iDreamPost
android-app
ios-app

ఓవరాక్షన్ ట్రైనీ IAS తగిన శాస్త్రి చెప్పిన UPSC.. ఇక జీవితంలో కలెక్టర్ కాలేదు

ఓవరాక్షన్ ట్రైనీ IAS తగిన శాస్త్రి చెప్పింది UPSC. ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడింది. దీంతో ఆమె ట్రైనింగ్ పీరియడ్ నిలిపి వేసింది. అలాగే కేంద్రం కూడా విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇలా ఉంటే..

ఓవరాక్షన్ ట్రైనీ IAS తగిన శాస్త్రి చెప్పింది UPSC. ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడింది. దీంతో ఆమె ట్రైనింగ్ పీరియడ్ నిలిపి వేసింది. అలాగే కేంద్రం కూడా విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇలా ఉంటే..

ఓవరాక్షన్ ట్రైనీ IAS తగిన శాస్త్రి చెప్పిన UPSC.. ఇక జీవితంలో కలెక్టర్ కాలేదు

‘తన గొయ్యి తాను తవ్వుకోవడం’ ఈ సామెతను చాలా సందర్భాల్లో విని ఉంటారు. ఇప్పుడు ఈ జాతీయం ఓవరాక్షన్ ట్రైనీ ఐఎఎస్‌ పూజా ఖేడ్కర్‌కు సరిగ్గా సరిపోతుంది. సివిల్ సర్వీస్ పరీక్షలు క్లియర్ చేయడానికి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి జాబ్ కొట్టింది. అక్కడితో గమ్మున ఉండకుండా.. ఈ అధికారాలు ఇవ్వండి, ఈ సదుపాయలు కల్పించండి అంటూ లేని అధికారాల కోసం ఏకంగా ఓ కలెక్టర్‌కే లేఖ రాసింది. ప్రొబేషన్ పీరియడ్‌లో అధికార దుర్వినియోగానికి పాల్పడింది. దీంతో ఈమె ఆగడాలను తట్టుకోలేక పోయిన కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాడు. చివరకు ఆమెను మరో చోటికి బదిలీ చేసింది. అంతలోనే ఆమె వార్తల్లో నిలవడం.. ఆమె ఎంపికపై అనుమానాలు రావడంతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం.. దర్యాప్తునకు ఆదేశించింది.

కాగా, ఆమె సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడానికి మోసపూరిత కార్యాకలాపాలకు పాల్పడింది. దీంతో ట్రైనీ ఎఎఎస్ పూజా ఖేడ్కర్ సెలక్షన్ రద్దు చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటీసులు జారీ చేసింది. పరిమితికి మించి తప్పులు చేసినందుకు ఈ చర్యలు తీసుకుంది. అలాగే ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా పంపింది. భవిష్యత్తులో యుపీఎస్పీ రాయకుండా కూడా ఆమెపై నిసేధం విధించింది. ఆమోదించదగని మోసాలకు పాల్పడినందుకు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వికలాంగుల హక్కులు, ఐటీ చట్టంలోని పోర్జరీతో సహా పలు సెక్షన్ల కింద కేసు దాఖలైంది. 2023 యుపీఎస్పీ ఫలితాల్లో 841వ ర్యాంకు కొల్లగొట్టిన పూజా ఖేడ్కర్… పూణే కలెక్టరేట్‌లో ప్రొబేషనరీ ఐఏఎస్‌గా వర్క్ చేస్తోంది.

అయితే యుపీఎస్పీ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత అయ్యయేందుకు నాన్ క్రిమిలేయర్ అని, ఓబీబీ, వికలాంగుల కోటాను దుర్వినియోగపర్చింది. అంతేనా తన తల్లి, తండ్రి, ఫోటో, సంతకం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్.. చివరకు చిరునామా కూడా అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించినట్లు తెలుస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ప్రొబేషనరీ పీరియడ్ సమయంలో తనకు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని, కారు, వసతి, ఛాంబర్, కానిస్టేబుల్ ఇవ్వాలంటూ గొంత్తెమ్మ కోరికలు కోరింది. ప్రైవేట్ ఆడి కారు వినియోగించడం, మహారాష్ట్ర ప్రభుత్వం బోర్డును ఏర్పాటు చేసుకోవడంతో పాటు.. అదనపు కలెక్టర్ లేని సమయంలో ఆయన కార్యాలయాన్ని పర్మిషన్ లేకుండా వినియోగించి రచ్చ చేసింది.

దీంతో విసుగుపోయిన పూణె కలెక్టర్ సుహాస్ దివాస్.. సీఎస్‌కు లేఖ రాయడం..ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ చేతికి వచ్చాయి. ఇక అప్పటి నుండి వార్తల్లో నిలుస్తుంది. అప్పుడే ఆమె బ్యాగ్రౌండ్ బయటకు వచ్చింది. అంతేనా 2023లో జరిగిన ఓ ఘటన తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదయ్యేలా చేసింది.  రైతులను ఫిస్టల్ తో  తల్లి మనోరమ బెదిరించగా.. ఈ వీడియో వైరల్ కావడం, ఆమెపై కేసు నమోదు కావడం చకచకా జరిగిపోయాయి. ఈ కేసులో పూజా తల్లి అరెస్టు అయ్యింది. ఈ వారం ప్రారంభంలో, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA) ఆమె శిక్షణ పీరియడ్ నిలిపివేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి