సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని సోదరుడి ప్రయాణం!

ఈ మద్య ప్రభుత్వ ఆస్పత్రిలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అంబులెన్స్ లేని కారణంగా మృతదేహాలను కుటుంబ సభ్యులు ఇతర వాహనాల్లో తరలించే ఘటనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. వీటిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. ఎలాంటి మార్పు రావడం లేదు.

ఈ మద్య ప్రభుత్వ ఆస్పత్రిలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అంబులెన్స్ లేని కారణంగా మృతదేహాలను కుటుంబ సభ్యులు ఇతర వాహనాల్లో తరలించే ఘటనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. వీటిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. ఎలాంటి మార్పు రావడం లేదు.

దేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ.. కొన్నిచోట్ల దారుణ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. సరైన సమయానికి అంబులెన్స్ ఉండవు.. ఒకవేళ ఉన్నా సిబ్బంది డబ్బు డిమాండ్ చేయడంతో నిరుపేదలు ఎన్నో ఇబ్బంది పడుతుంటారు. ఇక ఆసుపత్రిలో రోగిని తీసుకు వెళ్లేందుకు స్ట్రెచర్స్, వీల్ చైర్స్, సరైన బెడ్ సౌకర్యం ఉండవు, కొన్నిసార్లు డాక్టర్లు కూడా అందుబాటులో ఉండరంటూ ఎంతోమంది బాధితులు ఫిర్యాదులు చేస్తుంటారు. ముఖ్యంగా అంబులెన్స్ లేకపోవడం వల్ల రోగిని సరైన సమయానికి ఆస్పత్రికి తరలించలేక చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మృతదేహాన్ని తరలించడానికి కూడా అంబులెన్స్ సిబ్బంది డబ్బులు వసూళ్లు చేయడంతో గత్యంతరం లేక బైకులు, సైకిల్, తోపుడు బండ్ల పైనే కాదు.. భుజాలపై వేసుకొని వెళ్లి సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా అంబులెన్స్ లేక సోదరి మృతదేహాన్ని బైక్ పై ఇంటికి తీసుకువెళ్లాడు.. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్​ప్రదేశ్​లోని ఔరైయా జిల్లాలో నవీనన్ బస్తీలో నివాసం ఉంటున్న ప్రతాప్ సింగ్ కుమార్తె అంజలి.. వయసు 20 ఏళ్లు. రన్నింగ్ లో ఉన్న వాటర్ హీటర్ ని తాకడంతో షాక్ కి గురైంది. దీంతో అంజలి ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు కుటుంబ సభ్యులు. అప్పటికే అంజలి మరణించినట్లు సీహెచ్‌సీ వైద్యులు వెల్లడించారు. అప్పటి వరకు అందరితో సంతోషంగా కలిసి మెలిసి ఉన్న అంజలి ఒక్కసారిగా విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే అంజలి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని సీహెచ్‌సీ ని ఆమె సోదరుడు కోరాడు. కానీ ఆ సమయానికి ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో సోతరి మృత దేహాన్ని తన నడుముకు కట్టుకొని బైక్ పై బయలు దేరాడు. కన్నీళ్లు తెప్పిస్తున్న హృదయవిదారకమైన దృశ్యాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది.

ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆస్పత్రి వర్గాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం లేదని.. ఆసుపత్రుల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని చెబుతున్నా.. అంబులెన్స్ అందుబాటులో ఉండవని విమర్శిస్తున్నారు. అంజలి మృతదేహాన్ని తరలించే విషయంలో ఆస్పత్రి వర్గాలు నిర్లక్ష్యం వహించారని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై సీహెచ్‌సీ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. బాధితుల ఇళ్లు దగ్గరలోనే ఉండటం వల్ల తమను అంబులెన్స్ అడగలేదని, ఒకవేళ అడిగి ఉంటే తప్పకుండా ఏర్పాటు చేసి ఉండేవాళ్లమని అన్నారు. జిల్లాలో రెండు అంబులెన్స్ మాత్రమే ఉన్నాయని అన్నారు. గతంలో ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని.. ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

Show comments