iDreamPost
android-app
ios-app

చెప్పుల వ్యాపారుల ఇళ్లలో IT సోదాలు.. ఆ గది చూసి షాక్‌

  • Published May 19, 2024 | 3:35 PM Updated Updated May 19, 2024 | 3:35 PM

దేశవ్యాప్తంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ చోట దాడి చేయడానికి వెళ్లిన ఐటీ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. దాంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ వివరాలు..

దేశవ్యాప్తంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ చోట దాడి చేయడానికి వెళ్లిన ఐటీ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. దాంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ వివరాలు..

  • Published May 19, 2024 | 3:35 PMUpdated May 19, 2024 | 3:35 PM
చెప్పుల వ్యాపారుల ఇళ్లలో IT సోదాలు.. ఆ గది చూసి షాక్‌

ఈమధ్య కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత.. ఈ దాడులు మరింత పెరిగాయి. ఇక ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ చోట ఐటీ అధికారులు కొందరు చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఇళ్లంతా వెతికినా వారికి ఉపయోగపడేవి ఏం దొరకలేదు. ఇక చివరగా మిగిలిన ఓ గది తలుపులు తెరిచారు. అంతే ఒక్కసారిగా షాక్‌ అయ్యి.. అలా నిల్చుండిపోయారు. మరి ఐటీ అధికారులకు ఆ గదిలో ఎలాంటి దృశ్యం కనిపించింది.. వారిని అంతలా షాక్‌కు గురి చేసింది ఏంటి అంటే..

తాజాగా ఐటీ అధికారులు ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు. ఇక వారి నివాసాల్లో ఓ గదిలో భారీ మొత్తం నగదు కనిపించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగు చూసింది. ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అంతా నార్మల్‌గానే ఉంది. ఎక్కడా ఏం అనుమానం రాలేదు. ఇక సోదాల్లో భాగంగా ఓ గది తలుపులు తెరిచిన ఐటీ అధికారులు షాక్‌ తిన్నారు. ఆ గది నిండా డబ్బుల కట్టలు వెలుగు చూశాయి. ఇక ముగ్గురు చెప్పుల వ్యాపారుల వద్ద ఇప్పటివరకు రూ.40 కోట్ల వరకు నగదు దొరికినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన నగదు లెక్కింపు జరుగుతోంది. గుట్టలు గుట్టలుగా పేర్చి ఉన్న రూ.500 నోట్ల కట్టలను లెక్కించే బాధ్యతను బ్యాంకు ఉద్యోగులకు అప్పగించారు ఐటీ అధికారులు.

ఓ గది మొత్తం 500 రూపాయల నోట్ల కట్టలతో నిండిపోయింది. ఇప్పటి వరకు రూ.40 కోట్ల వరకు లెక్కతేల్చగా.. మిగిలిన నగదును లెక్కించే పనిలో ఉన్నారు సిబ్బంది. ఇక పక్కా సమాచారంతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. సదరు చెప్పుల వ్యాపారులు.. ఆదాయపన్ను ఎగవేస్తున్నారనే ఫిర్యాదు అందడంతో ఐటీ అధికారులు శనివారం మధ్యాహ్నం ముగ్గురి వ్యాపారుల రహస్య స్థావరానికి చేరుకుని దాడులు చేశారు. ఇక ఈ సోదాల్లో ఐటీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో ఐటీ శాఖ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఐటీ అధికారులు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఈ మొత్తం చూసి ప్రతి ఒక్కరు షాక్‌ అవుతున్నారు.