Dharani
Haridwar-7 Days Holidays To Schools: ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు ఏడు రోజుల పాటు సెలవులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..
Haridwar-7 Days Holidays To Schools: ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు ఏడు రోజుల పాటు సెలవులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..
Dharani
దేశవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం అయ్యి సరిగా నెల రోజులు కూడా కావడం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో జూన్ నెల మధ్య నుంచే స్కూల్స్ మొదలు కాగా.. ఉత్తర భారతదేశంలో మాత్రం చాలా చోట్ల జూలై 1 నుంచి పాఠశాలలు మొదలయ్యాయి. హీట్ వేవ్ కారణంగా చాలా ఉత్తరాది రాష్ట్రాల్లో వేసవి సెలవులు పొడగించారు. ఇక జూలై 1 నుంచి స్కూల్స్ మొదలయ్యాయో లేదో.. భారీ వర్షాల కారణంగా వరుసగా సెలవులు వస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తుపాను కారణంగా నాలుగైదు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా రోడ్లన్ని జలమయం అయ్యి.. రవాణా కష్టం అవుతోంది. దాంతో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా వారం రోజులు విద్యాసంస్థలకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు..
ఈ నిర్ణయం తీసుకుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. అయితే సెలవులు కూడా అందరికి వర్తించవు. కేవలం హరిద్వార్ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు మాత్రమే ఈ హాలీడేస్. అక్కడ మాత్రం వారం రోజుల పాటు విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ ధీరజ్ సింగ్ మంగళవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సెలవుల ప్రకటనకు కారణం.. కన్వర్ యాత్ర. ఆ మార్గంలో వచ్చే అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కాలేజీలకు వారం రోజులు సెలవులు ప్రకటించారు. అనగా.. జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది కన్వర్ యాత్రకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని డీఎం తెలిపారు. హరిద్వార్‌లోని వివిధ వాహనాల్లో ప్రధాన రహదారుల గుండా గంగాజలాన్ని సేకరించడానికి పెద్ద సంఖ్యలో శివ భక్తులు ఇక్కడికి వస్తారు. అన్ని కన్వర్ మార్గాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పశ్చిమ ఉత్తరప్రదేశ్ నలుమూలల నుండి లక్షలాది మంది కన్వర్ యాత్రికులు గంగాజల్‌ను సేకరించడానికి హరిద్వార్‌కు వస్తారు. సహారన్‌పూర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బాగ్‌పట్, ముజఫర్‌నగర్‌తో సహా అన్ని జిల్లాల రోడ్లపై కన్వర్ యాత్రికుల జాతర ఉంటుంది. కన్వర్ యాత్ర దృష్టిలో పెట్టుకుని.. ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, మీరట్ హైవేతో సహా అన్ని రోడ్లపై ఇప్పటికే రూట్ డైవర్షన్ కూడా చేశారు. ఇక తాజాగా ఆ మార్గంలో వచ్చే విద్యాసంస్థలకు సెలవు కూడా ప్రకటించారు.