iDreamPost
android-app
ios-app

ఇది కదా సక్సెస్‌ అంటే.. అన్నా చెల్లెళ్లందరూ IAS, IPSలే!

  • Published Jul 02, 2024 | 5:21 PM Updated Updated Jul 02, 2024 | 5:21 PM

కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే ఎంతో గొప్పగా చూస్తారు. అలాంటిది తోబుట్టువలందరికి గవర్నమెంట్‌ జాబు.. అది కూడా ఐఏఎస్‌, ఐపీఎస్‌ వస్తే.. అదిగో అలాంటి ఓ కుటుంబం గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం.

కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే ఎంతో గొప్పగా చూస్తారు. అలాంటిది తోబుట్టువలందరికి గవర్నమెంట్‌ జాబు.. అది కూడా ఐఏఎస్‌, ఐపీఎస్‌ వస్తే.. అదిగో అలాంటి ఓ కుటుంబం గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం.

  • Published Jul 02, 2024 | 5:21 PMUpdated Jul 02, 2024 | 5:21 PM
ఇది కదా సక్సెస్‌ అంటే.. అన్నా చెల్లెళ్లందరూ IAS, IPSలే!

నేటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే ఎంత కష్టంతో కూడుకున్న ప్రక్రియో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గవర్నెంట్‌ జాబ్‌ రావాలంటే.. అకుంఠితమైన దీక్ష, పట్టుదల, కసి ఉండాలి. ఓటమికి కుంగిపోయే మనస్తత్వం అసలే ఉండకూడదు. అపజయం ఎదురైన ప్రతి సారి.. మరింత కసిగా ముందుకు సాగాలి. అప్పుడే విజయం మీకు దాసోహం అవుతుంది. ఇక కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే ఎంతో గొప్పగా చూస్తారు. అలాంటిది.. తోబుట్టువులందరికి ప్రభుత్వ ఉద్యోగం అది కూడా ఐఏఎస్‌, ఐపీఎస్‌ కొలువులు వస్తే.. ఇక వారికి సమాజంలో దక్కే గౌరవ మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి కుటుంబం ఎన్నో వేల మందికి ఆదర్శంగా నిలుస్తుంది.

ఇప్పుడు మీకు అలాంటి ఓ కుటుంబం గురించే పరిచయం చేయబోతున్నాం. ఈ ఇంట్లో నలుగురు తోబుట్టువులు ఉన్నారు. వీరింతా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ పరీక్ష క్లియర్‌ చేశారు. నలుగురిలో ముగ్గురు ఐఏఎస్‌లు కాగా.. ఒకరు ఐపీఎస్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాంతో స్థానికంగా ఈ కుటుంబాన్ని ఐఏఎస్‌ ఫ్యామిలీ అంటారు. మరి ఇంతకు వీరు ఎక్కడ ఉంటారు.. వీరి విజయ ప్రస్థానం ఎలా మొదలైంది అనే వివరాలు మీ కోసం..

యోగేష్‌ మిశ్రాతో ప్రారంభం..

ఈ కలెక్టర్ల కుటుంబం ఉత్తరప్రదేశ్‌లో నివాసం ఉంటున్నారు. ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఈ నలుగురు తోబుట్టువులు.. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ పరీక్షలో విజేతలుగా నిలిచి.. ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా మొత్తానికి ఈ కుటుంబం ఆదర్శంగా నిలుస్తోంది. వీరి ఐఏఎస్‌ ప్రయాణం.. ఈ కుటుంబానికి చెందిన యోగేష్‌ మిశ్రాతో ప్రారంభం అయ్యింది. 2013లో యోగేష్‌ మిశ్రా.. యూపీఎస్సీ పరీక్ష పాస్‌ అయ్యి ఐఏఎస్‌గా సెలక్ట్‌ కావడంతో.. ఈ ప్రయాణానికి పునాది పడింది. ఆతర్వాత ఆయనను ఆదర్శంగా తీసుకుని.. యోగేష్‌ సోదరి.. మాధవి మిశ్రా 2015 యూపీఎస్సీ పరీక్ష పాస్‌ అయ్యి కలెక్టర్‌గా జాయిన్‌ అయ్యింది. వీరిద్దరి విజయ ప్రస్థానం మిగతా ఇద్దరు తోబుట్టువులకు ఆదర్శంగా నిలిచింది. వారు కూడా యోగేష్‌, మాధవి బాటలోనే అడుగులు వేశారు.

క్షమా మిశ్రా కసికి ఐపీఎస్‌ దాసోహం..

ఈ నలుగురిలో పెద్దదైన క్షమ మిశ్రా పట్టుదల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె మూడు సార్లు ఫెయిల్‌ అయి.. చివరకు నాలుగో ప్రయత్నంలో 2016లో యూపీఎస్‌సీ పరీక్ష క్లియర్‌ చేసింది. మూడు సార్లు ఫెయిలైనా కుంగిపోలేదు. తనకంటే చిన్నవారు పాస్‌ అయ్యారని ఆత్మనూన్యతకు గురి కాలేదు. యూపీఎస్‌సీ పాస్‌ కావడమే తన లక్ష్యంగా పెట్టుకుని.. నాలుగో సారి మరింత కసిగా చదివింది. దాంతో ఐపీఎస్‌ ఆమెకు దాసోహం అన్నది. ప్రస్తుతం క్షమా మిశ్రా.. బెంగుళూరు స్టేట్‌ పోలీస్‌ లైన్‌లో కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక క్షమ స్కూల్లో టాప్‌ స్టూడెంట్‌ కావడం విశేషం. ఇంటర్లో అయితే ఏకంగా రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంక్‌ తెచ్చుకుంది.

వీరి నలుగురిలో చిన్నవాడైన లోకేష్‌.. అక్క, అన్నలు నడిచిన దారినే ఎంచుకున్నాడు. అతడు కూడా ఐఏఎస్‌ కావాలని కలలు కన్నాడు. కష్టపడి దాన్ని సాకారం చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు జార్ఖండ్‌ కోడర్మా జిల్లా కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

తండ్రి ప్రోత్సాహంతోనే..

తమంతా లోకల్‌ కాలేజీల్లోనే చదివామని.. ఇక తాము సాధించిన విజయాలకు మూల కారణం తమ తండ్రి అందించిన ప్రోత్సాహం అని చెబుతున్నారు. కుటుంబంలోని నలుగురు తోబుట్టువులు.. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కావడంతో.. స్థానికంగా ఈ కుటుంబం అందరూ ఎంతో గౌరవంగా చూస్తారు. వీరిని ఆదర్శంగా తీసుకోవాలని తమ పిల్లలకు చెబుతుంటారు. మరి ఈ తోబుట్టువులు సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలపండి.