UPI కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు!

UPI Payments: మనదేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. యూపీఐ యాప్స్ ను వినియోగించి.. ఎక్కువ లావాదేవీలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూపీఐ చెల్లింపులను మరింత మెరుగ్గా చేయడానికి కేంద్ర మార్పులు చేస్తుంది.

UPI Payments: మనదేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. యూపీఐ యాప్స్ ను వినియోగించి.. ఎక్కువ లావాదేవీలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూపీఐ చెల్లింపులను మరింత మెరుగ్గా చేయడానికి కేంద్ర మార్పులు చేస్తుంది.

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. రోజూ వారిగా జరగుతున్న నగదు లావాదేవీల్లో ఎక్కువగా ఆన్ లైన్ ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా  పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ మన నిత్య జీవితంలో భాగంగా మారింది. అగ్గిపెట్టె, సబ్బుబిళ్ల.. ఇలా దేనికైనా యూపీఐ యాప్స్​ ద్వారానే​ డబ్బులు కడుతున్నారు. దీని ద్వారా కోట్లలో ఆన్ లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త ఏడాదికి కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులను మరింత మెరుగ్గా చేసేందుకు మార్పులు చేసింది. ఆ మారన రూల్స్ నేటి నుంచే అమలు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మనదేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. యూపీఐ యాప్స్ ను వినియోగించి.. ఎక్కువ లావాదేవీలు జరుపుతున్నారు. ఇంట్లో వస్తువుల నుంచి ఇతర వస్తువుల  వరకు అన్నిటికి ఆన్ లైన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. యూపీఐ ద్వారా జరుగుతున్న లావాదేవీలు కోట్లలో ఉంది. ఈ నేపథ్యంలోనే యూపీఐ చెల్లింపులను మరింత మెరుగ్గా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులూ చేర్పూలు చేసింది.

ఇటీవలే ఏడాది కాలంగా వినియోగంలో లేని గూగుల్​ పే, పేటీఎం, ఫోన్​ పే వంటి యూపీఐ ఐడీలను తొలగిస్తామని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాంటి అకౌంట్స్ కారణంగా జరిగే మోసాలు ఆపడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సదరు సంస్థ తెలిపింది. అంతేకాక కావాలనుకుంటే వీటిని తిరిగి వినియోగంలోకి వచ్చేలా యాక్టీవ్​ చేసుకోవచ్చు.

ఇక యూపీఐ విషయంలో కేంద్ర తీసుకొచ్చిన మరో మార్పు.. గరిష్ట రోజువారీ చెల్లింపును పెంచింది. యూపీఐ లావాదేవీల కోసం చేసే రోజువారీ గరిష్ట చెల్లింపు పరిమితిని రూ.లక్షకు ఎన్​పీసీఐ పెంచింది. అయితే విద్య, ఆరోగ్యం విషయంలో యూపీఐ లావాదేవీల పరిమితిని డిసెంబర్ 8న ఆర్బీఐ రూ.5 లక్షలకు పెంచింది. ఇంతకు ముందు ఈ లావాదేవీ పరిమితి రూ.లక్షగా ఉండేది.

ఇక మూడు మార్పు ఏంటంటే.. ఇది ఇంటర్ ఛేంజ్ ఫీజు. ఈ మార్పును  2023 ఏడాది ప్రారంభంలోనే ప్రకటించారు. ఆన్‌లైన్ వాలెట్ల వంటి ప్రీ పెయిడ్ చెల్లింపు సాధనాల ద్వారా రూ. 2 వేల కంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు 1.1 శాతం ఇంటర్‌చేంజ్ ఫీజు వర్తిస్తుంది. కొన్ని వ్యాపారాలకు మాత్రమే ఇలాంటి ఛార్జీలు పడతాయి. లావాదేవీలు చేసేటప్పుడు ఇతర అదనపు ఛార్జీలు ఏమి ఉండవు.

నేటికాలంలో ఆన్ లైన్, సైబర్ మోసాలు బాగా పెరిగి పోయాయి. ఇలాంటి మోసాలను తగ్గించుడానికి కేంద్రం యూపీఐ లావాదేవీల్లో మార్పు చేసింది. ఇంతకు ముందు లావాదేవీలు చేయని కస్టమర్ల మధ్య రూ. 2వేల కంటే ఎక్కువ విలువ గల తొలి చెల్లింపు కోసం 4 గంటల కాల పరిమితి ఉంటుందని భావిస్తున్నారు. త్వరలో యూపీఐ వినియోగదారులు ‘ట్యాప్ అండ్ పే’ ఫీచర్‌ని యాక్టీవేట్ చేయగలుగుతారు. అయితే దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అలానే  స్మార్ట్ ఫోన్ లో నియర్​ ఫీల్డ్​ కమ్యూనికేషన్​ చిప్​(ఎన్​ఎఫ్​సీ) ఉంటేనే ఈ ఫీచర్​ను వాడొచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో దేశవ్యాప్తంగా యూపీఐ.. ఏటీఎంలను ప్రవేశ పెట్టనుంది. ఈ ఏటీఎంలతో, కస్టమర్లు వారి బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా నగదు తీసుకోవడానికి క్యూఆర్​ కోడ్‌ని స్కాన్  చేస్తే సరిపోతుంది. ఈ ఏటీఎంల ఏర్పాటు కోసం ఆర్​బీఐ జపాన్​కు చెందిన హిటాచీ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇకపై యూపీఐ యాప్​ల నుంచి ఎవరికి డబ్బు పంపినా, వారి బ్యాంకు ఖాతాలో ఉండే పూర్తి పేరు డిస్ ప్లే పై కనిపిస్తుంది.

కొత్త ఏడాది కానుకగా యూపీఐ లావాదేవీలను పెంచనున్నారు. గత నెలలో రూ. 18.23 లక్షల కోట్ల విలువైన 12.02 వందల కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. నవంబర్​తో పోలిస్తే 5శాతం పెరిగింది. గత ఏడాది మొత్తం రూ.183 లక్షల కోట్ల విలువైన 11,700కోట్ల లావాదేవీలు​ జరిగినట్లు సమాచారం. అంతకుముందు సంవత్సరంతో  పోలిస్తే ట్రాన్సాక్షన్ల విలువ 59 శాతం పెరిగింది. ఇలా కేంద్రం తీసుకొచ్చిన కొత్త మార్పులు ఈ ఏడాది నుంచి అమలు కానున్నాయి. మరి.. యూపీఐ యాప్స్ విషయంలో వచ్చిన కొత్త మార్పులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments