస్తుతం వారంతా బాగానే ఉన్నారని, ఒత్తిడిని అధిగమించేందుకు యోగా చేస్తున్నట్లు మాతో చెప్పారు.

ఇదివరకు కార్మికులను ఒక్కొక్కరుగా బయటకు వచ్చేలా ప్రణాళికను ఎంపిక చేసుకున్నాము. అయితే లోపల చిక్కుకున్న వారి ఆరోగ్య పరిస్థితి, సొరంగం శిధిలాల కింద చీకట్లో ఆహారం లేకుండా 13 రోజులు ఉండటం వంటివి పరిగణిలోకి తీసుకొని ఆ ప్రయత్నాన్ని పక్కనబెట్టారు. కాగా, సొరంగంలో చిక్కుకున్న కార్మికులు మంగళవారం మొదటిసారిగా బయటకు ప్రపంచానికి కనిపించారు. పైపు ద్వారా చొప్పించిన కెమెరా వారి దృశ్యాలను బంధించింది. మరి, 13 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న వారి పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.