iDreamPost
android-app
ios-app

ఆవు పేడతో రాఖీలు.. రూ.25 లక్షలు సంపాదిస్తున్న మహిళలు.. ఎక్కడంటే

  • Published Aug 17, 2024 | 8:50 PM Updated Updated Aug 17, 2024 | 8:50 PM

ఇప్పటి వరకు మనం మార్కెట్ లో ఎన్నో రకాల రాఖీలను చూసి ఉంటాం. కానీ, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ గోమయం(ఆవు పేడ)తో తయారు చేసిన రాఖలను ఎక్కడ చూసివుండం. అయితే తాజాగా ఓ రాష్ట్రంలోని మహిళలు మాత్రం ఏకంగా ఆవు పేడతో రాఖీలను తయారు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇంతకీ ఎక్కడంటే..

ఇప్పటి వరకు మనం మార్కెట్ లో ఎన్నో రకాల రాఖీలను చూసి ఉంటాం. కానీ, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ గోమయం(ఆవు పేడ)తో తయారు చేసిన రాఖలను ఎక్కడ చూసివుండం. అయితే తాజాగా ఓ రాష్ట్రంలోని మహిళలు మాత్రం ఏకంగా ఆవు పేడతో రాఖీలను తయారు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇంతకీ ఎక్కడంటే..

  • Published Aug 17, 2024 | 8:50 PMUpdated Aug 17, 2024 | 8:50 PM
ఆవు పేడతో రాఖీలు.. రూ.25 లక్షలు సంపాదిస్తున్న మహిళలు.. ఎక్కడంటే

దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకున్న పండుగలో రాఖీ పూర్ణిమ కూడా ఒకటి. ముఖ్యంగా ఈ పండుగకు వయసు సంబంధం లేకుండా.. అక్కా చెల్లెళ్లు, తమ అన్నదమ్ములకు రాఖీ కడుతుంటారు. అయితే ఈ వేడుక కోసం నెల రోజుల ముందు నుంచే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో, మార్కెట్ లో వివిధ రకాల రాఖీలు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కో మోడల్ తో, వివిధమైన ధరల్లో వస్తుంటాయి. కాగా,ఇప్పటి వరకు మనం మార్కెట్ లో ఎన్నో రకాల రాఖీలను చూసి ఉంటాం. కానీ, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ గోమయం(ఆవు పేడ)తో తయారు చేసిన రాఖలను ఎక్కడ చూసివుండం. అయితే తాజాగా ఓ రాష్ట్రంలోని మహిళలు మాత్రం ఏకంగా ఆవు పేడతో రాఖీలను తయారు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇంతకీ ఎక్కడంటే..

ఇప్పటి వరకు మార్కెట్ లో మనం ఎన్నో రకాల రాఖీలను చూసి ఉంటాం. కానీ, ఆవు పేడతో రాఖీలను తయారు చేసి విక్రయించడం అనేది వినడం, చూడటం ఇదే మొదటిసారి కావొచ్చు. అయితే ఈ ఆవు పేడ రాఖీలను ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ జిల్లా మహిళాలు తయారు చేస్తున్నారు. పైగా ఇక్కడ మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఇలా రాఖీలను తయారు చేసి ఏడాదికి రూ.20 నుంచి రూ.25 లక్షల వరకు సంపాదిస్తున్నారు. పైగా ఆవు పేడతో చేసిన ఈ రాఖీలను ఎంతో అందంగా తయారు చేస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది వీరు తయారు చేసిన అయోధ్య రామ మందిర నమూనాగల రాఖీలకు అత్యంత గిరాకీ ఉందని అక్కడ సంస్థ నిర్వాహకురాలు వినీత తెలిపారు.

ఇక ఈ ఆవు పేడలో వివిధ రకాల పప్పుదినుసులు కలిపి అందమైన రాఖీలను తయారు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కాగా,ఈ రాఖీలు పర్యావరణానికి అనుకూలమైనవని, ఇలానే ఎవరైనా రాఖీలను తయారు చేసి ఉపాధి పొందవచ్చని నిర్వాహక సంస్థ అధ్యక్షరాలు వినీతా పాండే చెబుతున్నారు. అలాగే తమ సంస్థ రూపొందిస్తున్న ఈ రాఖీలను అందరికీ ఆకట్టుకుంటాయని వినీత తెలిపారు. అంతేాకాకుండా.. ఈ రాఖీలు దేశంలోని ప్రతి ప్రాంతానికిి ఎక్స్ పోర్ట్ అవుతున్నాయిని అన్నారు. ముఖ్యంగా వాటిలో ఢిల్లీ, గుజరాత్, ముంబైల నుంచి తనకు చాలా ఆర్డర్లు వస్తున్నాయని వినిత పేర్కొన్నారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఇలా పేడతో తయారు చేసిన రాఖీలను రూ.40కు విక్రయిస్తున్నానని తెలిపారు. అయితే ఈ ప్రత్యేకమైన రాఖీలను రూపొందించేందుకు ఆవు పేడ, ఎర్రమట్టి, బంక, పప్పుదినులు ఉపయోగిస్తామని తెలిపారు. దీంతో పాటు ఆవాలు, నువ్వులు, బంతిపూలు మొదలైనవాటిని కూడా వినియోగిస్తానని ఆమె తెలిపారు. అయితే ఇలా ఇంటి వద్ద ఉంటూ స్వయంగా ఉపాధి కల్పించుకోని లక్షలు సంపాదించడం నిజంగా అందరికీ ఆదర్శమనే చెప్పవచ్చు. మరీ, ఉత్తర ప్రదేశ్ లోని మహిళలు ఆవు పేడతో రాఖీలు తయారు చేసి లక్షలు సంపాదిస్తుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.