పతాంజలికి బిగ్ షాక్.. ఆ ప్రోడక్ట్స్ లైసెన్సులు రద్దుచేసిన ప్రభుత్వం!

Big shock for Patanjali: పతంజలికి సంబంచింన ప్రకటనలపై ఇటీవల పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. ఈ క్రమంలోనే కోర్టు దిక్కరణ, తప్పుడు ప్రకటనలు ఇచ్చారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా, ఎండీ బాలకృష్ణల పై సర్వోన్నత న్యాయస్థానం సిరియస్ అవువతూ వస్తుంది.

Big shock for Patanjali: పతంజలికి సంబంచింన ప్రకటనలపై ఇటీవల పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. ఈ క్రమంలోనే కోర్టు దిక్కరణ, తప్పుడు ప్రకటనలు ఇచ్చారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా, ఎండీ బాలకృష్ణల పై సర్వోన్నత న్యాయస్థానం సిరియస్ అవువతూ వస్తుంది.

గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా పంతాంజలి ప్రకటనల వ్యవహారం సంచలనంగా మారింది. పతంజలి యాడ్స్ పై ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా, ఎండీ బాలకృష్ణల పై సుప్రీం కోర్టు ఇప్పటికే చివాట్లు పెట్టింది. కోర్టు దిక్కరానికి పాల్పపడిన ఇద్దరిపై న్యాయస్థానం సీరియస్ కావడంతో ఇటీవల విచారణకు హాజరై క్షమాపణలు కోరారు. కానీ.. సర్వోన్నత న్యాయస్థానం శాంతించలేదు.. ఈ విషయంలో మేం ఏ నిర్ణయం తీసుకోలేదని గత వారం విచారణలో హెచ్చరించింది. ఈ క్రమంలో పతంజలికి మరో భారీ షాక్ తగిలింది. పతంజలికి చెందిన 14 ఉత్పత్తులకు సంబంధించిన లైసెన్సులు ప్రభుత్వం రద్దు చేసింంది. ఇంతకీ ఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో వివరాలు తెలుసుకుందాం.

పతంజలికి మరో భారీ షాక్ తగిలింది.. ఈ సంస్థకు సంబంధించిన 14 ప్రొడెక్ట్స్ పై ఉత్తరాఖండ్ ప్రభుత్వం లైసెన్సులు రద్దు చేసింది. ఇటీవల పతంజలి ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని యాడ్స్ తప్పదారి పట్టించే విధంగా ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలియజేసింది. ఈ క్రమంలనే పతంజలికి సంబంధించిన దివ్య ఫార్మసీ రూపొందించిన స్వసరి గోల్డ్, స్వసరి వాటి, దృష్టి ఐ డ్రాప్, బ్రోన్ కమ్, స్వసరి ప్రవాహి, స్వసరి అవాలే్, ముక్తా వాటి ఎక్స్ ట్రా పవర్, బీపీ గ్రిట్, మధు గ్రిట్, లిపిడామ్, మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్, లివమ్రిత్ , లివో గ్రిట్, ఐగ్రిట్ గోల్డ్ లాంటి ఉత్పత్తులపై ఉత్తరాఖాండ్ లైసెస్స్ విభాగం రద్దు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.

గతంలో పతంజలి ఉత్పత్తులపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఆధునిక వైద్య విధానాన్ని పంతజలి ఉత్పత్తుల వ్యవస్థాపకులు రాందేవ్ బాబు తప్పుదోవ పట్టిస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. పలు రకాల వ్యాధులకు పతంజలి ఉత్పత్తులు పనిచేస్తతాయని తప్పుడు ప్రచారాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఆయుర్వేద, యునానీ నుంచి అనుమతి తీసుకోకుండా ప్రచారం చేయడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ధర్మాసనానికి ఉత్తరాఖండా ప్రభుత్వం లైసెన్సింగ్ అథారిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మిథలేష్ కుమార్ అఫిడవిట్ సమర్పించారు.

Show comments